(యం. దేవదాసు అయ్యగారి ఉపదేశములు)
19వ పాఠము(సంస్కార సమాధానము)
దా.కీర్త. 150:2; మత్త 26:27,28; 1కొరింధి. 11:23-28
మనము అనేకమైన మర్మముల యెదుట ఉన్నాము
- 1) సూర్యచంద్ర నక్షత్రాదులు ఆకాశమందున్నవి. అవి క్రిందపడకుండ ఎట్లు ఉంటున్నవో మనకు తెలియదు. అదొక మర్మము.
- 2) దేవుడు మనిషిగా జన్మించుట అది ఒక మర్మము
- 3) సర్వలోక పాప పరిహారార్థమై సిలువపై మరణము పొందుట, అది ఒక మర్మము
- 4) దేవుడేలాగు మరణము కాగలడు?
- 5) సమాధి చేయబడుట ఒక మర్మము
- 6) పునరుత్థానమగుట
- 7) గాలిలో పరలోకానికి వెళ్ళుట. అదియొక మర్మము. ఇన్ని మర్మముల యెదుటను ఇంకా అనేకమైన మర్మముల యెదుటను మనము నిలువబడియున్నాము.
అలాగుననే యేసుప్రభువు తన శరీర రక్తములను ఏలాగు ఇస్తారో అదియును గొప్ప మర్మము. అయినను తక్కిన మర్మములు మనము నమ్ముచున్నట్లు ఈ మర్మమునుకూడా నమ్మితీరాలి. ఇట్లు నమ్మిన యెడల ఈ సంస్కార భోజనము వలన గొప్ప మేలు పొందగలము.
ఈ ఉదయం అయ్యగారు నాలుగు విషయములు మాత్రమే జ్ఞాపకము చేస్తున్నారు. ఆ నాలుగు ప్రభు భోజన సంస్కార చరిత్ర నుండి బైటికి తీసిన విషయాలు.
-
1. 11మంది శిష్యులు ఒక్క సంఘముగా ఏర్పడి
- (ఎ) ఏ విధమైన బేధాభిప్రాయములు
- (బి) విరోధములు
- (సి) ఏవిధమైన ప్రశ్నలుకూడా లేకుండా ఏక సంఘమై సంస్కారమును తీసికొన్నారు.
- 2. 11మందికి పాదాలు కడుగునప్పుడు ఎందుకని ఒక్కరన్నారు గాని, భోజనమప్పుడు ఒక్క ప్రశ్నరాలేదు. ప్రభువుతో పదకొండుమంది ఒకే స్థితిలో ఏకీభవించిరి.
యేసయ్య దీవించి, వారికి నా శరీరమని రొట్టె ఇచ్చినప్పుడు ఈ రొట్టె శరీరామేలాగైనదని ప్రశ్నించవలసింది. శరీరముగా ఈ రొట్టె ఏలాగు అందుచున్నదని ప్రశ్నించలేదు. గనుక ప్రభువుతో ఏకమైనారు. వారిలో వారైనా, ఒకరిపై ప్రశ్నలు వేసికోలేదు. 11మంది ఏకమైనారు. 11మంది ప్రభువుతో ఏకమైనారు. 11 మంది రొట్టెతో ఏకమైనారు. 11మంది సహవాసముతోను, సంఘముతోను, ఏకమైనారు వారే ఆదిసంఘము ఒక్కటెపోయిరి.
ద్రాక్షారసము రక్తమేలాగైనదని ప్రశ్నించలేదు. రక్తమేలాగు త్రాగము అని అసహ్యించుకొనలేదు. గనుక ద్రాక్షరసము విషయములోను 11 మంది ఏకమైరి వారు ప్రభువుతో ఏకమైరి.
లెక్కకు 11 మంది గాని ఇంకొక లెక్కకు ఒక్కటే సంఘము. రొట్టె ఒక్కటే దానిని విరిచి 11 ముక్కలుచేసి 11 మందికి ఇచ్చిరి. అనగా ఆ రొట్టెముక్కలు లెక్కకు 11 గాని, రొట్టె ఒక్కటే. అలాగే మనుష్యుల లెక్కకు వారు 11 మందేగాని, లెక్కకు ఒక్కటే సంఘము.
ద్రాక్షరసము 11 మందికి ఇచ్చిరి. 11 గుక్కలు అయినవి. లెక్కకు 11 గుక్కలుగాని, ఒక్క పాత్రలోనివే. ఒక వరుసకు ఒక లెక్క 11 ముక్కలు. మరల 11 మంది మనుష్యులు గుక్కలు 11. మూడు పదకొండ్లు ఒక వరుస. ఇంకొక లెక్కలో,
- ఎ) సంఘము ఒక్కటే
- బి) పాత్ర ఒక్కటే
- సి) రొట్టె ఒక్కటే,
- డి) గురువు ఒక్కటే.
11 మంది ఎగుడు దిగుడు లేకుండా సమానముగానున్నారు. ఒక్కప్పుడు ఈ 11 మంది మనలో ఎవరు గొప్పని ప్రశ్నించుకున్నారు గాని ఇక్కడ ప్రశ్నయేలేదు. అంతకుముందు మనలో ప్రభువు అప్పగించేదెవరిని సైగలు చేసికొన్నారు. ఇక్కడ సైగలేదు, ఎప్పుడిస్తారా తిందామనే ధ్యానముతోనే ఉన్నారు. వేరొక తలంపే లేదు. ఆ రెండు ఏమి ప్రశ్నలు లేకుండా పుచ్చుకొన్నారు. నమ్ముటలోను ప్రశ్నలేదు ఆయన మాటలన్నీ నమ్మిరి.
