(యం. దేవదాసు అయ్యగారి ఉపదేశములు)

16వ పాఠము(బెత్లెహేము కేక్)

The Cake of Bethlehem



బెత్లెహేము అనగా రొట్టెల ఇల్లు, ఆహారపు ఇల్లు. బెత్లెహేములో పుట్టిన రొట్టె యేసుప్రభువు. క్రిస్మస్ కేక్ ఆయనే. ఈ ఆహారము మనము భుజించుటకే ఆయన వచ్చాడు. ఆయన మనల్ని భుజింపచేయటానికే భూలోకమంతటిలో విశ్వాసులందరు ఆయనను భుజిస్తున్నారు.

1. రుచిగల ఆహారమైపోయారు:- కేక్ రుచా? రొట్టె రుచా? రుచిగల ఆహారముగా వచ్చాడు గనుక సంతోషము. క్రిస్మస్ రొట్టె అనరు. ఈ విందునకు వస్తున్నాము గనుక సంతోషముతో ఆయన ఇస్తున్నాడు. నా పిల్లలకు నేను ఆహారమై పోతున్నానన్నారు. అదే ఆయన సంతోషము.


భూలోకములోని కేక్ లకు రుచిలో తేడా ఉంటుంది. గానీ ఈ కేక్ అన్నిటిని మించిన రుచిగలది, బలకరమైనది.


ఆత్మీయ జీవితమునకు కావలసిన అన్ని విటమినులు కల్గిన కేక్, భూలోకములో తయారు చేసినదైతే లోటు ఉంటుంది. కానీ, ఇది పరలోకములో తయారు చేయబడినది. గనుక రుచిలో ఏలోటులేదు. నన్ను తినువాడు జీవముగలవారని పలికెను. నిత్య జీవము గలవారమే. నిత్యము జీవించువారమే. ఈ మహిమ ఆహారము పైలోకమునుండి వచ్చినది. మనలను మహిమకు తయారు చేయుటకు ప్రభువు చుట్టూ మహిమ ఉన్నది. గొర్రెల కాపరుల చుట్టూ ప్రభువు మహిమ ప్రకాశించినది.


పెండ్లికుమార్తెలమైన మనల్ని మహిమతోడ కప్పి మహిమ జీవులనుగా మార్చును.


మహిమ జీవులు అనగా దేవదూతలు. వారిచుట్టూ మహిమ ఉన్నది. పాపము చేయలేదు, అట్టి దేవదూతలనుగా తయారు చేయుటకు ఈ కేక్ వచ్చినది.


రుచికరమైనది కాదా!

బలకరమైనది కాదా!

నిత్యజీవమునిచ్చేది కాదా?


పిల్లలు రొట్టె కొరకు ఎలా ఎదురు చూస్తారో అలాగే నా కొరకు మీరు ఎదురు చూస్తున్నారు. గనుక డిస్ట్రిబ్యూట్ (పంచుతానన్నారు) చేస్తానన్నారు. మీ ఆకర్షణ నాతట్టున్నది గనుక నా పిల్లలకు అందిస్తానన్నారు.


1. మహిమ జీవులుగా రండి:- మహిమ జీవులుగా మార్చుటకు జనసంఖ్య కాలములో ప్రభువు పుట్టినారు. జీవపు రొట్టెయైన యేసుప్రభువు జీవగ్రంథములో పేరెక్కించుటకు నీలోనికి వెళ్లుచున్నారు. నా అంతరంగములోనికి రండి అని ఆహ్వానించుకొనండి.

నమాధానమిచ్చుటకు వచ్చిన కేక్ మీ కుటుంబములలో సమాధానమిచ్చును గాక! ఆమేన్. ఆదరించుటకు వచ్చిన కేక్ మిమ్ములను ఆదరించును గాక! ఆమేన్. నష్టపోయిన మిమ్మును మహిమతో నింపి పరలోకము నుండి మీ నష్టమును తీర్చునుగాక! ఆమేన్. ప్రభువు రూపమును, శుద్ధిని పెండ్లి కళనిచ్చి మహిమ వధువుగా సిద్ధపరచునుగాక! ఆమేన్.