సైతాను నెదిరించు సూత్రములు
Index
5. అపవాది, అపరాధి
-
64) ఓ సాతానా! అపవాది, ప్రతివారియొక్క పాపములను గురించి నాకు చెప్పుచున్నాడని, దేవుడు ప్రకటన గ్రంథములో వ్రాయించినాడు.
ప్రకటన 12:10. నీవు అపవాదివని మా తండ్రి వలన పేరుపొందినావు. అపవాది అనగా ఒకరిలో నేరములు లేనిదే, నేరములు మోపేవాడవని
అర్ధము.
ఎవరి పాపములు క్షమించబడెనో, వారు అపరాధులు కారు. క్షమింపబడిన పాపములు ఎత్తి చూపించు నీవే అపరాధివి.
-
65) ఓ సాతానా! నీకు మా తండ్రి, "అపవాదియని పేరు" వాడినాడు. నీవు విశ్వాసుల మీద మా ప్రభువు వద్ద, ఎప్పుడు చాడీలు
చెప్పుచున్నావు. "నీవు విశ్వాసులను తిప్పలు పెట్టేటప్పుడు, వారు నిన్ను గూర్చి నాయొద్ద చెప్పుకుంటారు గనుక నేను వచ్చి
నిన్ను
తోలివేస్తాను. అదే కాదు, నీవు చెప్పిన నేరముల జాబితా అంతా నేను కొట్టివేసినానని" ప్రభువు చెప్పుచున్నాడు.
-
66) ఓ సాతానా! నీకు సమయము లేదనిచెప్పి, నీవు మనుష్యులను పాపములో పడవేయుచున్నావు. కాని నీవు కోరినట్టు, నేను నీ మాటలు
విని,
విశ్వాసులకు తీర్పు విధించనని ప్రభువు చెప్పుచున్నారు. ఓ చాడికోరా! సిగ్గుపడి వెళ్ళిపో.