(యం. దేవదాసు అయ్యగారి ఉపదేశములు)
1వ పాఠము(సంస్కార భోజనప్రియులు)
సంస్కార భోజనపరులారా తిండిబోతులారా! ఎందుకనగా మీరిదివరలో ఎన్నిసార్లు తిన్నారు? ఇన్నిసార్లు తిన్నందుకు తిండిపోతులు కాకపోతే మరెవరు? తిండిపోతులనే పేరు మనకున్నప్పటకిని సంస్కార భోజనము విషయములో తిండిపోతులనేది మనకు మంచి పేరే.
పోయినవారము సంస్కారము ఎక్కడో ఒకచోట తీసికొన్నారనుకొనండి. ఎన్నిసార్లు దొరికిన అన్నిసార్లు తీసికొనండి. పోయినవారము మంచి ఆహారము తిన్నాను. ఈ వారములో ఎందుకని ఎవరు అనరు. అలాగే సంస్కార విషయములో కూడ ఎవరు అనకూడదు. మన భోజనముకన్న ఈ భోజనము విలువైనదైయున్నది.
గృహములో భుజించు ఆహారము ఒక్క శరీరానికేగాని ఈ సంస్కార భోజనమైతే శరీరానికి ఆత్మకు భోజనమైయున్నది. ఇందు మూడు భోజనములు గలవు.
- 1వ భోజనము:- గృహములో తినే భోజనము
- 2వ భోజనము:- గుడిలో భుజించు సంస్కార భోజనము
- 3వ భోజనము:- రహస్యముగా ప్రభువే వచ్చి సన్నిధి కూటములలో తన భక్తులకిచ్చే సంస్కార భోజనమైయున్నది. ఎక్కడ విశ్వాసి సిద్ధముగా యుండిన అక్కడ ఆయన ఇచ్చును. దేవాలయములోనేకాదు. సన్నిధిలోకూడ ప్రభువు సంస్కార భోజనమిచ్చును.
దీనిని గురించి బైబిలుమిషనువారు బోదించుచు, అనుభవించుచున్నందున గొప్ప అవమానము చెడ్డపేరు వచ్చుచున్నది. ఎలాగనగా మా పాదిరిగార్లు ఇచ్చింది వట్టిదేనా? మేమందరము మా సంఘములలో మానుకొనవలెనా? అని అనేకులు ఆక్షేపించుచున్నారు.
నేటి ఉదయమున నా ప్రసంగాంశమేదనగా అది ప్రభువు రాత్రి వచ్చి ఇచ్చిన వర్తమానమైయున్నది. ప్రభువు చెప్పినది గనుక అది మహా విలువైనది. పాదిరిగారిచ్చేదే విలువైనదంటే ప్రభువు ఇచ్చు రహస్యమైన సంస్కారము ఇంకా విలువైనది. అలాగే పాదిరిగారిచ్చే వర్తమానము మహా విలువైనదైయున్నది. నా ప్రసంగాంశము కొంచెమేగాని చివరకు ఎక్కువకాదు. దానికి అంతమువరకు భుజిస్తున్నాము. చనిపోయి బ్రతికి మోక్షానికి వెళ్ళగా అంతములేకుండ అనంతకాలము భుజించుటయే ఇక్కడ మనకెదురుగాయున్న రొట్టె, ద్రాక్షరసము కొంచెము కొంచెమేగాని దానివలన కడుపునిండదు. అయినను కొంచెము కొంచెము గొప్ప భోజనమునకు గుర్తుగాన తప్పక దీనిని అనుభవించవలెను.
ఇక్కడ కొంచెము రొట్టె,. దానివెనుక గొప్ప శరీరము, కొంచెము ద్రాక్షారసము దానివెనుక గొప్ప రక్తప్రవాహమునకు ముంగుర్తెయున్నది. అయ్యో కొంచెము ద్రాక్షారసము కొంచెము రొట్టె అని అనుకోకుండ ఇవి గొప్పవానికి ముంగుర్తు అని అనుకొనవలసియున్నది. ప్రభువు తన శిష్యులకు పంచి ఇచ్చినప్పుడు ఇది రొట్టె ద్రాక్షారసమమని అనక ఇదినా శరీరము. నా రక్తమనే విచిత్రమైన మాట పలికిరి. ఆ చిన్న రొట్టె వెనుక పెద్ద శరీరానికి ముంగుర్తు అని తెలియుచున్నది.
రొట్టె ఆయనచేతితో వారికిచ్చుట ఎంత నిజమో నోటితో ఇది నా శరీరమని పలుకుటకూడ అంత నిజమైయున్నది. ఈ ప్రసంగములో ఇది మొదటిమాట. దీని ప్రక్కన మరొక మాటయున్నది.
ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడుకొందురో అక్కడ నేనుందునని అన్నారు. ఇద్దరు ముగ్గురుండేది చిన్న సంఘముగాని పెద్ద సంఘముకాదు. వీరే పండ్రెండు మంది అయిరి. వీరే పెరిగి నూట ఇరువదిమంది అయిరి. వీరు కొన్ని గంటలలో మూడువేలమంది అయిరి. ఇప్పుడు క్రైస్తవ సంఘము కొన్ని కోట్లలోనున్నది. ఈ కోట్లసంఘము ఇద్దరు ముగ్గురునుండి వచ్చిన భూమిమీదనున్న సంఘము మాత్రమే.
