(యం. దేవదాసు అయ్యగారి ఉపదేశములు)

6వ పాఠము(రెండు అద్భుతములు)



దా.కీర్తనలు 23:5; లూకా 22:14 1కొరింథి. 11:23.


ఈవేళ సంస్కార భోజనము. అందుచేత ఆ అంశముమీదనే వర్తమానము వినవలెను. అనుదినము మనము భుజించు ఆహారమునకు వేరైనది, ఆకలి తీరనదియు, ఆత్మకు ఆకలి తీరే భోజనము శరీరమునకు కాదు. ఈ దినము నేను రెండు అద్భుతములు జ్ఞాపకము చేస్తాను.


ప్రభువు భోజనములో ఇమిడియున్నవి. అందరికి తెలిసేయున్నవి.

మన విషయములో జరిగిందేకాదు. ఆయనచేసిన అద్భుతము మనము పుచ్చుకొన్న తరువాత మారిన అద్భుతం. అయితే ఈవేళ అదికాదు. ఆయన 2సార్లు ఇస్తున్న భోజనములో జరిగిన అద్భుతము. ఈ పాఠములో రెండు మాటలున్నవి.

మీకొరకియ్యబడు శరీరమేలాగు శిష్యులలోనికెళ్తుంది. శరీర మెదురుగా కనబడుచున్నది. అదెలాగు జరుగును. ఎదురుగా ఆయన నిలబడినాడు. ఇదినా శరీరమన్నాడు. అది అద్భుతము. మీకొరకియ్యబడు రక్తమన్నాడు అది ఇంకొక చిత్రము. చిందింపబడు రక్తము. ఇవ్వబడు శరీరమన్నారు. సిలువపై నెక్కకముందే చెప్పెను. గురువారము భోజనము శుక్రవారం సిలువ; చిందింవబడే రక్తమే మనకందించిన రక్తమన్నాడు. ఈ మాటలు రెండు పాఠములో దాగిన రెండు మాటలు. మన మనస్సులో ఒకటే ఉంటే గ్రహిస్తాము. చిక్కే విడిపోవును. ఆపై రూపానికి మనిషి అంతరంగమందు ఆయన దేవుడు మనిషి రూపు అయినా ఆయన దైవత్వము పోలేదు. దైవత్వమునకు ఒకశక్తి ఉన్నది. అదే రాబోయేది. ఇప్పుడు ఇవ్వగల శక్తి శరీరానికి లేదు. ఆయన శరీరము మన శరీరముమీద పాపములేని పిసర ఎక్కువగా ఉన్నది. మన శరీరమే నరస్వభావము పాపమేగాని అది ఆయనకులేదు. దీనివల్ల ఆయన శరీరము రక్తము ఇవ్వగలడు. అయితే ఇవ్వడము చిందించడము రెండు కనిపించుచున్నవి. శరీరమెట్లు ఒకదరినుండి ఇస్తున్నారు. ఆయన శరీరజీవము ఆరంభించినది మొదలు ఆయన శరీరమిస్తూనేయున్నాడు.


ఆయన శరీరం మనుష్యులకుపయోగార్ధము వాడెను. రోగులాయనను ముట్టిరి. మనకాయన శరీరమిచ్చెను. చంటి బిడ్డలనెత్తి దీవించినాడు. ఆలాగువాడెను. ఈ ప్రకారము జీవితకాలమంతా పనులలో జీవించుటలో వాడినాడా లేదా? తలితాకుమీ అని యాయీరు బిడ్డను చేయిపట్టి లేవనెత్తి వాడినాడా లేదా? పేతురత్తను జ్వరము నుండి లేవనెత్తనాడాలేదా? యీవిధంగా తన జీవితకాలమంతయు వాడెను. ఆయన పుట్టింది మొదలు మరణమువరకు శరీరాన్నిచ్చెను. సంస్కార సమయములో ఇచ్చినది మర్మముగాను శిష్యులందుకొనుటయు మర్మముగానే యున్నది రక్తము అలాగే.


