(యం. దేవదాసు అయ్యగారి ఉపదేశములు)
27వ పాఠము(ప్రియుని విందు)
నాకు నా ప్రియుడు ఏన్గెది ద్రాక్షావనములోని కర్పూరపు పూగుత్తులతో సమానుడు. ప॥గీ॥ 1:14
పై వచనములో ప్రియుడైన యేసుప్రభువు యొక్కయు వధువు సంఘము యొక్కయు పరిమళ వాసన కలవారని వింటిమి. ఇక్కడ ప్రియుడు కర్పూరపు పూగుత్తులతో సమానుడని వధువు పలుకుచున్నది. ప్రియుని లోకములో ఉన్న విలువైన వాటికిని, పరిమళమైన వాటికిని పోల్చుచున్నది. సృష్టికర్తయైన ప్రభువు నుండి సమస్తము కలిగినది గనుక ఆయన స్వరూపమును చూచుచు సృష్టిలోని వాటికి ఆయనను పోల్చి చెప్పుచున్నది. పరమునకు వెళ్లిన తరువాత అక్కడ స్థితి వేరుగా ఉండును. గనుక ఆ స్థితినిబట్టి అక్కడ వర్ణించును. ప్రభువుకూడ సంఘము ఇక్కడ ఉన్నంతవరకు సృష్టిలో ఉన్నవాటిని ఎత్తి సృష్టిలోని వధువు రూపమును వర్ణించును. పరమునకు వెళ్లిన తరువాత అక్కడ ఉన్న స్థితినిబట్టి వర్ణించుచునే ఉండును.
- పాలెస్తీనా
- 1) క్షమాపణ-ఏన్గెది (యెహోషువా 15:61-63; 1సమూ. 2; 1సమూ. 23:29వ. 24:1-7) 2దిన. 20:2 యెహెజ్కేలు 47:10). |
- 2) ప్రేమ - ద్రాక్షావనము - యూదా జనాంగము (కీర్త 80:8-14; యెషయా 5:1-7; మత్తయి 21:33; యోహాను 15:1). |
- 3) చేదు - కర్పూరపు వృక్షము - క్రీస్తుప్రభువు జీవితము (హెబ్రీ. 5:7).
|
పూగుత్తులు - ఫలితములు
|
నాకు నా ప్రియుడు నా కొరకు సర్వమును కలుగజేసి నా కొరకే నరుడుగా లోకమునకు వచ్చి సిలువ మరణము పొంది పునరుత్తానుడై పరమునకు వెళ్లి అక్కడ నా కొరకు స్థలమును సిద్ధపరచి రెండవమారు వచ్చి నన్ను తీసికొని వెళ్ళి ఆయనలో నేనును, నాలో ఆయనయు యుగయుగములు జీవించుదుము. ఇవన్నియు నా కొరకు చేసెను గనుక నాకు నా ప్రియుడు.
- పాలెస్తీనా దేశము దైవవాగ్ధాన జనమైన ఇశ్రాయేలీయుల దేశము. ఈ దేశము సర్వలోకమునకు మధ్య నున్నది. సర్వలోక రక్షకుడైన క్రీస్తుప్రభువు ఈ దేశమునందు జన్మించెను.
- 2) ఏన్గెది:- ఈ పాలెస్తీనా దేశమందు హసన్ తామార్ అను ఏన్గెది స్థలమున్నది. ఇది మృత సముద్రమునకు సమీపమున కలదు. 2దిన. 20:2. దావీదు పౌలుచేత తరమబడును ఏన్గెది కొండ స్థలములలో నివాసము చేయుచుండెను 1సమూ. 23:29. దావీదు ఏన్గెది అరణ్యమందున్నాడని సాలు తెలిసికొని దావీదును వెదకుటకు వచ్చెను. సౌలు దావీదు ఉన్న గుహలోనికి శంకనివర్తికై వెళ్ళెను (మల విసర్జనకై) ఆ గుహలో దవాదు ఆయన సైన్యము ఉన్నారు. ఆ గుహలో దావీదు చేతికి సౌలు చిక్కినను చంపక విడిచిపెట్టి వస్తపు చెంగు కోసెను. దానికై దావీదు యెహోవాచేత అభిషేక్షము నొందిన నా ప్రభువైన సౌలునకు ఈ కార్యము చేయననెను. 1సమూ. 24:1-6. శత్రువైన సౌలు దావీదు చేతికి దొరికినను చంపక క్షమించి విడిచిపెట్టెను. ఈ స్థలము చంపుచున్న శత్రువులను క్షమించు స్థితిని కనబరచుచున్నది.
