సైతాను నెదిరించు సూత్రములు
Index
1. పిశాచి
-
26) ఓ పిశాచీ! మా బైబిలు గ్రంథములో నీ పేరు ఎక్కడ ఉదహరించినను, నీ చేతలు ఎక్కడ ఉదహరించినను, చెడుగే గాని మంచి లేనే
లేదు.
నీ
చరిత్ర మొదటి పర్యాయమున్న ఆదికాండము మొదలుకొని, ప్రకటన గ్రంథము వరకు నీవు కళ్ళు విప్పిచూస్తే, ఒక్కొక్క చరిత్రకుని
యొద్దకు
వెళ్ళడము, సిగ్గుపడి మళ్ళడము ఉంటుంది. నీవు సిగ్గుపడని క్రియ ఏదైనా, ఒకటయినా, గ్రంథములో నున్నదా? లేదు.
-
27) చీమ కుట్టెను, పిశాచీ ఇది నీ పని.
ఒకరు నాలుగు సంగతులు చెప్పవలసినది గాని మూడు సంగతులే చెప్పిరి, పిశాచీ ఇది
నీ
పని.
రాత్రి నాకు చెడ్డ కలవచ్చినది, పిశాచీ ఇది నీ పని.
మొన్న నాకు తప్పుడు దర్శనము వచ్చినది, పిశాచీ ఇది నీ పని.
పోయినవారము
నాకు
ముల్లు గుచ్చుకొన్నది, పిశాచీ ఇది నీ పని.
నేను అజాగ్రత్తగా నున్నందున రాయి కాలికి తగిలినది, పిశాచీ ఇది నీ
పని.
స్నానము
చేయునప్పుడు మా శరీరము మీద మట్టి కనబడును, పిశాచీ ఇది నీ పని.
కొందరు జీవములేని రాళ్ళకు మ్రొక్కుచున్నారు, పిశాచీ
ఇది నీ
పని.
లోకములో ఖూనీలు, హత్యలు జరుగుచున్నవి, పిశాచీ ఇది నీ పని.
ఒక్కొక్కప్పుడు అన్యాయమే గెలుచుచున్నది, పిశాచీ ఇది నీ
పని.
చెడ్డబొమ్మలు, సినిమాలు అనేకులను ఆకర్షించుచున్నవి, పిశాచీ ఇది నీ పని.
అనేకమంది భక్తులు విలాసముల తట్టు
ఆకర్షింపబడుచున్నారు
పిశాచీ ఇది నీ పని.
క్రైస్తవ దేవాలయములు నిర్మించుటకు అనేక ఆటంకములు కలుగుచున్నవి, పిశాచీ ఇది నీ పని.
పాపము
విస్తరించుట,
పిశాచీ ఇది నీ పని.
మంచి నెరవేరకపోవుట, పిశాచీ ఇది నీ పని.
నీ పని అంతటిలో చెడుగే కాని మంచి లేనే లేదు. ఏది
చెడుగో,
పిశాచీ
అది నీ పని.
మా పొరపాట్లు అయినా, అవి నీ వలననే కలిగెను గనుక అదికూడ నీ పని లోపమే.
-
28) దేవుడు లేడు, దేవదూతలు లేరు, మోక్షములేదని నాస్తికులు అనుచున్నారు, ఇదంతయు ఓ పిశాచీ ఇది నీ పని.
దేవుడు కలుగజేసిన
ప్రతి
వాటిలో, తరచుగా ఏదో ఒకటి నాశనమగుచున్నది, పిశాచీ ఇది నీ పని.
సాలీలు చీరెలు నేయుచుండగా దారము తెగిపోయినది, పిశాచీ
ఇది నీ
పని.
ప్రార్ధన చేయుచుండగా కోళ్ళు, కుక్కలు అల్లరిచేయును, పిశాచీ ఇది నీ పని.
గోళ్ళు కత్తిరించుకొనబోతే
తెగినది, పిశాచీ
ఇది
నీ పని.
మా చేతిలోని వస్తువులు జారి పడిపోవుచున్నవి, పిశాచీ ఇది నీ పని.
ఒక విద్యార్ధి చాల కష్టపడి చదివి
పరీక్షలలో
ఫెయిలైనాడు, పిశాచీ ఇది నీ పని.
ఒక స్త్రీ చల్లని పానీయమనుకొని కార్బాలిక్ ఏసిడ్ త్రాగి చనిపోయినది, పిశాచీ ఇది నీ
పని.
కడుపులో బిడ్డలు చనిపోవుచున్నారు, పిశాచీ ఇది నీ పని.
అకాల మరణములన్నియు, ఓ పిశాచీ నీ పని.
ఒక బోధకుడు వీధిలో
బోధిస్తుంటే,
మనుష్యులతనిని పట్టుకొని కొట్టిరి, పిశాచీ ఇది నీ పని.
కొందరికి ట్రైన్ (రైలుబండి) దాటి పోయినది, పిశాచీ ఇది నీ
పని.
ఒకరు
మరలో
పనిచెస్తుండగా, పొగవలన కండ్ల జబ్బు చేసినది, పిశాచీ ఇది నీ పని.
ఒకడు పడవ ఎక్కబోయి నీటిలో పడ్డాడు, పిశాచీ ఇది నీ
పని.
కష్టములను బట్టి ఏడ్చుట, పిశాచీ ఇది నీ పని.
ఒక పని చేయబోయి మరియొక పని చేయుట, పిశాచీ ఇది నీ పని.
మనుష్యులవలె
జంతువులకును
జబ్బుచేయుచున్నది, పిశాచీ ఇది నీ పని.
(ఈ తప్పులన్నియు పిశాచిపని అనుకొనరు, మనుష్యులవే అనుకొందురు).
-
29) ఓ పిశాచీ! నీకు ఎప్పుడైనను దేవుని నమ్ముట తెలుసునా? తెలియదు. ఒకరిని నమ్మకుండచేయుట మాత్రము నీకు తెలుసును, నీవు
కూడ
నమ్మవు.
-
30) "యెహోవా నా మొర లాలించెను" అనే కీర్తనలోని వచనము.
"పిశాచి కడిమి బడగొట్టెను - దన వశాన నను నిలువబెట్టెను = ప్రశాంత మధుర సు - విశేష వాక్కుల నిశాంతమున జేర్చి సేద
దీర్చెను"
షరా: కడిమి అనుమాటకు బదులుగా, ఈ దిగువ ఉదహరించిన మాటలన్నిటిని వాడి, సాతాను నెదిరించు పాటగా పాడుకొన వచ్చును.
మాయ, శక్తి బలము, భీతి, భయము, ముఖము, చేయి, వాక్కు, పధము, విధము, నడుము, భుజము, తలపు, ఉనికి, పలుకు, ఊహ, టక్కు
వ్యూహము,
పట్టు, కట్టు, ఈటె, మాటు, సేన, దండు, కాడి, పీడ కాటు, పనులు, మనస్సు, పరువు, గణము, బోటు, గుండె. చూపు, వాక్కు శిరస్సు,
మబ్బు, ప్లాను, డాబు, గద్దె, మురుపు, నీడ, దుర్భుద్ధి, ముసుగు, గర్వము, పాదము, ఉదరము, క్రియలు, తంత్రము, ఛాయ, కక్ష,
మందము,
వినికి, జ్ఞానము, మంత్రము.