సైతాను నెదిరించు సూత్రములు
Index
9. ఇతర మతస్థులు
-
86) ఓ సాతానా! ఇతర మతస్థులు - బైబిలులో, మా ప్రభువులో, సంఘములో తప్పులున్నవని చెప్పుచు ప్రకటించుచున్నారు.? ఎవరి
ప్రేరేపణవల్ల?
నీ ప్రేరేపణ వలననే కదా! ఈ మూడు విషయములలో తప్పులున్నవని చెప్పగలవా? బైబిలులో తప్పులున్నవా? మా ప్రభువులో తప్పులున్నవా?
మా
సంఘములో తప్పులున్నవి గాని అవి క్రమముగా అంతరించి పోవును. అయితే, నీలోని తప్పులు అంతరింపవు.
-
87) ఓ దుష్ట సైతానా! ఈ కాలములో అనేకమంది నీ ప్రోద్భలమువల్ల, క్రీస్తు ప్రభువే దేవుడా? ఇతరులు మాత్రము దేవుళ్ళు కారా?
అని
అనుచున్నారు. ఇది నీవు తెచ్చిపెట్టిన తలంపే.
అయితే ఇటువంటి తలంపు నెబుకద్నెజరునకు కలుగలేదా! నెబుకద్నెజరు
చేయించిన
ప్రతిమకు,
సకల రాష్ట్రములవారు సాగిలపడి నమస్కరించినారు. కాని యౌవనస్థులైన షద్రకు, మేషాకు, అబెద్నెగో నిన్ను, నీ తలంపును,
రాజుయొక్క
ఆజ్ఞను లెక్కచేయక ఆ ప్రతిమకు నమస్కరింప లేదు. వారు అగ్నిగుండములో వేయబడినప్పటికిని దగ్ధమైనారా? వారిని వేయుటకు
తీసికొని
వెళ్ళినవారు కాలిపోలేదా? ఆ ముగ్గురిని పడవేసినవారు నీ జనులు, నిన్ను ఆశ్రయించినవారు గనుక నశించిరి. అగ్నిగుండములో
వేయబడిన
ఆ
ముగ్గురికి, ఒక వెంట్రుకయినను కాల లేదు. ఎందుకో తెలుసా? అద్వితీయ సత్యదేవుడున్నాడు గనుక. ఆయనను సేవించినవారు, ఏ
మాత్రము
నశించరు. ఓ సాతానా! ఆనాడు వారు ముగ్గురు నిన్ను జయించినారు. ఈనాడు మేము జయించలేమా? కాబట్టి ఆ విషయమై సిగ్గుతెచ్చుకొని
తొందరగా పొమ్ము!