-
3) ద్రాక్షావనము - యూదాజనాంగమునకు పోల్చబడియున్నది. ఐగుప్తు నుండి ఒక ద్రాక్షవల్లిని తెచ్చి పాలెస్తీనాలో నాటెను. అది అన్ని స్థలములకు వ్యాపించెను కీర్తన 86:8-14. సత్తువ భూమిగల కొండమీద నా ప్రియునికొక ద్రాక్షతోట ఉండెను. యెషయా 5:1. ఈ ద్రాక్షతోట ఇశ్రాయేలీయుల వంశము. సైన్యములకు అధిపతియగు యెహోవా ద్రాక్షాతోట యెషయా 5:7. ప్రభువు ద్రాక్షతోటగు యూదులకు పోల్చిచెప్పెను మత్తయి 21:33-45. ఈ జనాంగమే సర్వజనులకు రక్షణ తెచ్చిన రక్షకుడు జన్మించిన జనాంగము. దేవుని అంతరంగములోని ఆయన కార్యక్రమమును, లోకమునకు బయలుపరచిన బైబిలు గ్రంథ జనము. సర్వలోకమునకు సువార్తను ప్రకటించుచు రక్షణ, మోక్షప్రవేశము కలదని అనుభవములో కనబరచుచు, లోకమునకు ఉపయోగకరమైన అనేక ఉపకారములను చేయుచు పారమార్ధికమైన జ్ఞానమును, ఇహలోక జ్ఞానమును, లోకమునకందించిన క్రైస్తవ సంఘ స్థాపనజనము. నిరంతరము స్తోత్రార్హుడైన దేవుడు శరీరధారిగా యేసుక్రీస్తను నామమున ఈ జనాంగమునందే జన్మించెను రోమా 9:5. ఈ క్రీస్తే ద్రాక్ష తోటయైన యూద జనాంగము నుండి వచ్చిన ద్రాక్షవల్లి యోహాను 15:1. ఈ ద్రాక్షవల్లినుండి ద్రాక్షరసము వచ్చెను అనగా ఆయన పావన రక్తమే మత్తయి 26:26-30. ఈ ద్రాక్షారసము ప్రభువుయొక్క ప్రేమను సూచించుచున్నది ప॥గీ। 1:2.
ఏన్గెది అను స్థలమునందు దావీదు క్రీస్తు ప్రభువు పాపులను క్షమించిన క్షమాపణ రూపమునకనబరచెను. అందుకు క్రీస్తుప్రభువు దావీదు కుమారుడుగా ఎంచబడడెను. ద్రాక్షవనము క్రీస్తుప్రభువు యొక్క ప్రేమను ఈ రెండింటిని క్రీస్తుప్రభువు సిలువలో కనబరచెను. ప్రభువు పాపులను సిలువలో క్షమించుటద్వారా ప్రేమను చూపెను. ప్రేమనుబట్టియే క్షమించెను.
- 4) కర్పూర వృక్షము - ఇది చేదుకు గుర్తు. అట్లే క్రీస్తు ప్రభువుయొక్క శ్రమ చరిత్ర కర్పూరముకన్నా చేదు. ఆయన జన్మము మొదలు ఆరోహణము వరకుగల జీవితములో ఇట్టి చేదువంటి శ్రమను చూడగలము హెబ్రీ. 5:7. పరిశుద్దుడైన దేవుడు పాపియైన నరరూపమందు జన్మించుట చేదువంటి శ్రమయై యున్నది.
