క్రమకర్త: ఫాదర్. ముంగమూరి దేవదాసు

దైవలక్షణముల స్తుతి



షరా: దేవా! నీయొక్క దివ్యలక్షణములు, దేవదూతలకు, మనుష్యులకు ఇచ్చినావు గనుక స్తోత్రములు. దేవదూతలలో ఒక దూత పాపములో పడి, నీ సద్గుణములు లేకుండా చేసికొన్నది. అలాగే మనుష్యులు పాపములో పడి, నీ గుణములు చాలవరకు పోగొట్టుకొనుచున్నారు. అయినను నీవు వారి యెడల దీర్ఘశాంతము కలిగియున్నావు. గనుక నీకు వందనములు. మరియు ఓ దేవా! నిన్ను అడిగే వారికి నీ శక్తులు దయచేయుదువు గనుక నమస్కారములు.


దేవా! నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తును లోకమునకు పంపించి, ఆయనలో నీ గుణములు బయలు పర్చినావు గనుక నీకు అనేక స్తుతులు. మరియు దేవా! సృష్టిలోని వస్తువులను పరీక్షించిన నీ సుగుణములు అందులో ఉన్నవి గనుక నీకు స్తుతులు. మరియు దేవా! నిన్ను నమ్మినవారిలో ఉన్న దుర్గుణములు దూరముగా తీసివేసి, మోక్షమునకు చేర్చుకొనుచున్నావు. అక్కడ శాశ్వతముగా వారు నీ దివ్యలక్షణములను అనుభవిస్తున్నారు. గనుక నీకు మంగళ స్తోత్రములు.