(యం. దేవదాసు అయ్యగారి ఉపదేశములు)

9వ పాఠము(వాక్యధ్యానము పాపశుద్ధి)



తినుటకు త్రాగుటకు ఏమియు దొరకని అరణ్యములో దేవుడు తన ప్రజలకు భోజనపు బల్లవేసెను. ఆరులక్షలకన్న ఎక్కువగానున్న వారికి నలుబది సంవత్సరములు పోషణ జరిపెను. ఇదెంత ఆశ్చర్యము! మరియొక అరణ్యములో అయిదు వేలమంది కంటె ఎక్కువమందికి ప్రభువు భోజనపు బల్లవేసెను. ఆయన వారికి అద్భుతమైనరీతిగా కావించిన ఆహారము వారికి తృప్తిపరచెను. ఇదెంత ఆశ్చర్యము! కరువు కాలములో ఏలియా అనుభక్తుని అరణ్యమునకు చేర్చి పక్షులచేత ఆహారము పంపెను. ఇదెంత ఆశ్చర్యము! ప్రభువు విశ్వాసులకు రెండువేల సంవత్సరములనుండి తన శరీర రక్తములను ఆహారముగా ఇచ్చుచున్నాడు. ఇది అన్నిటికంటె ఎంత ఆశ్చర్యము!


క్రీస్తుప్రభువుయొక్క శరీర రక్తములు విశ్వాసులకు అన్నపానములై యున్నవి అనుట అవిశ్వాసులకు కర్ణకఠోరముగా నుండును. మనము భుజించుమని మన శరీర రక్తకములవంటిదికాదు. అవి మహిమ వస్తువులు గనుక శ్రవణీయము ఒకటి ఇంటవిందన్ననూ, ఒక ఊరిలో సంతర్పణన్ననూ పరుగు. ప్రభు భోజనమన్ననో! భోజన సంస్కారాలోచన రాగా కరకరమని ఆకలివేయుచున్నదా? ఆకలిలేనియెడల ఆత్మలో ఏదో ఒక జబ్బు అని గ్రహించుకొనవలెను. ఆకలి లేనిదే ఎవరన్నము తిందురు? ఈ పత్రిక చదువుకొని మీరెట్లు సరందమౌదురో!