సైతాను నెదిరించు సూత్రములు
Index
8. నిరీక్షణ సంఘము
-
82) ఓ సైతానా! ఆదికాలము నుండి మా ప్రభువువచ్చే వరకు, నిరీక్షణ సంఘమును పడగొట్టుటకు నీవు ప్రయత్నములు చేసినావు. నీ
ప్రయత్నములు నెరవేరలేదు. నిరీక్షణ సంఘము మా ప్రభువు వచ్చే వరకు ఉన్నదా, లేదా? నీవల్ల ఏమగునని, అన్ని దుష్టప్రయత్నములు
మనుష్యునిచేత చేయించుచున్నావు? మమ్మునంటావు కాని, నీకింకా మార్పు రాలేదు. నీకు మార్పులేనిదే, మంచి కార్యములు ఎట్లు
చేయగలరని
మమ్మునంటున్నావు? నీకు మార్పు లేనిదే, మాకెట్లు చెప్పుచున్నావు, నీకు మహామార్పు ఉన్నదా ఏమిటి!
-
83) ఓ సైతానా! సంఘము యూదులలో, అన్యులలో స్థాపించిన తరువాత ఆపుచేయుటకు, ఇరువది వందల సం॥ల నుండి ప్రయత్నము చేయుచున్నావు
గదా!
నీ ప్రయత్నము సాగినదా? మా ప్రయత్నము సాగినదా? ఆటంకాలు దాటుకొని సంఘము నేటివరకు రాలేదా? ఇకమీదట అలాగుననే జరుగునని
ఎందుకు
గ్రహించలేవు? సామాన్య మనుష్యులమైన మేము గ్రహిస్తున్నాము గదా! ఒక్కొక్క మత జనసంఖ్యకంటే, క్రైస్తవమత జనసంఖ్య ఎక్కువని
నీకు
తెలియదా? క్రీస్తునకు జయము, సంఘమునకు జయము. అపవాది క్రియలకు లయము. సాతాను క్రియలను లయము చేయుటకే, దేవుని కుమారుడు
ప్రత్యక్షమాయెనని ఉన్నది (యోహాను 3:8). అది నీకు తెలియదా?
-
84) ఓ సాతానా! క్రైస్తవమతము వృద్ధిపొందుటకు, భక్తులు చేసిన ప్రయత్నములు లెక్కకు మించినవి. ఆ ప్రయత్నములు నీవు ఆపుచేయ
గలిగినావా! నీవు ఆపుచేయునప్పుడెల్లా , నీకు అపజయమే కలిగినది కదా! నీవు ఎందుకు మురియు చున్నావు? ఎన్ని అడ్డులైనా
పెట్టుము
గాని, దేవుని రాజ్యము ప్రబలము కాకపోదు.
-
85) ఓ సైతానా! ప్రవాహమునకు అడ్డువస్తే, త్రోసికొని పాయలు చేసికొని వెళ్ళును. అడ్దులు ఎత్తయి ఉంటే, ప్రక్కబడి ప్రవహించి
సముద్రములో పడును. క్రైస్తవ సంఘమునకు ఎన్ని అడ్డులు వచ్చినా, త్రెంచుకొని మోక్షమునకు వెళ్ళక మానదు. నీలాంటి దుష్టులు
కోటానుకోట్లు, ఈ సంఘమును ఆపుచేయలేరు.