సైతాను నెదిరించు సూత్రములు
Index
4. సైతాను నేరములు మోపలేడు
-
61) ఓ సైతానా! నీవు మాకు తీసికొని వచ్చి అందిస్తున్న గొప్ప నేరములు, ఎవరి మీదను మోపుటకు నీకు అధికారము లేదు.
-
62) ఒక మొదటి చిన్నవాడు, రెండవ చిన్నవానిని పడద్రోసిన యెడల, పడినవాడా నేరస్థుడు? పడద్రోసిన వాడా? నీవు పడవేసేవాడవు
గనుక
నీవే
గొప్ప నేరస్థుడవు. పడవేయబడిన ఆదాము హవ్వలను, దేవుడు క్షమించి దీవించినాడు. నిన్ను దీవించలేదు. అలాగే నేటివరకు
జరుగుచున్నది.
గోత్రకర్తయగు యూదా, దావీదు మొదలగు వారిని నీవు పడవేసినావు. వారు రక్షించబడి, క్షమించబడి, దీవించబడి గొప్ప పని చేసిరి.
పడవేసిన నీవు దీవించ బడలేదు, వారివలె గొప్ప పని చేయగలిగినావా?
-
63) డాక్టరు మార్టిను లూథరు యొద్దకు, నీవు అతని పాపముల జాబితాను తీసికొని వెళ్ళినావు. ఆయన నా వలె బెదరలేదు,
ఎదిరించినాడు.
"యేసుప్రభువు నా పాపములు తుడిచి వేసినాడు, ఓ సాతానా! నీవు నా మీద నేరములు మోపలేవని" గద్దించగా, నీవు
పారిపోయినావు.
ఇట్లు పారిపోయే, నీకా మేము బెదరడము!