సైతాను నెదిరించు సూత్రములు
Index
3. సైతానుకు మారుమనస్సు లేదు
-
54) ఓ సైతానా! మేము మారుమనస్సు పొందలేదని నీవు అభిప్రాయపడు చున్నావు. నీవు మారుమనస్సు పొందినావా? నీవు పొందనిదే,
ఇంకొకరిని
అనుటకు నీకధికారము, శక్తి (పవర్) ఎక్కడిది?
-
55) ఓ సైతానా! తీర్పు తీర్చు నీవు దోషివై యుండగా, ఇతరుల మీద ఎందుకు తీర్పు తీర్చుచున్నావనే బైబిలు వాక్యమెత్తినావు.
దోషివైన
నీవు ఎందుకు తీర్పు తీర్చుచున్నావు? నీవు ఎప్పటికిని మారవని ప్రకటన గ్రంథములో ఉన్నది కదా!
-
56) ఓ సైతానా! మనిషిలో నీవు ఎంత చెడుగు ప్రవేశపెట్టినను, రవ్వంతైనా మంచి ఉండక మానదు. అది దేవుడు పెట్టిన వజ్రము. అది
చూచియైనా నీవు మారుమనస్సు పొందవు. అదికూడ తీసివేయుటకు నీవు ప్రయత్నించుచున్నావు. కాని మనిషిలోని మంచిని గ్రహించవు,
ఎంత
తెలివి తక్కువవాడవు!
-
57) ఓ సైతానా! మాలో ఒకరిట్లు ప్రార్ధించినారు. "దేవా! సైతానుకు, అతని దూతలకు మారుమనస్సు కలిగించి, ఆకాశ విశాలమందు
ఎక్కడో
ఒక్కచోట పెట్టుము, కాని నరకాగ్నిలోనికి పంపవద్దు". సైతానా! ఇట్టి ప్రార్ధన జరిగినప్పుడు కూడ నీవు సంతోషించ లేదు,
మారుమనస్సు
కలిగించుకొనలేదు. సరే, నీ శిక్ష నీవే అనుభవించుము.
-
58) ఓ సాతానా! ఒకరిట్లు ప్రార్ధించినారు. "దేవా! మనుష్యులలో ఎవ్వరిని నరకములోనికి వెళ్ళనీయకుము". సైతానా! ఇప్పుడైనా
మారుమనస్సు పొందుదువా! శోధించుటకు ఇక నీకు మనుష్యులు దొరకలేరు.
-
59) ఓ సాతానా! మేము చేస్తున్న ప్రార్ధనలు, మీటింగులు నీకు తెలుసును. నీకు జయము కలుగదని నీవు బాగుగా ఎరుగుదువు.
ఇప్పుడైనా
మారుమనస్సు పొందుము.
-
60) దుష్టుడవైన ఓ సైతానా! మా ప్రభువు యోవేలు గ్రంథమందు, "అంత్య దినములలో తన ఆత్మను యౌవనుల మీదను, వృద్దుల మీదను
కుమ్మరిస్తానని" చెప్పినాడు. ఆ వాక్యాధారము చేసికొని, నీవు మాయొక్క బిడ్డలలో ప్రవేశించి, అల్లరి చేయుటకు నీకు
సిగ్గులేదా?
మారుమనస్సు అక్కరలేని నీవు, ఇతరులను మారమని అన్నావు. అందులో అర్ధమున్నదా? అయినను, ప్రభువు మాకు మెళకువ దయచేసి, నీ
బారినుండి
రక్షించి, తన ఆత్మాభిషేకము దయచేసినాడు. దీనిని బట్టి నీకు, నీ క్రియలకు లయము. మా ప్రభువునకు, ఆయన సంఘమునకు, ఆయన
బిడ్డలకు,
మాకు ఎల్లప్పుడు జయమే. ఓ భూతమా! ఇదిగో మా బిడ్డలు బాగుపడతారని మాకు తెలుసును. ఎందుచేతననగా, మా పరలోకపు తండ్రియైన
దేవుడు
ఇచ్చిన జ్ఞానమును బట్టి తెలుసును. "మా బిడ్డలు బాగుపడుదురు" అను విశ్వాసము మాకు కలదు. అట్టి విశ్వాసము నీకు లేదు. నీవు
నాకంటె తక్కువ, నీవు నా కాళ్ళక్రింద దానివే.