దేవుని అంతరంగ వాసియైన ప్రభువు జన్మించినప్పుడు స్థలము లేక పశువుల తొట్టెలో పరుండబెట్టుటయే శ్రమ ఆయన కలుగజేసిన మరియ యోసేపులను తల్లి, తండ్రి అని పిలుచుటయే శ్రమ. పాపి మానవునివలె ఆయన కలుగజేసిన యోహానువద్ధ బాప్తిస్మము పొందుటయే శ్రమ. సర్వశక్తిగల దేవకుమారుడు అపవాదిచేత శోధింపబడుటయే శ్రమ. మానవునివలే పరిశుద్దాత్మను పొందుటయే శ్రమ. ఈయన బోధను విని ఈయన మరియమ్మ కుమారుడు కాదా! అని హీనముగా మాట్లాడబడుటయే శ్రమ. పక్షవాతరోగి పాపములను ప్రభువు క్షమింపగా పాపములు క్షమించు అధికారము ఈయనకెక్కడిది అని వారు పలుకుటయే శ్రమ. సేన దయ్యములను వెళ్ళగొట్టినప్పుడు ఆ ప్రాంతవాసులు మా ప్రాంతమును విడిచి పొమ్మనుటయె శ్రమ. దయ్యములకు అధిపతియైన బయెల్జబూలు వలన ఆయన దయ్యములను వెళ్లగొట్టుచున్నాడనుటయే శ్రమ. నాలుగు దినములు సమాధిలో ఉన్న లాజరును ప్రభువు బ్రతికించినప్పుడు ఆయనను లాజరును చంప నాలోచించుటయే శ్రమ. తుఫాను సమయమప్పుడు శిష్యులు ప్రభువు వారితో ఉన్నను భయపడి ప్రభువా! నశించిపోవుచున్నాము. నీకు చింతలేదా? అని పలుకుటయే శ్రమ. క్రీస్తుప్రభువు కడవరి రాత్రి శిష్యుల పాదములు కడుగుటయే శ్రమ. ఆయన శిష్యులలో ఒక్కడైన ఇస్కరియోతు యూదా ప్రభువును విడిచిపెట్టి పారిపోవుటయే శ్రమ. గెత్సేమనె తోటలో శ్రమపడుట ఆయనను పట్టుకొని నేరస్తునివలె సంకెళ్లు వేయుట, తీర్పుచేయుట ముండ్ల కిరీటము వేయుట, కొరడాతో కొట్టుట, అవమాన పరచుట, నేరములు మోపుట సిలువవేయుట, సిలువ మోయబడుట, దాహముగొన్నప్పుడు చేదుచిరకను ఇచ్చుట. ఇట్టివి అనేకములు, ఆయనకు చేదువంటి శ్రమలే. వీటన్నిటికన్నా సిలువలో ఉండి ఆయనను చంపుచున్న శత్రువులను క్షమించుమని తండ్రిని వేడుకొనుటయే ఎక్కువైన చేదు. ఆయన దాహము తీరుటకు శత్రువులు చేదు చిరకనిచ్చిరి. దానిని త్రాగుటకు ప్రభువు ఇష్టపడలేదుగాని పాపుల రక్షణ మహిమ కొరకు ఎంతటి చేదు శ్రమనైనను అనుభవించెను. కర్పూరము వలన క్రిములు నశించును. అట్లే ఈ కర్పూర వృక్షమైన క్రీస్తుప్రభువు శ్రమ మరణ పునరుత్ధానము వలన కలిగిన ఫలితములే సాతానుయొక్క క్రియలను లయపరచెను 1పేతురు 2:24; 1యోహాను 3:8.
కర్పూరపు పూగుత్తులు:- క్రీస్తుప్రభువు శ్రమవలన కలిగినప్పుడు ఆనందకరమైన ఫలితములే. ఈ పూగుత్తులు
- ఎ) క్రీస్తుప్రభువుయొక్క జన్మము మొదలుకొని ఆరోహణము వరకున్న ఆయన జీవితమంతటిలో మానవులకు ఇహపర సంబంధమైన ఉపయోగకరముగా నుండి వారి అంతరంగములను ఆయన తట్టు ఆకర్షించుననే ఈ పూగుత్తులు
- బి) ఆయన శ్రమలోచూచిన సహనరూపమే. లోకమునకు పరిమళమిచ్చు వివిధములైన పూగుత్తులవంటివి.
- సి) ఆయన శరీరమునుండి కారిన ప్రతి రక్తపు బొట్లు వలన శుద్దీకరింపబడిన విశ్వాసులే వివిధ పరమళములు గల పుష్ప గుత్తులైయున్నారు. ఆ రక్తపు ధార వలన సర్వసృష్టికి కలిగిన ఫలములే ఈ పూగుత్తులు రోమా. 8:19-22.
- డి) సిలువలో ఆయన పలికిన పలుకులే అన్ని కాలములలో అన్ని లోకములలోను యుగాంతముల వరకును అన్ని వివిధములైన పరిమళమును వెదజల్లు పుష్ప సముదాయములై ఉన్నవి.
ప్రియ చదువరీ ప్రభువు శ్రమల వలన పుష్పమువంటి ఆనందకరమైన ఫలములు కలిగినట్లు మీ జీవితములలో కలిగిన శ్రమలవలన కూడ మీకును ఇతరులకును ఆనందకరమైన అనుభవములు కలుగును గాక!