సైతాను నెదిరించు సూత్రములు
Index
10. ఇతర మిషనులు, బైబిలు మిషను
-
88) ఓ సాతానా! ఇతర మిషనులవారికి, దేవుడు జ్ఞానముద్వారా బయలు పరచలేదని మేము చెప్పుట లేదు. అది నీ కల్పన. మాకు
జ్ఞానముద్వారా
కాక, ఆయనే స్వయముగా "బైబిలు మిషను"ను బైలుపరచినాడని నిజము చెప్పు కొంటున్నాము. వారిని మేము హేళన చేయుటలేదు. నీవైతే
వారిని,
మమ్మును హేళన చేస్తున్నావు. నీవు రెట్టింపు అపరాధివి. మేము ఒక మతాన్ని ద్వేషించుట లేదు. క్రైస్తవ మతమును
ద్వేషిస్తున్నామని
ఎలాగు అనుకొనుచున్నావు?
-
89) ఓ సైతానా! "బైబిలు మిషనును, ఎత్తి చూపించుమ"ని ప్రభువు చెప్పినప్పుడు, మేము బలహీనులమని ఆయనకు తెలియదా! ఆయనకు
తెలుసును.
మాకు క్రమముగా బలమిస్తాడు, లేకపోతే ఆ మాట మాకు చెప్పడు.
-
90) ఓ సాతానా! మా యొక్కబలహీనతలు చూచుటకు నీకు కండ్లున్నవి. కాని మా బలమును చూచుటకు నీకు కండ్లు లేవు. మాకు వస్తున్న
మంచి,
మంచి దర్శనాలు చూచుటకు, నీకు కండ్లు లేవు. నీవు ఓర్వలేక పోవుచున్నావు. ఆదాము, హవ్వలు పరిశుద్ధ స్థితిలోనున్నప్పుడు
నీవు
ఓర్వలేక పోయినావు. ఆ దుర్గుణము నీలోనుండి నేటివరకు పోలేదు.
-
91) ఓ సైతానా! బలహీనులు రాకడకెట్లు సిద్ధపడగలరని" నీవనుచున్నావు.
మొదటి రాకడకు కొందరు సిద్ధపడలేదా? అలాగే రెండవ రాకడకు కూడ చాలమంది సిద్ధపడగలరు. పరిశుద్ధాత్మయే వారిని సిద్ధపరచును.
నీవు
సిద్ధపరచ లేవు గదా! ఆ పని నీకు చేత కాదు. నీవు పడగొట్టేవాడవు పడగొట్టుదువు గాని లేవనెత్తలేవు గదా!
(చరణము: నేనిక సిద్దంబుగా లేనని తెలినినది నిరుకు గానన్
పరిశుద్దాత్మయే నన్ను-కడకు సిద్ధము చేసికొనును
)