క్రమకర్త: ఫాదర్. ముంగమూరి దేవదాసు
8. నరహస్త ఖడ్గ ప్రార్ధన
ఓ సాతానా! నీవు ఎంతమంది యొక్క పాపములకు, శ్రమలకు, మరణమునకు, హేడెస్సుకు, నరకమునకు కారకుడవైనావో జ్ఞాపకము తెచ్చుకో. అన్ని శిక్షలు నీకున్నవి.
- 1) జలప్రళయ మరణములో నీవు పాపము చేయించగా, పాపము చేసిన నరులకే శిక్షలు. అయితే, నీకో! పాపములను, శ్రమలను, ఇతరావస్థలను, శిక్షలను నరులు అనుభవిస్తున్నారు. నీకు కూడ ఇవి తప్పవు. వీటి సంఖ్య లెక్కకు మించి పోయినది. ఆలాగే నీ శిక్షలు కూడ లెక్కకు మించి, దేవుని గణిత శాస్త్రములో నున్నవి.
- 2) సొదొమ, గొమొర్రా పట్టణముల నాశనము,
- 3) ఐగుప్తులో ప్రథమ పుత్రుని మరణము,
- 4) ఎర్ర సముద్రములో నాశనమైన ప్రజలు,
- 5) అరణ్యములో నలుబది ఏండ్లలో మృతులైనవారు,
- 6) యెహోషువ, మోయాబీయులను నాశనము చేయుట,
- 7) అమ్మోనీయుల నాశనము,
- 8) ఎదోమియుల నాశనము,
- 9) యెహోషువ కాలములో ఏడు జనాంగముల నాశనము,
- 10) న్యాయాధిపతుల కాలములో నాశనమైనవారు,
- 11) దావీదు కాలములో నాశనమైనవారు,
- 12) సంసోను కాలములో నాశనమైనవారు,
- 13) గిద్యోను కాలములో నాశనమైన వారు,
- 14) హాయి పట్టణకాలములో నాశనమైనవారు,
- 15) జర్మనీ యుద్ధములో (మొదటి ప్రపంచ యుద్ధములో) నాశనమైనవారు,
- 16) రెండవ ప్రపంచ యుద్ధములో నాశనమైనవారు,
- 17) రాకడ వరకు ఎంతమంది హతులౌదురో (ఆ విషయము),
- 18) ఏడేండ్ల శ్రమకాలములో ఎంతమంది హతులౌదురో (ఆ సంగతి),
- 19) వెయ్యేండ్లలో ఎందరు హతులగుదురో వారు.
దేవా! ఈ 19 మాత్రమే కాదు. మా గణిత శాస్త్రమునకు అందనివి అనేకములు గలవు. అన్ని శిక్షలు సాతానుకు, అతనికి సంబంధించిన దురాత్మలకు రానిమ్ము. గాని నీవు కలుగజేసిన మానవులు ఎంత దుష్టులైనప్పటికిని; నీ సర్వశక్తికి, నీ సర్వ జ్ఞానమునకు అందే సాధనములు ఉపయోగించి రక్షించుము. వారు నీ సృష్టి మరియు సకల జనులకు సువార్త ప్రకటించుమని మాకెవరిని గురించి చెప్పినావో, వారు మనుష్య జాతినిబట్టి మా వారే. ఈ మా కల్పన ప్రార్ధనలో, నీ ఇష్టము లేని ప్రార్ధనల విషయములో మమ్మును క్షమించుము. ఇది నీ కుమారుని ముఖబింబమును చూచి ఆలకించుము. ఆమేన్.