సైతాను నెదిరించు సూత్రములు
Index
2. సాతాను నెదిరించు దైవస్తుతులు - స్తుతి దీపము
-
1) దయగల తండ్రీ! సర్వశక్తిగల తండ్రీ! మేము సైతానును ఎదిరించుటకు, నీ సర్వశక్తిలో నుండి మాకు శక్తి దయచేయుము. "శత్రువు
బలమంతటి మీదను మీకు అధికారమును అనుగ్రహించియున్నాను" అని లూకా 10: 19లో వ్రాయించినావు. కాబట్టి, ఆ అధికారమును
మేము
వాడుకొనే
కృప దయచేయుము.
ఓ భూతములారా! భూలోకములోను, మనుష్యులలోను, జీవరాసులలోను మాకు శత్రువులున్నట్లు తెలుసును. ఆ
శత్రువులకంటె
మీరే
మాకు గొప్ప శత్రువులైనను, మీ బలమంతటి మీదను ప్రభువు మాకు అధికారము ఇచ్చియున్నాడు. కాబట్టి మిమ్మును ఏమైనా చేయుదుము.
మేము
ఏమన్నా చెల్లుతుందని చెప్పేటట్లు, ఓ ప్రభువా! మాకు సహాయము దయచేయుము. ఈ ప్రార్ధన విన్నందుకు నీకు మా స్తోత్రములు.
-
2) ఓ భూతమా! నీవు స్త్రీవి కావు, స్త్రీలందరికంటె తక్కువైన భూతానివే. నీవు పురుషుడవు కావు, గనుక నీవు
పురుషులందరి
కంటె
తక్కువే. నీవు పక్షివి కావు, పక్షులన్నిటి కంటె తక్కువే. నీవు జంతువు కాదు, జంతుజాలము కంటె తక్కువే. మా తండ్రి
పురుగులను
కలుగజేసెనని, ఆదికాండము మొదటి అధ్యాయములో వ్రాయబడి యున్నది. అట్టి పురుగులలో నీవు ఒక పురుగువు కూడ కాదు, గనుక నీవు
పురుగు
కంటె తక్కువే. మా తండ్రి మా ఉపయోగము కొరకు, కదలనటువంటి చెట్లను, కొండలను, భూమిని కలుగజేసినాడు. నీవు వాటిలో ఒక
దానికైనను
సమానము కాదు గనుక వాటి కంటె నీవు తక్కువే. మా తండ్రి ఏది కలుగజేసెనో, ఆ ప్రతి దానికంటె నీవే తక్కువ. తక్కువైన
వాటిని,
మా
కాళ్ళతో మేము త్రొక్కివేయగలము. అలాగే నిన్ను మా పాదముల క్రింద వేసి త్రొక్మివేయగలము. ఈ మాటలు మా తండ్రి, బైబిలులో
మాకు
వ్రాయించి ఇచ్చినారు. గనుక ఇదిగో చూడు, నిన్ను మా పాదముల క్రిందవేసి, దేవుని నామమున త్రొక్కుచున్నామని సైతానుతో
చెప్పగల
ధైర్యము, ప్రభువా! మాకు దయచేయుము. ఈ మనవి విన్నందులకు నీకు స్తుతులు.
-
3) ఓ భూతమా! మేము రోజుకు 24 గంటలు పాపములో పడిపోయినను, మమ్ములను లేవనెత్తి రక్షించే రక్షకుడు మాకున్నాడు. నీవు ఒక్క
నిమిషము
పాపములో పడితే, నిన్ను రక్షించే రక్షకుడు నీకు లేనే లేడు. గనుక నీవు సంతోషముతో గంతులు వేయనక్కరలేదు. నీ గంతులు, నీ
తంతులు
మాకు
తెలిసే యున్నవి. మేము నీకు భయపడమని సాతానును ఎదిరించేటట్టు, మాకు స్వాభావికమైన బుద్ధిని దయచేయుము. ప్రభువా! మా
ప్రార్ధనలు
ఆలకించినావని నీకు ప్రణుతులు చెల్లించుచున్నాము.
-
4) ఓ భూతమా! నీవు ఒకప్పుడు దేవదూతల సమాజములో ఉండి క్రింద పడితివి. మేము దేవదూతల సమాజములో నుండి పడలేదు, భూమి మీద
మనుష్యుల
సమాజములో నుండి పడితిమి. కాబట్టి మేము లేవగలము. ప్రభువు లేవనెత్తుట వేరు, మా అంతట మేము లేచుట వేరు. ఈ రెండును
మాకున్నవి.