శిష్యుల దృష్టిలో ప్రభువు ఒక్కరే ఉన్నది. వేరొకటిలేదు. ప్రభువు ఇచ్చు రొట్టె, ద్రాక్షారసమేగాని, ఇంటివద్ద రొట్టెగాని, బజారు ద్రాక్షారసముగాని, వారి మనుస్సలో 11 మందికి ఒకరిని గూర్చి ఒకరికి తలంపేగాని ఇంకెవ్వరులేరు. 12వ వాని తలంపే వారికి లేదు. ఈ ప్రకారముగా
- (1) ద్రాక్షారసము
- (2) సంఘము
- (3) రొట్టె,
- (4) యేసు ప్రభువు ఈ నాలుగు ఒక్కటే ఒక్కమాట. ఒక్కపని, ఒక్క ఆచారము.
- ఎ) ఒక్క ఇష్టముమీద
- బి) ఒక్క విశ్వాసముమీద,
- సి) ఒక్కసంతోషముమీదే సంస్కారము గడిచిపోయింది.
ఇట్టిది లోకములో ఇంకొకసారి జరుగుట ఎన్నడు లేదు. “అది అసాధ్యము” ఎప్పుడైన జరిగినదేమో మనకు తెలియదు.
ప్రస్తుతము ప్రపంచములోని సంఘమును పరీక్షిస్తే జరుగుటలేదు. అప్పుడు 11 మందే సంఘము. ఇప్పుడు 80 కోట్లు. ఇంతపెద్ద సంఘము ఏ మతములోనులేదు. యేసుప్రభువు జీవముగలవాడు గాన, ఆయన సంఘము జీవము గలదైయున్నది.
11మంది విశ్వాసముగలవారైయున్నారు.
11మంది ఐకమత్యము గలవారు
11మంది సమాధానము గలవారు
11మంది సంతోషము గలవారు. మరల ప్రశ్నించని నమ్మిక 80 కోట్లు సంఘమున్నా ఇప్పుడుండుట కష్టము. అసాధ్యము అని నేను చెప్పుచుండగా విన్న మీరు పౌరుషము తెచ్చుకొని, 11మందికంటే గట్టిగా ఉండవచ్చు. గుంటూరులోనైనా, మన గుడిలో ఉన్నవారైనా, గట్టిగా ఉండవచ్చును. ఈ గుడిలోని వారైనా పారుషమస్తు తెచ్చుకొని ఉంటే మంచిది. ఈ ప్రసంగము అచ్చువేసి లోకమంతా పంచితే 11 మందేనా? మేమెందుకు గట్టిగా ఉండలేమని అంటే ఈ కాలపు సంఘము 11 మంది సంఘముతో ఏకమైపోతారు.
లూథరన్ బాప్టిస్టులున్నారు. వీరు వారి దగ్గర, వారు వీరి దగ్గర సంస్కారము బాప్తిస్మములు తీసుకొనరు. చర్చి మిషను వారి దగ్గర తీసికొనరు. మిషను, మిషను కలిసి తీసికోడానికి ఇష్టపడకపోతే 11 మందివలె ఏలాగుండగలరు?
వివాహమప్పుడు వారు వీరిని, వీరు వారిని పుచ్చుకొంటారు గాని సంస్కారము ఒక్క దగ్గర పుచ్చుకోరు. నేటి వరకు ఆ 11 మందితో సమానమైన స్థితి గలవారెవ్వరునులేరు. అయితే ఈ సంగతి 80 కోట్ల క్రైస్తవులకు అందిస్తాము. రోమన్ కథోలిక్కువారు ప్రొటస్టాంటులతో కలిసి తీసికోరు. సెవెంత్ డే వారు పెంతెకొస్తువారితో కలిసి తీసికోరు. భూమిమీద ఉన్న సంఘాలు గలిబిలిగా ఉన్నవి. సంస్కారములోనే కలవకపోతే పరలోకములో 7సం॥రాల పెండ్లి విందులో ఏకీభవించి మరుస్తారా? ప్రపంచములోని అన్ని శాఖలు అన్ని మిషనులవారు అక్కడుండాలి.
ఒక్క సంఘములోనే సాతాను విరోధము పెట్టగా ఒకరితో ఒకరు మాట్లాడుకోరు. ఒకరిమీద ఒకరు
- ఎ) చాడీలు
- బి) లేనిపోని మాటలు కల్పిస్తారు.
తమ విరోధులతో మాట్లాడ లేనివారు ఇక్కడకు, బల్ల దగ్గరకు సంస్కారము కొరకు ఏలాగు వస్తారు? 7సం॥రాల విందుకేలాగు వెళ్తారు? ప్రభు భోజన సమయమప్పుడెల్లా చెప్పిన మాటలున్ను ఈవేళ చెప్పినవి కలిపిన ఎన్నిమాటలు.
ఎంత పొడుగైనా మాటలు, ఇక ముందుకు చెప్పేవికూడా కలిపితే ఇంకా పొడుగగును. ఈ సారి సంస్కారము రాకడ వరకు మాత్రమే సాగుచుండును. అన్ని మిషనులవారి ప్రసంగాలు ఈవాలులోనే కలుపండి ఎంత పొడుగవునో?
రాజమండ్రిలో వృద్ధులైన దొరగారు సంస్కార సమయములో ఇప్పుడు మీరు సమాధానపడకపోతే అక్కడ ఏలాగు సమాధాన వడగలరు? అని గద్దించేవారట.
- 1) ప్రభువుతో,
- 2) సంఘముతో
- 3) రొట్టెతో,
- 4) ద్రాక్షారసముతో,
- 5) ఒక్కటై వారివలె ఉండేవారు.
ఇటువంటివారే ఈ భోజనానికి తప్పకుండా రండి.