క్రమకర్త: ఫాదర్. ముంగమూరి దేవదాసు
6. సైతానుకు నాశనము
- 67) ఓ సాతానా! మేము నీ నాశనము ఎరిగినవారము. నీకు నాశనము ఉన్నదని నీకు తెలియదు గాని మాకు తెలుసును. నీ ముఖము, నీ చెంపలు పగులగొట్టుటకు మాకు శక్తియున్నది. మా రహస్యాలు వినుటకు నీకేమి అవసరము? మా రహస్యాలతో నీకేమి కావాలి? మా రహస్యాలు మా తండ్రికి తెలియజేస్తే చాలు, నీవెవరు మా రహస్యాలు వినుటకు? నీకు సిగ్గులేక రోజు మా చేత చీవాట్లు తినుటకు వస్తున్నావు. మేమిచ్చే గద్దింపులు నీకే కాదు, నీ జట్టంతటికిని. ఎలాగంటే, ఈ గదిలోనున్న స్విచ్ నొక్కితే, బైట లైట్లన్నిటిలోనికి కరెంటు వెళ్ళినట్లు, నిన్ను ఇక్కడ గద్దించినట్లయితే కరెంటువలె ఆ గద్దింపులు నీ జట్టు ఎక్కడెక్కడ ఉన్నారో, వారందరికి పరిణమిస్తుంది. దినదినము మా దగ్గరకు రావడము ఎందుకంటే చీవాట్లకే, నీకు సిగ్గులేదా?
- 68) ఓ సాతానా? లోకమును గూర్చి ప్రార్ధింప వద్దంటున్నావు. లోకమును నీవు పుట్టించినావా? నీవు సృష్టికర్తవా? ప్రభువు మా కొరకు కలుగజేస్తే నీదంటావు ఏమిటి? నీ కొరకు లోకమును కలుగజేయలేదు. నీ కొరకు కలుగజేసినది ఏమిటో మాకు తెలుసును, అది నరకము. సంధి వచ్చినవాడు మాట్లాడినట్లు, నీవు మాట్లాడు చున్నావు. అదంతా మాకు తెలుసు, నీకు నాశనమే.
- 69) ఓ సైతానా! మేము పాపులమైనా పరిశుద్దులమే. ఎందుకంటే మాకు పాపక్షమాపణ ఉన్నది గనుక. నీకు పాప క్షమాపణ లేదు, నాశన పాత్రుడవు.
- 70) ఓ సైతానుల్లారా! మా ప్రభువే మీ పని పడతాడు లెండి, తొందర పడకండి, మీ నాశనము దగ్గరపడినది. భూమి పుట్టినది మొదలుకొని, ఇప్పటివరకు మీరు ఎంత మందికి హానిచేశారో జ్ఞాపకము చేసికొనండి. ఆ హాని అంతా మీ నెత్తిమీద పడునుగాక! మీరు ఇదివరకే శపింపబడిన వారు. కాబట్టి మేము కూడా మిమ్మును శపించుటకు మాకు సందు దొరికినది.
- 71) ఓ సైతానా! మా తండ్రి తన సృష్టిని ప్రతి నిమిషము దీవిస్తున్నాడు. యెషయా 27:3. ఆ నిమిషములోనే దీవెనలకు వ్యతిరేకమైన శాపము నీమీదికి, నీ అనుచరుల మీదికి వచ్చుచుండును. ఏలాగంటే ఒక తరగతిలో, 25గురు విద్యార్థులు పరీక్షకు వెళ్ళగా 5గురు ఫెయిలైనారు. ఆ అధికారి, పాస్ అయిన 20 మందికి ప్రజంట్లు ఇచ్చినాడు. అంటే 5గురికి ఇయ్యలేదని అర్ధముకదా! అలాగే దేవుడు ఆదాము, హవ్వలను దీవించినప్పుడు, "సైతానా! నేల మన్ను తిందువని" నిన్ను శపించెను. మనుష్యులకు ఆ శాపము లేదు. వారికి మరుగైన పంట, సంతానము అను రెండు బహుమానములు ఉన్నవి. వీరికి ఉంటే, నీకు లేదనే కదా అర్ధము. మరియు ఒక విమోచకుని పంపిస్తానని సృష్టికర్తవారు అన్నారు. అది పుట్టబోవు నరులందరికిని దీవెన. అటువంటి దీవెన నీకున్నదా? లేదు. శాపము ఉన్నది. మీరందరు శాపగ్రస్థులు గనుక నరక వంశస్థులు. నరక వంశస్థులకు నాశనము, యేసు ప్రభువునకు జయము.
