సైతాను నెదిరించు సూత్రములు
Index
7. యేసుప్రభువు రక్షకుడు
-
74) ఓ సైతానా! నీతిపరులు ఏడుమారులు పడినా, లేస్తారని వాక్యములో నున్నది గదా! పాపస్థితిలో నున్నప్పటికిని, ఎవరి దృష్టి
యేసుప్రభువుమీద ఉండునో, అతడే నీతిపరుడు. ఆస్పత్రిలో చావ సిద్ధముగా నున్న రోగి, ఎవరిని తలంచు కొనుచుండును?
డాక్టరుగారిని
కదా!
అలాగే కొందరు బలహీనస్థితిలో నున్నప్పటికిని, వారు యేసు ప్రభువును తలంచుకొనుచుండిన తుదకు రక్షింప బడుదురు.
-
75) ఓ సైతానా! ఒకవేళ ఒకడు ఆత్మీయ బలహీనతలో ఉంటే, అతడు ఎల్లప్పుడు పడునని ఎక్కడ వ్రాయబడి యున్నది? అతడు తుదకు
మారిపోవును.
క్షమాపణ పొందునని అతనికి తెలుసును. అందుచేత క్షమాపణ రాకముందే, క్షమాపణ పొందిన వాడగును. మార్కు 11:24ను బట్టి చూస్తే,
నెరవేరకముందే నెరవేర్పని ఉన్నది కదా! కనుక ఒకడు బలహీనతలో నున్నప్పుడు, నన్ను యేసుప్రభువు ముందుకు బాగుచేయునని
అనుకొనుటే
విశ్వాసము.
-
76) ఓ సైతానా! ఎటువంటి పాపికైనా, యేసుప్రభువును తలంచిన పాపక్షమాపణ కలుగును. నీవు ఘోరపాపుల కంటె ఘోరపాపివి.
అయినప్పటికిని
యేసుప్రభువును నీ రక్షకునిగా తలంచుకొనవు. కనుక నీకు రక్షణ దొరకదు. నీ వల్ల పడిపోయిన వారికి రక్షణగాని నీకు మాత్రము
లేదు.
అయినను చాల గడుసుగా మాట్లాడినావు. నీ గడుసుతనము యేసుప్రభువువద్ద వల్ల పడదు.
-
77) ఓ సైతానా! నీవు మనిషిని పాపములో పడవేయుట మాత్రమేకాక, పడ్డాడని పకపక నవ్వుచు, "నీకు క్షమాపణ లేదులే" అని బెదిరించే
వాడవై
యున్నావు. నీ గడుసుతనమే నరులకుంటే, నీవు వెంటనే జయింపబడుదువు. నిన్ను జయించడము మా ప్రభువుయొక్క జయమును బట్టియే.
-
78) ఓ సైతానా! యుద్ధములో పటాలానికి, మొదటి దినమునే జయము కలుగునా? అలాగే భక్తులకు మొదటి దినముననే జయము కలుగక పోయినను,
తరువాత
కలుగును. అది నీకు తెలియదు.
- 79) ఓ సైతానా! మా శత్రువులు మా నాశనము కోరుచున్నారు గాని మేమైతే వారి రక్షణ కోరుచున్నాము.
-
80) ఓ సైతానా! నీకు శోధకుడని పేరువచ్చినది. విశ్వాసికైతే బోధకుడని పేరు వచ్చినది. నీవు పాపములో పడవేయుటకు మనుష్యులను
శోధిస్తావు. కాని విశ్వాసులు, నీవు పాపములో పడవేసిన వారిని రక్షించుటకు బోధిస్తారు. గనుక నీకు కలిగిన పేరు చెడ్డపేరు,
నీకెప్పుడును చెడుగే.
-
81) ఓ సైతానా! బంతి ఆడునప్పుడు, ఒకరు కాళ్ళు కొట్టుకొని పోవునంతగా పడిపోవును. అయినను, లేవనని అనుకొనరు. తక్కిన
వారువచ్చి
లేవనెత్తుదురని అనుకొందురు. అలాగే సైతానా! నీవు ఒకరిని పడవేసినప్పటికిని, వానిని లేవ నెత్తుటకు బోధకులు, పరిశుద్ధులు,
దేవదూతలు మొదలైన వారున్నారు గనుక పడినను నిరాశ పడనక్కర లేదు. ఎన్నో ఏండ్ల క్రిందట నీవు పడ్డావు. నిన్ను లేవనెత్తడానికి
ఎవరైనా వచ్చినారా? ఒకరు పాపములో పడిపోయినప్పడు క్షమించుమనిన, వెంటనే దేవుడు క్షమించును. అయితే నీవనవు, ప్రభువు నిన్ను
క్షమింపడు. నీకెంత దుర్గతి! నేను పడినయెడల ఎప్పట్టికైనా సద్గతే, మరణ సమయమందైనను నేను లేస్తాను.