(యం. దేవదాసు అయ్యగారి ఉపదేశములు)
17వ పాఠము(జీవాహారము)
యేసుప్రభువు చెప్పెను “జీవాహారమును నేనే” యోహాను 6:35.
ఈ రొట్టె అధ్యాయములో యోహాను 6వ అధ్యాయము (The Bread chapter) ప్రభువు ఆయనే అసలైన ఆహారమైయున్నారని నిత్య జీవము నిచ్చు
ఆహారము
ఆయనే అని వివరము బోధించెను. ఆయనే అక్షయ ఆహారమని కూడ వినిపించును. క్షయమగు ఆహారము కొరకు కష్టపడకండి అక్షయ ఆహారము కొరకు
పాటుపడండి అని చెప్పెను. ఇదే నిజమైన ఆహారమనికూడ మరియొక నామము. ఈ ఆహారమునకు ఆయనే పెట్టెను. భూలోక జీవితము కొరకు తినే
ఆహారములన్ని క్షయమైనవే నశించిపోవునని రాబోవు పరలోక జీవితము, భూలోక జీవితము కలిగియున్నాముగాని రెండవ బ్రతుకులేదు. వీటినే
మామూలు జీవితము, అంతరంగ జీవితము అనికూడ అంటారు. రెండు జీవితములు కలిగినవారు ప్రభువును కలిగియున్నారు.
ఒక్క జీవితము అనగా
భూలోక జీవితమున్నవారు బ్రతికి ఉన్నను చచ్చినవారే. జీవించి ఉన్నను మృతులే. బహిరంగ జీవితము, అంతరంగ జీవితము. ఈలోకములోనే
రాబోయే
జీవితము పరలోకములో దీనికొరకు సిద్ధపడుట, రాబోవు జీవితము కొరకు ప్రయాసపడుట గలిగియున్నారా? మన ప్రయాసమంతా లోకజీవనము కొరకే.
శరీర జీవితము, బహిరంగ జీవితము కొరకే అనగా పొట్టకొరకే. ఎంత ప్రయాసపడుచున్నాము? అంతరంగ జీవితము కొరకు పిల్లలను ఏ పాఠశాలలకు,
యే
కళాశాలలకు పంపుచున్నారు? ఈ జీవితము ఆ నిత్యజీవితములోనికి వెళ్ళేది. ఆ జీవితము శాశ్వతమైనది. మీ ప్రయాసమునకు ప్రతిఫలము
లేకుండా
చేయరు. నిరాశపడకండి. నిత్య జీవితమునకుకూడ మీ పిల్లలను తయారు చేయండి. ఇది తల్లిదండ్రుల బాధ్యత. దేవుడు మనకు బహుమానములుగా
మనకిచ్చిన పిల్లలను ఎలా పెంచుచున్నాము. ఆత్మీయ జీవనము, నిత్యజీవమునకు తయారు కాకుండ సాతాను ఆటంకములు కలిగించు చున్నది.
దేవుడు
ఊరుకొనడు. శ్రమల గుండములోనికి దింపి “దైవభక్తి” అనే భూలోకమునకు పరలోకమునకు పనికివచ్చు విద్యనేర్పగలరని పౌలు
వ్రాయుచున్నాడు.
ఈ విధి కొరకు పిల్లల విషయములో ప్రభువును ఆశ్రయించండి. భూలోకములో మంచి విద్యనిచ్చి ఆత్మీయముగ నరకమునకు మీ పిల్లలను పంపించుట
న్యాయమేనా? రాబోవు మహిమ జీవితము అంతరంగ జీవితము, బహిరంగ జీవితము రెండును బాగున్నవి. ప్రభువును ప్రేమించినాడు,
గౌరవించినాడు.
రెండు జీవితములను బాగుగా కాపాడుకొన్నాడు. గనుక చివరి సింహాసనమెక్కినారు. తనవారందరిని, ఇతరులను రక్షించెను. ఈలాగున్నారా?
2) దానియేలు: రెండు జీవితములు బాగున్నవి. ఎల్లప్పుడు ప్రభువు మిమ్ములను శ్రమలో నుంచడు. ఈలోకములో, పైలోకములో నడిపించు ప్రభువును సంపాదించుకుందాము అన్ని జీవులకు జీవమునిచ్చే జీవాహారమైన ప్రభువును అందుకొనుట ఏలాగు?
- 1) వాక్యాహారముద్వారా
- 2) ప్రార్ధనాహారముద్వారా
- 3) ధ్యానాహారముద్వారా
- 4) గానాహారముద్వారా
- 5) సన్నిధి ఆహారముద్వారా
- 6) అనుభవ ఆహారముద్వారా
- 7) ప్రభువిచ్చు సంస్కారాహారము ద్వారా.