రెండవ వరుసలో పరలోకమందు చనిపోయియున్న జనాభా ఆదినుండి నేటివరకున్న వారే గొప్ప సంఖ్య. కోటానుకోట్ల భూలోకసంఖ్య ఇవియే లెక్కపెట్టుటకు వీలు లేకపోతే ఈలోగడ రక్షింపబడి భూలోకమునుండి వెళ్ళువారును, హెడెస్ లో మారుమనస్సుపొంది పైకి వెళ్లేవారున్నారు. వారిలో అసలే లెక్కింపలేము.
కాకానిలో ఒకమాట చెప్పినాను అదేమనగా హేడెస్ లో మారు మనస్సు పొందేవారుగాక భక్తులు భూలోకమునుండి వెళ్ళుటే గాక నరకద్వారము పెద్ద గుంపు నరకములోపడు తరువాయిలోనుండి దేవా తండ్రీ నీ నామమున ప్రవచింపలేదా, బోధింపలేదా, అద్భుతాలు చేయలేదా వారేనా మీ బిడ్డలు మేముకాదా! అని అంటుండగా; అక్రమము చేయువారలారా అని అన్నారు. వారినిగురించి (యం. దేవదాసు అయ్యగారు) ఏదో ఒక ఉపాయముపన్ని వారిజుట్టు పట్టిలాగి రక్షించుము తండ్రీ! అని ప్రార్థించినారు.
ఇంత భూమిని ఇంత ఆకాశమును రక్షించుటకు నీకు శక్తియున్నదే. వీరిని రక్షించుటకు నీకు శక్తిలేదా! అని వాగ్థానములన్ని ఎత్తి ఎత్తి అడుగగా అందుకు ప్రభువు వారికి నరకమని వ్రాసినాను ఇవ్వన్ని ఎత్తికొని ప్రార్ధించుటెందుకని అన్నారు. అప్పుడు నేను 1కొరింథి. 13వ అధ్యాయములో ప్రవచనములన్ని కొట్టివేయబడునన్నావుకదా! ఆ మాట కొట్టివేసి రక్షించుచున్నావు. గాన ఈ మూడు గుంపులు కలిపిన ఎంతగొప్ప సమూహమో! ఇద్దరు ముగ్గురనేది అయిపోయింది. కొంచెముగా రొట్టె ద్రాక్షరసమును, గొప్ప శరీర రక్తములను తలంచండి.
3వది:- ఈలోకములో ఎక్కువకాలము బ్రతికిన నూరేండ్లు ఎక్కడో ఇంకా కొందరు ఎక్కువకాలము బ్రతికినా అది లెక్కలోనిదికాదు. పలోకములో నూరు తొమ్మిదివందల కాదుకదా లెక్కపెట్టుటకు గణితశాస్త్రము పనికిరానంత కాలము బ్రతికెదము. శరీర బ్రతుకునకు సంబంధములేదు.
ఒకటవ గుంపు:- రొట్టె ద్రాక్షారసము
రెండవ గుంపు:- ఇద్దరు ముగ్గురనేవారు.
మూడవ గుంపు:- లెక్కపెట్టలేనన్ని మనిషి బ్రతికిన సంవత్సరములు.
నాలువగ గుంపు:- భూలోకములో మనిషి పుట్టి చనిపోవు వరకు అన్ని కష్టములే. చెడ్డవారికి హేడెస్సులోను కష్టములో మనిషి జన్మమే కష్టము. ప్రతి మనిషికి కష్టమే. నాలుగవ గుంపువారికి కష్టమే లేదు. మనలను పరలోకమునకు ప్రభువు తీసికొనివెళ్ళిన తరువాత ఇక కష్టముండదుగాని త్రిత్వ తండ్రికి దేవదూతలకు పరిశుద్ధులకున్న కష్టమేమనగా భూమిమీద ఉన్న వారింకా రక్షింపబడలేదనే కష్టమే కాబట్టి భూలోకములో కష్టములకాలము కొంచెమేగాని పరలోకములో కష్టముల. వాననయే యుండదు. ఇప్పుడు అందరు రక్షింపబడలేదనియన్నా నరకములోనికి వెళ్ళేవారు తిరిగి మోక్షమునకు వచ్చుటలో మహా ఆనందముగలదు.
ఐదవగుంపు:- కొంతమందికి ఒకబాధయున్నది. అదమేనగా నిన్నగాక మొన్న వచ్చినవారికి ప్రభువు కనిపించి మాట్లాడుచున్నారుగాని మేమెంత కాలమునుండి తపస్సుచేసిన మాకేమిలేదనుచున్నారు. మనము శాశ్వతకాలము పరిశుద్ధుల యెదుటను దూతల సమూహములోను ఏబేధములేక సహవాసములో యుందుము. ఇప్పుడు చూడలేకపోయినా త్రిత్వమును ముఖాముఖిగాచూచి మాట్లాడుదుము. కనబడలేదనే చింత ప్రశ్న ఉండక మాయమైపోవును. కాబట్టి కొంచెమే పుచ్చుకొనుచున్నాము అని అనుకొనకుండ ఎక్కువ అనుభవించుచున్నామని ఈ బల్లయొద్దకు రండి. కొంచెము, కొంచెము తీసికొనండి. ఏ విషయములోను సందేహములేకుండ వచ్చుటకు విశ్వాసము, ధైర్యము, బలము ప్రభువు అనుగ్రహించును గాక! ఆమేన్.