2. చిందింపబడుచున్న రక్తము ఎలాగో అర్థంకాదు. ఆయన పుట్టుక మొదలు నిందలు, నేరములు, పిచ్చి, దయ్యములు పుట్టినవాడని త్రాగుబోతని కలహమునకు ప్రజలను లేపువాడని, చిక్కు ప్రశ్నలు, మొండివాదములు తరచుట తుదకు మరణము. ఈ శ్రమలే రక్తము చిందించుటయైయున్నది. సాధారణముగా చెమటవూర్చి రక్తము ధారపోసి పనిచేస్తినంటారు. ఆయన శ్రమలు రక్తము చిందించిన దానితో సమానము. హెబ్రీలో ఆయన ప్రతిదినము రోధన చేసెను రోజు దుఃఖము అదే రక్తము చిందించుట. శుక్రవారము అసలు కార్చెను. దానికి ముంగుర్తు రక్తముకార్చను. శుక్రవారము తానే శత్రువులకు అప్పగించుకొనెను. గురువారము తన శిష్యులకు తన శరీరమిచ్చెను. ఆయన అప్పగింపబడినది రాత్రిలోనే అని వ్రాయబడియున్నది. అప్పుడును శరీర రక్తాలు ముందే ఇవ్వగలడు ఇది మొదటి అద్భుతము.


2వ అద్భుతము:- పునరుత్థానము తర్వాత రెండువేల సం॥ల నుండి తన విశ్వాసుల క్రీస్తునైయున్నాడు. 2వేల సం॥ల నుండి ఉన్నది మహిమ శరీరము, మహిమరక్తము, పాతశరీరము గతించెను. పాతదున్నప్పుడే ఇస్తే ఇప్పుడివ్వలేడా?


శరీరము విశ్వాసులకిస్తే తరగాలి. పాపశరీరమైతే తరుగును గాని పాపములేని పాతశరీరము తరుగదు. క్రొత్త శరీరము, క్రొత్త రక్తము అసలే తరుగవు. తరుగనేది ఆయన శరీర రక్తాలకులేదు గాన తరుగుటనేది అప్పుడు ఇప్పుడులేదు. రెండవది నమ్ముట సుళువేగానీ మన శరీరమునకివ్వగలడు పునరుత్థాన శరీరమింకా రాకపోయిన పాపములేని శరీర మివ్వగలిగెను.


శిష్యులకిదేమో అదెందుకో అదెట్లు వారిలోనికి వస్తున్నదో తెలియలేదు. రొట్టె ద్రాక్షరసము కనబడెను. రెండు, వారిలోనికి వెళ్ళినట్టు తెలిసినదిగాని శరీరము రక్తము ఎట్లు వెళ్ళెనో అది వారిలోనికి వెళ్ళినట్లు తెలియకపోయినా నమ్మిరి. ప్రభువు చెప్పింది నమ్ముటే వారి పని; వారు అమాయకులు. ప్రశ్నలు వారికిలేవు. అదే గొప్ప విశ్వాసము విశ్వాసానికి ప్రశ్నలులేవు తృప్తిఉండును. అవిశ్వాసానికవిలేవు. వారికి దేవుడని బాగా తెలిసిపోయి ఆయన చెప్పిందెల్లా నమ్మినారు. గనుక ఈదిన సంస్కార సమయములో మనము చేయవలసిన గొప్ప పని ప్రభువుయొక్క శరీర రక్తములు విశ్వాసముతో పుచ్చుకొనవలెను. పౌలు చెప్పినట్లు అవిశ్వాసముతోగాని సరియైన ప్రవర్తనలేక పుచ్చుకొంటే అదే కళంకము. మన హృదయములో కళంకములేకుండా చేయుట, అదెలాగు? అదెప్పుడు అనే అవిశ్వాసములేకుండా తీసికొంటే అదే కళంకములేని యోగ్యత. అలాగనుకోకుండా తీసికొంటే అయోగ్యత, దానివల్ల మేలుకాదు. కీడువచ్చును. గాన జాగ్రత్తగా తీసికొనుటకు రండి. ఈ మాటలెప్పుడు చెప్పని మాటలు ఇదివరకు రొట్టె ద్రాక్షారసముతో ఏకముగా శరీరము, రక్తము ఇస్తూన్నారనేది నిజమే అలాగు నమ్మి మీరు తీసికొను రొట్టెతో శరీరము నాలోకి వెళ్ళిందని నమ్మండి. కనబడేది నమ్ముటగాదు. నిశ్చయముగా కనబడనిది నమ్ముట నిశ్చయముగాన పైచెప్పిన రీతిగా నమ్మి రండి. లోపములు తీసివేసికొనుట మనముచేయు అద్భుతము ఆయనచేయు అద్భుతము పంచిపెట్టుట గనుక రొట్టె ద్రాక్షారసము రక్తము శరీరము ఈ నాల్గు ఏకకాలములో తీసికొనుచున్నామని నమ్మి రండి. ఈ కొద్దిమాటలు మీకు సిద్ధపడే మాటలుగా అందునుగాక! ఆమేన్.