- 1. వాక్యాహారము:- యేసుప్రభువే వాక్యము. బైబిలులో ఆయన మాటలున్నవి. ఆయనే ఆహారము గనుక అందుచున్నారు. చదువుటవలన, వినుటవలన, ఇతరులకు వినిపించుటవలన, ఈ ఆహారము అందుకొనగలము.
- 2. ప్రార్ధనాహారము:- అన్ని విన్న పనులు ప్రభువుతో చెప్పుకొనుట, ఆయనతో పరిచయముగా మాట్లాడుట స్వంతజీవితము కొరకు సృష్టి అంతటికొరకు విన్న పనులు చేయుటద్వారా జీవాహారము నందుకొనగలము.
- 3. ధ్యానాహారము:- దేవునిని ధ్యానించుట, ఆయన తలంపుతోనే నిశ్శబ్దముగా తలంచుట. ప్రభువు కనబడువరకు మాట్లాడువరకు కనిపెట్టుకొని యుండుటద్వారా జీవాహారమైయున్న ప్రభువును అందుకొనగలము.
- 4. గానాహారము:- దైవసంకీర్తనము చేయుటద్వారా బలము నందుకొనగలము. శ్రమలలో కీర్తనలు పాడిన సంతోషము బలము కలుగును. పౌలుసీల రక్తములు కారుచుండగా కీర్తనలు పాడి జయముపొందిరి. ఇదే జీవాహారము నందుకొనుట.
- 5. దైవసన్నిధాహారము:- ప్రభువుతో సహవాసములోనుండుట, రూపమును అద్దుకొనుట. అలాగే ప్రభువు తన రూపమును మనలో అద్దుట జరుగును. కోడిగ్రుడ్లు తల్లి క్రిందనుండి అవయవములను బ్రతుకును అందుకొను నట్టి అంతస్టు. ఇక్కడ విశ్వాసి ప్రభువు రూపమునకు మారును. రాకడకు సిద్ధపడును. ఇది జీవాహారమైన ప్రభువునందుకొనుటే.
- 6. అనుభవాహారము:- పై వాటన్నిటివలన జీవాహారము నందుకొననందున అనుభవము సంపాదించుకొనగలము. ఈ అనుభవమువలన ఆటంకములను జయించు శక్తి, శ్రమలను జయించు బలముతో రాకడకు ఆయత్తపడుదుము. సాతానుకూడ వచ్చును. మన పాపజీవితము చూపించును. అనుదినము భుజించుటద్వారా జీవాహారమును అనగా ప్రభువు నందుకొని నిత్య జీవనమునకు ఆయత్తపడగలము.
- 7. ప్రభు సంస్కార భోజనము: - పై వాటన్నిటిని మరుగుగా మనలోనికి వెళ్లుట. ఇక్కడ బహిరంగముగ శరీర రక్తములద్వారా ప్రవేశించుట (మనలో) యోగ్యముగా తీసికొనువారిలోనికి బహిరంగముగా వెళ్లుట అనే పని ప్రభువు చేయును. అయోగ్యత అనగా అపవిత్రత, అవిశ్వాసము, నామకార్థము అలవాటు ఇవి వద్దు. యోగ్యత అనగా పరిశుద్ధత, విశ్వాసము, నూతన ఉత్సాహము. విందు అంటే సంతోషముగదా! బలమునకు సరిపడు ఆహారపదార్థములన్ని ఇందుగలవు. దీనిలో అంతరంగ సంస్కారముకూడ గలదు. అనగా సంఘనాయకులు, పాస్టర్లు ఇచ్చు రొట్టె ద్రాక్షారసములు కాకుండా ప్రభువే స్వయముగా తన శరీర రక్తములు విశ్వాసులకిచ్చును. ప్రభువు పాద సన్నిధిలో నుండువారికి ప్రభువిచ్చు విందు. ప్రభువిచ్చు ఈ గొప్ప అనుభవము కొరకు ఓపికతో ఆయన పాదములయొద్ద కనిపెట్టండి.
“నైజపాపములు నశియించుటకే భోజనము వడ్డించును - రాజె స్వయముగా దేవరాజే స్వయముగా” గనుక నాకేమి కొదువ.
ఇక జీవించువాడను నేనుకాదు అన్న అపోస్తలుడైన సౌలు అనుభవము సంపాదించుకొని రాకడకు ఆయత్తపడి రాకడ మేఘము చేరుదుముగాక.