క్రమకర్త: ఫాదర్. ముంగమూరి దేవదాసు

11. సాతానుకు నిత్యమైన అపజయము
విశ్వాసికి నిత్యమైన జయము:



యేసుక్రీస్తు ప్రభువు స్వయముగా దయ్యములను వెళ్ళగొట్టెను. మార్కు 5వ అధ్యా॥; యెషయా 5వ అథ్యా॥

biblemissionspirit.com

biblemissionspirit.com మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించునట్లు ఆయన తనశరీరమందు మన పాపములను మ్రానుమీద వేసికొనెను. ఆయన పొందిన గాయములచేత మీరు స్వస్థత నొందితిరి.


"అందుకు యెహోవా ప్రజలలోనికి తాపకరములైన సర్పములను పంపెను; అవి ప్రజలను కరువగా ఇశ్రాయేలీయులలో అనేకులు చనిపోయిరి. కాబట్టి ప్రజలు మోషే యొద్దకువచ్చి - మేము యెహోవాకును, నీకును విరోధముగా మాటలాడి పాపము చేసితిమి; యెహోవా మా మధ్యనుండి ఈ సర్పములను తొలగించునట్లు, ఆయనను వేడుకొనుమనిరి.


మోషే ప్రజలకొరకు ప్రార్ధన చేయగా యెహోవా - నీవు తాపకరమైన సర్పమువంటి ప్రతిమను చేయించి స్తంభము మీద పెట్టుము; అప్పుడు కరవబడిన ప్రతివాడును దానివైపుచూచి బ్రతుకునని మోషేకు సెలవిచ్చెను. కాబట్టి మోషే ఇత్తడి సర్పమొకటి చేయించి స్తంభము మీద దానిని పెట్టెను. అప్పుడు సర్పపుకాటు తినిన ప్రతివాడు, ఆ ఇత్తడి సర్పమును నిదానించి చూచినందున బ్రతికెను". సంఖ్యా. 21:6-9.

వివరము: ఇత్తడి సర్పము సైతానుకు గుర్తు. ప్రభువు సిలువమీద నున్నప్పుడు, సైతానుకూడ ఆయన సిలువ క్రింద అనగా ఆయన పాదముల క్రింద సిలువ వేయబడెను. గనుక సైతానుకు చాల బాధ. ప్రభువునకు కలిగిన బాధ పునరుత్థానముతో తీరిపోయెను గాని సైతానుకు కలిగిన బాధ, అంత్య దినమువరకు నుండును. నడుము విరుగగొట్టబడిన సర్పము ఎవరిని ఏమియు చేయనేరదుగాని తోక ఆడించుచుండును. దానిని చూచి పిల్లలు భయపడుదురు గాని పెద్దవారు భయపడరు.


సైతాను అట్టి సర్పమువంటిదై యున్నది. అయినప్పటికిని, ప్రజలను భయపెట్టుచున్నది. కాని భయపడనియెడల అది ఏమియు చేయజాలదు. క్రీస్తు ప్రభువు దాని నడుమును విరుగగొట్టెను. హవ్వ వద్దకు సైతాను, సర్పరూపమున వెళ్ళి మోసము చేసెనుగదా! అందుచేత సాతాను అను సర్పము, క్రీస్తుప్రభుని సిలువ సమయములో సిలువవేయబడెను.


సంఖ్యా. 21వ అధ్యాయములో ఏమున్నదో వినండి: ఇశ్రాయేలీయులు పాపము చేయుటనుబట్టి తాపకరమైన సర్పములు కరచినందున వారిలో అనేకమంది చనిపోయిరి. ఇంతలో మోషే ఇత్తడితో ఒక సర్పమును జేసి, స్థంభమునకు అంటగొట్టెను. పాపము ఒప్పుకొనిన వారు దానిని చూచి - "మనలను కరచిన పాము స్థంభమునకు అంటగొట్టబడెను, అది మనలను ఏమియు చేయలేదని" నమ్మిరి. అందుచేత వారు బాగుపడిరి. అలాగే మన పాపములు ప్రభువుమీద వేయబడినవి గనుక అవి మనలో ఇక లేవు. మనకేమియు భయములేదని నమ్ము వారికి పాప విముక్తి కలుగును. మరియు మనచేత పాపము చేయించిన సైతాను, సిలువ వేయబడెను గనుక అది ఇక కదల లేదు. అది మాకు హాని చేయజాలదు. మా పాపములను బట్టి మాకు కలుగు రోగాదుల వలనను, "మాకు హాని రాదు" అని అనుకొను వారికి పాప విముక్తి కలుగును. ఈ రెండు సిలువలు తలంచుకొని క్రీస్తుప్రభువును స్తుతించు వారికి మోక్షానందము కలుగును.