వాటిలో ఒకటి కూడ నీకు లేదు. పాపము చేయవలెనని తలంపు, పాపనైజము, మేము తెచ్చుకొన్నవి కావు. అవి నీవు తెచ్చి అంటించినవి.
కాని
మేము తెచ్చుకొన్నవి కావు. ఎప్పటికైనను వీటిని నీవు తీసికొని పోవలెను. మాకెందుకు? యేసు ప్రభువు మా పాపములను తన మీద
వేసికొనుట,
మాకు లేకుండా చేయుటకే. సైతానుమీద వేయుట, అతని మీద ఉండుటకే, దేవా! ఈ మాటలు మేము సైతానుకు చెప్పే ధైర్యము మాకు
దయచేస్తావని
నమ్ముచున్నాము. నీకు వందనములు.
-
5) ఓ భూతమా! నీవు మమ్ములను ఎంత గొప్ప పాపులనుగా మార్చి నప్పటికిని, భూతమనే పేరు మాకు రాదు. మనిషి అనే పేరు మాకుంటుంది.
అది
ఎప్పుడైన గుర్తించినావా? నీవు ఎన్ని సంవత్సరములు నోరునెత్తి బాదుకొన్నా, దేవదూత అనే పేరు నీకు తిరిగి రానే రాదు. అయితే
మేము
ఎంత మనుష్యులమైనను, పాపులమైనను దేవదూతలనే పేరు మాకు వస్తుందని సువార్తలలో మా ప్రభువు వ్రాయించినాడు (మత్తయి. 22:30;
లూకా.
20:36). నీకు ఎప్పటికైనా దేవదూత అనే పేరు రాదు కదా! రాదు గనుక మేమే ఎక్కువ. ప్రభువా! ఈ మాటలు మేము సైతానుకు
చెప్పేటట్లు
నీవు చేయుచున్నావు. గనుక నీకు స్తుతులు.
-
6) ఓ భూతమా! "సైతానా, నా వెనుకకు పొమ్మని," నిన్ను మా రక్షకుడు అన్నాడు (మత్తయి 16:23). పేతురులో చెడ్డ తలంపు
పుట్టించిన
సైతానును అన్నాడు. "ఓ పేతురూ" అని అనలేదు, "సైతానా" అని అన్నాడు. ఈ రెండింటికిని భేదమున్నదా! లేదా? కొండపై ప్రభువును
శోధించుట (మత్తయి 4వ అధ్యాయము), వెలుపల నుండి శోధించుట. ఇక్కడ పేతురులో తలంపు పుట్టించినావు. అందుకు "సాతానా!" అని
అన్నాడు.
ప్రభువా! మేము ఈ సమాధానము సైతానుకు చెప్పేటట్లు చేసినావు గనుక నీకు అనేక మనఃపూర్వకమైన వందనములు.
-
7) ఓ భూతమా! నీ గుండెలో నరులు నాశనమగుదురు గాక! అని ఉన్నది. ప్రభువా! రక్షించుమని మనిషియొక్క మనస్సులో నున్నది. ఎంత
పాపినైనను రక్షించవలయునని దేవుని హృదయములో నున్నది. ఎటువంటి దయ్యమునైనను రక్షించెదనని లేదు, కొంచెమైనను లేదు.
దేవా! ఈ
మాటలు మేము సాతానుకు వినిపించేటట్లు చేసినావు గనుక నీకు సంస్తుతులు.
-
8) లోకములో నున్న పాపాత్ములలో, సైతానుకంటె హెచ్చయిన పాపాత్ముడు ఒక్కడును లేడు. ఒక్కడు ఉన్నయెడల అతనిలో కూడ
రక్షణాపేక్ష
స్వరము, తల వెంట్రుకంతైనను ఉండక మానదు. ఓ భూతమా! నీకు ఆ తలంపు లేదు, అంత తలంపు లేదు, ఎంత తలంపు లేదు. ఉంటే రక్షణ
వచ్చును.
రక్షింపబడని మనుష్యాత్మ హేడెస్సులో ఉండవచ్చును. నీవు అతిశయించనక్కరలేదు. దేవా! ఇట్లు సైతాను ముఖము ఎదుట చెప్పే
శక్తి
నాలో
ఉంచినావు గనుక నీకు అనేక కోటానుకోట్ల మంగళ స్తుతులు. మా స్తుతులు, స్తోత్రములు యేసు నామమున చేయుచున్నాము. ఆమెన్.