(యం. దేవదాసు అయ్యగారి ఉపదేశములు)

3వ పాఠము(ఆకలి-దప్పులు)



ధ్యానవాక్యము : మత్తయి 5:6.


ప్రార్ధన:- దయగల ప్రభువా! నేను మరలా సమావేశము కాగల తరుణమిచ్చినందుకు స్తోత్రము. ప్రభువు భోజన సంస్కారమును వివరించుకోగల సహాయము అనుగ్రహించుము. రావలసిన వారిని రప్పించుము. దూతలను కావలి యుంచి దయ్యాలను వెళ్ళగొట్టుము. జ్ఞానం, మనస్సాక్షి విశ్వాసము, ప్రత్యక్షత, ధైర్యమును వెలిగించుమని వేడుకొంటున్నాము ఆమేన్.


మత్తయి 5:6లో మొదటి నీతి:- ఆ నీతి కొరకు మనకు ఆకలి దప్పులు కలిగియుండాలి. ఒక్క మాటలో చెప్పాలంటే బైబిలులో వ్రాయబడిన ప్రకారము నడుచు నీతి, రెండు ఉన్నవి.

మంచి బైబిలులో యున్నది. అది కావాలని కోరుకోవాలి. బైబిలు చదివి, ప్రార్థించి, ధ్యానించి, సహించి, సువార్త ప్రకటించి భక్తిగాయుండుట నీతి. బాప్తీస్మము పొందుటయు నీతిలో ఒకటి. ప్రభువు బాప్తిస్మమప్పుడు నీతి యావత్తు ఈలాగు జరుగునని నమ్మెను. కొండ ప్రసంగములో సెలవిచ్చినదంతా నీతే; ఇతర ప్రసంగాలలో సెలవిచ్చింది నీతే. ప్రవక్తల గ్రంథములలో ప్రకటించిందియు నీతే, మనము కోరవలసిందియు నీతే. మోక్షానికి వెళ్లుట. రక్షణ కోరుటయు నీతే, శరీర జీవనములో ఆకలిదప్పులు మనకు తెలియును. అలాగే ఆత్మ జీవనములో ఆకలి దప్పికయున్నది. శరీర జీవనంలోని ఆకలి మనకు తెలుసు. ఇది వస్తువు కాదు దప్పికయు వస్తువుకాదు. ఆకలి + దప్పిక ఇవి అనుభవములు. ఆకలి తీర్చేది ఆహారము. ఇది వస్తువు. దప్పిక దీర్చేది నీళ్ళు ఇది వస్తువు. అవి అనుభవాలు ఇవి వస్తువులు, ఆకలి వేయడము; ఆకలి తెలియడము ఆకలి దీరడము ఈ మూడును అనుభవములు.


ఆహారము:- నీళ్ళు చూపించగలముగాని ఆకలి చూపించలేము ఇది అనుదినము మనిషి జీవిత కాలములో అనుభవములును, వస్తువులును యున్నవి. సంస్కార సమయమందు అనుభవాలు వస్తువులు చూపించుచున్నాము.

ఆహారము ఆకలిమీద యుంటుంది. ఆత్మ జీవనంలో ఆహారము + నీళ్ళును యుండవలయును. శరీరానికి సంబంధించిన ఆకలి + దప్పిక 5:6లో ప్రభువు చెప్పలేదు. నీతిమీద ఆకలి దప్పికను గూర్చి ఆయన చెప్పెను. ఆకలి దప్పులు గలవారికే తృప్తి కలుగును. ఇక్కడ ఆకలి దప్పిక అనేవి అనుభవములు మనము కోరింది దొరుకుటే ఆకలి+దప్పిక దీరుట. ఇదే నీతి. నీతికి సంబంధించిన వరాలు, శక్తులు అవన్ని కోరుకోవచ్చును.


ఆకలి అనగా:- ఆశ ఊరికే ఆశించడమే, కొందరు ప్రార్ధనలో విశ్వాసం కోరుకొంటున్నారు. ప్రార్ధనంతా ఇదే ఆలాపన. ఆ ఆలాపనే ఆశ. దప్పిక కోరిక, నీతి ఆశ లేకపోతే ప్రార్ధనవల్ల లాభములేదు. ఆశ లేనిదే అడిగినది దొరకదు. ఆకలి దప్పిక తీరదు. ఆహారమెందుకంటె ఏది మనకు లేదో అది అనుగ్రహింపబడవలసింది ఇదే ఆహారము. తినవలసినదానికొరకు ఆశిస్తాము. ఇదే ఆహారము, మనకు ఏది ఇచ్చినాడో అదే ఆహారము ఆకలి తీర్చును. నీళ్ళు త్రాగేటందుకును అన్నం, కూర, పండ్లు ఆహారములోనివి, నీళ్ళులోనివి కాఫి, టీ, గంజి, ద్రాక్షరసం ఇవి నీళ్ళలోనివి. తినేవి ఆహారమును త్రాగేవి దాహము తీర్చేదియునైయున్నది. నేనిచ్చు నీటివల్ల దాహము తీరును. ఇక దాహము కాదని చెప్పెను. సంస్కార భోజనముకూడా వీటిలో ఒక భాగము. ఈ భోజనము నిమిత్తమై ఆశ, ఆకలి, దప్పిక ఉన్నదా? వీటిని అనుభవించిన హాయిగా ఉండును. ప్రభు శరీరమువల్ల నాకు ఆకలి తీరును. ప్రభువు రక్తమువల్ల నాకు హాయిగా ఉండును. ఎవ్వరికి ఆకలిగా, ఆశగా కోరికగా యుండునో వారికి ఆకలి తీరును. ప్రభువు జీవమును త్రాగినవారికి రక్తమును ప్రాణమునకు హాయిగా యుండును. ప్రభువు జీవముపై ఆశగలవారు దాహము గలవారు, కోరికగలవారు, పుచ్చుకుంటే హాయిగా ఉండును. ఎవరికి వారే పరీక్షించుకొండి. లోకభోజనం చేయుటకు మందముగాయుంటే భోంచేయము, ఇంకొకసారి త్వరగా ఆకలివుంటే ముందే తింటాము. వారికి తృప్తి, పుచ్చుకొనుటకు ఆతురత వుంటే ఆకలి తీరి తృప్తి కలుగును. అట్టి మనస్సుతో శరీర రక్తములు పుచ్చుకొన్న వారికి ఆకలి దప్పిక తీరి ప్రాణము హాయిగా ఉండును. ఆత్మ బలం కొరకు శరీరం, ఆత్మజీవము కొరకు రక్తము. రక్తములో జీవముందని బైబిలులో యున్నది. సిలువపై ఎర్రని రక్తము కాదుగాని దానిని మించిన జీవనము సంస్కార రక్తములోయున్నది.


2. పరీక్షలు:-