సైతాను నెదిరించు సూత్రములు
Index
4. దయ్యములను వెళ్ళగొట్టే దైవప్రార్ధనాంశములు
-
104) యేసుప్రభువా! దయ్యములను వెళ్ళగొట్టుడని (మార్కు 16:17)లో తెలియపరచినావు, కనుక మేము అడుగుచున్నాము. బైబిలుమిషను
మీదకు
వచ్చిన దయ్యములను వెళ్ళగొట్టుము. అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవునని (యాకోబు 4:7)లో
వ్రాయించినావు. సాతానును మా కాళ్ళక్రింద శీఘ్రముగా చితుక త్రొక్కించెదనని వ్రాయించినావు (రోమా16:20). అది ఇప్పుడే
నెరవేర్చుము. సన్నిధి కూటస్థులు నీ సెలవు అడిగి సైతానును, వాడి అనుచరులను, వాని దూతలను వెళ్ళగొట్టునట్లు ఏర్పరచుము.
-
105) మా దేవా! నీవు మనుష్యులను రక్షించినావు. దయ్యములలో ఒక దయ్యమునైనా రక్షించినావా! లేదు. దానినిబట్టి చూస్తే,
దయ్యములు
ఎంతగా చెడిపోయినవో మాకు తెలియుచున్నది. కాబట్టి సైతాను ఈ మాటలు వినేటట్లు చెప్పగల శక్తి దయచేయుము.
-
106) ప్రభువా! మార్కుసువార్త మొదటి అధ్యాయములో, నీవు దయ్యములను వెళ్ళగొట్టినావని వ్రాయబడియున్నది. అప్పుడు ఆ దయ్యము
వెళ్ళిపోవుచు, ఆ రోగిని విలవిల లాడించినది. ఎందుచేత? నీవు వెళ్ళగొట్టేటప్పుడు ఆ మనిషిలో నుండుటకు వీలులేదు గనుక.
ఉదా:-
ఇద్దరు కుర్రవాళ్ళు వీధిలో పోట్లాడుకొను చుండగా, ఒకడు రెండవ వానిని పడగొట్టి వెళ్ళిపోవుచున్నాడు. పడిపోయినవాడు,
"ఇంకొకసారి
రమ్ము ఏమిచేస్తానో చూడు"! అని అనెను. మొదటి కుర్రవాడు రెండవ కుర్రవానిని జయించినా, శక్తిలేనివాడే అనిపించుకొనును.
ఎందుకనగా,
అతడు ఇంకా అక్కడే ఉంటే, ఆ పడిపోయిన అబ్బాయి బంధువులు వచ్చి, ఆ కొట్టిన వానిని కొట్టుదురని వెళ్ళిపోవును. అదే
శక్తిలేకపోవుట,
సైతానుకు అటువంటి శక్తిలేనితనమే ఉన్నది. ప్రభువా! ఈ ఇద్దరి కుర్రవాళ్ళ సంగతి ఎత్తి మేము సైతానును జయించుటకు కృప
దయచేయుము.
-
107) ప్రభువా! "దయ్యములు కూడ దేవునికి వణకుచున్నవని" యాకోబు వ్రాసినాడు (యాకోబు 2:19). దయ్యములు ఎందుకు వణకుచున్నవి?
వాటికాలము రాకముందే నీవు వాటిని నరకములో పడవేస్తావని అవి భయపడ్డవి. ఈ అంశము ఎత్తి మేము దయ్యములను ఎదిరించునట్లు
జ్ఞానోదయము
దయచేయుము.
-
108) దేవా! సృష్టి అంతటిచేత దయ్యములను త్రొక్కించుము. ఓ దేవా! యం.దేవదాసు అయ్యగారు రాత్రులు మంచముమీద ఉండి, ఒక అంశము
మీద
పత్రిక ఏలాగు వ్రాయవలెనో ఆలోచించిరి. ఆ వ్రాత అంతయు వరుసగా మనసులోనికి వచ్చినది. వ్రాయలేదు, అచ్చుపడలేదు.
అయినప్పటికిని
అది
మనో పత్రికమీద ఉన్నది కదా! కనుక నీ దూతలను పంపి, భూతములన్నిటికి ఆ పత్రికను చూపించుము. అప్పుడవి భయపడును. కాగితముమీద
సంగతి
వ్రాసినప్పుడవి రెండవసారి భయపడును. అది అచ్చువేసినప్పుడవి మూడవసారి భయపడును. మేము ప్రజలకు ఆ పత్రికను పంచిపెట్టగా,
వారు
చదువుకొన్నప్పుడు భూతములు మరియొకసారి భయపడును. ప్రజలు, ఆ అచ్చుకాగితమును బట్టి నడచుకొన్నప్పుడవి మరి ఎక్కువగా భయపడును.
ఈ
ప్రార్ధన ఆలకించుము. ఆమేన్.