-
72) ఓ సైతానా! నరకము నీకు, నీ దూతలకు ఏర్పడినది. నరకము మాకు కాదు. గనుక నరులకు నరకమని మాయగ నీవు మోసము చేసినావని
సంతోషించనక్కరలేదు. నీకు నరకమని రికార్డు చేయబడియున్నది గాని మనిషికి రికార్డు చేయబడలేదు. (మత్తయి 25:41,46). నరులు
నిత్యశిక్ష
పొందుదురని మాకు చూపుదువేమో! అయితే సృష్టికి ముందే నీకు నరకము రికార్డు చేయబడినది. కాని అటు తరువాత చాల కాలమునకు
నిన్ను
బట్టి మాకు వచ్చినది గనుక నీకే గొప్ప బాధ.
73) సాతానుకు నిత్యనాశనము - ప్రభువునకు నిత్య స్తుతి.
సాతానుకు నిత్యనాశనము ప్రభువునకు నిత్య స్తుతి 1. ఓ సాతానా! నీకనంతకాల నాశనము. ఓ ప్రభువా! నీకనంతకాల స్తుతి 2. ఓ అబద్ధికుడా! నీకనంతకాల నాశనము ఓ సత్యదేవా! నీకనంతకాల స్తుతి. 3. ఓ నేరస్థుడా! ఓ నేరములేని ప్రభువా! 4. ఓ నేరము తెచ్చినవాడా! ఓ నేరము తీసివేసిన ప్రభువా! 5. ఓ ఓడిపోయినవాడా! ఓ జయించిన ప్రభువా! 6. ఓ పాపీ! ఓ పాపమును తీసివేసిన తండ్రీ! 7. ఓ దొంగవాడా! ఓ ద్వారమైన తండ్రీ! 8. ఓ అపజయపరుడా! ఓ జయించిన ప్రభువా! 9. ఓ బాధపెట్టే వాడా! ఓ బాధ తీసివేసిన రక్షకా! 10. ఓ చాటుననుండే వాడా! ఓ బహిరంగములోనున్న దేవా! 11. ఓ నాశన పాత్రుడా! ఓ కాపుదల కర్తా! 12. విశ్వాసులను బాధపెట్టే వాడా! ఓ విశ్వాసుల బాధ తీసివేసే తండ్రీ! 13. ఓ దేవుడు లేడనేవాడా! ఓ సర్వము సృష్టించిన దేవా! 14. ఓ విశ్వాసుల విరోధీ! ఓ విశ్వాసుల స్నేహితుడా! 15. ఓ విశ్వాసి ఆరోగ్యము పాడు చేయువాడా! ఓ విశ్వాసికి ఆరోగ్యమిచ్చిన తండ్రీ! 16. ఓ దేవునికి దూరస్తుడా! ఓ దైవజనునికి సహవాసీ! 17. దైవజనుని పని పాడుచేయు వాడా! దైవజనుని పనిని పాడుచేయ చూచువాడా! దైవజనుని పని స్థిరపరచు రక్షకా! నీకు ప్రణుతులు. దైవజనుని బాధపెట్టేవాడా! దైవజనుని బాధ తీసివేసే నాధా! 18. దైవజనుని ఆహారము పాడుచేయ చూచువాడా! నీకనంత నాశనము. దైవజనునికి ఆహారము ఇచ్చిన తండ్రీ! నీకు అనంతకాల సంస్తుతులు. 19. దైవజనునికి విరోధ భూతములను నిలిపినవాడా! నీకనంతకాల నాశనము. దైవజనునికి పరిచారక దూతల నిచ్చిన తండ్రీ! నీకనంతకాల సంస్తుతులు. దైవజనుని విరోధీ! దైవజనుని ప్రేమించిన ప్రభువా! 20. దైవజనుని సదుపాయములు భంగము చేయువాడా! దైవజనునికి సదుపాయముల నిచ్చిన తండ్రీ! 21. ఓ చెడిపోయినవాడా! ఓ జయించిన ప్రభువా! 22. ఓ చీకటివాడా! నీకనంతకాల నాశనము. ఓ వెలుగుగైయున్న దేవా! నీకు అనంతకాల స్తుతి. 23. ఓ పారిపోయేవాడా! ఓ కదల్చబడని రక్షకా! 24. ఓ కుమ్మరాలు తెచ్చేవాడా! ఓ కుమ్మరింపు ఇచ్చే తండ్రీ! 25.ఓ వ్యాధిని తెచ్చేవాడా! ఓ వ్యాధిని సిలువపై భరించిన యేసుప్రభువా! 26. వ్యాధికి మూలమైనవాడా! వ్యాధిమూలము పెరికిన వైద్యుడా! 27. ఓ నిర్దయుడా! ఓ దయగల దేవా! 28. ఓ కనికరము లేనివాడా! ఓ కనికరముగల దేవా! 29. మందను చెదరగొట్టువాడా! మందను సమకూర్చువాడా! 30. మహిమ పోగొట్టుకొన్నవాడా! మహిమయైయున్న దేవా! 31. ఓ పారుపోతా! ఓ పాపికాశ్రయుడా! 32. ఓ గాయపర్చువాడా! ఓ గాయము మాన్పిన రక్షకా! 33. ఓ పడద్రోయువాడా! ఓ పట్టుకొనే ప్రభువా!