సైతాను నెదిరించు సూత్రములు
Index
2. సాతాను క్రియలకు వ్యతిరేకమైన పని
-
1) స్త్రీ వలన మానవ సంతతికి పాపము వచ్చెను. దేవుడు మరియమ్మ అను ఒక స్త్రీలోనుండి ఆ పాపమును పరిహరింపగల రక్షకుని
రప్పించెను.
దెబ్బకు దెబ్బ. ఇది చూచుటవలన సాతానుకు బాధ, సిగ్గు కలుగక మానదు. గనుక సాతాను గుండెలో రాయి పడినది.
-
2) ఆదాము అను పురుషుడుకూడ పాపములో పడెను. స్త్రీకి ఆదరణగా క్రీస్తు ప్రభువు స్త్రీవలన జన్మించెను. గనుక స్త్రీలందరు
సంతోషించవలసినదే.
-
3) పురుషులకు ఆదరణగా క్రీస్తుప్రభువు పురుష రూపముతో జన్మించెను. గనుక పురుషులందరు సంతోషించవలసినదే. ఆదిలో స్త్రీ
పురుషులకు
జన్మమును కలుగజేసిన దేవుడు, ఇప్పుడు ఆ స్త్రీ పురుషులకు రక్షణ అను జన్మమును అనగా నూతన సృష్టిని కలుగజేసెను. దేవుని
విజ్ఞానము
యెదుట సైతాను జ్ఞానము ఏమి పనికి వచ్చినది? చదువరులందరు ఈ గొప్ప విషయము తెలిసికొని బలపడవలెను.
3. ఘర్షణ
-
1) పురుషులు: స్త్రీలారా! మీవల్లనేగదా! మీకును, మాకును గొప్ప కుమ్మరము వచ్చినది.
-
2) స్త్రీలు: స్త్రీ చెప్పినమాట పురుషుడు ఎందుకు వినవలయును? పురుషునిది నేరము కాదా! నిషేధవృక్ష ఫలము తినకూడదని
దేవుడు
పురుషునికి
చెప్పలేదా?
-
3) పురుషులు:- స్త్రీ పండ్లు తెచ్చియుండని యెడల పురుషుడు తినునా?
-
4) స్త్రీలు:- స్త్రీ పండ్లు తెచ్చి ఇచ్చినప్పుడు, దేవుడు తినవద్దన్న పండ్లు ఎందుకు తెచ్చినావని పురుషుడెందుకు
అడుగలేదు?
-
5) పురుషులు:- దేవుడు స్త్రీని పురుషునికి సహాయముగా ఇచ్చెను. గనుక నా సహాయార్ధమై స్త్రీ పండ్లు తేచ్చినదనుకొని
అడుగలేదు.
-
6) స్త్రీలు:- నేడు భోజన సమయమందు భార్యలు క్రొత్త కూర వడ్డించినప్పుడు, ఇదెక్కడిది? ఇదేమి కూర? అని పురుషులు
అడుగుట
లేదా?
ఆ
పురుషుడు ఎందుకు అడుగలేదు!