సైతాను నెదిరించు సూత్రములు
Index
11. హేడెస్సు
-
92) ఓ సైతానా! నీవు చెడగొట్టిన అనేకమందిని మా ప్రభువు హేడెస్సులోనికి పంపినాడు. వారిని శిక్షించుటకు కాదుగాని, వారికి
మారుమనస్సు కలిగించి మోక్షానికి తీసికొని వెళ్ళుటకే. అక్కడ ఆయన కైలాస బుషిగారిని, సాధు సుందరసింగు గారిని, ఇంకను
దేవదాసు
అయ్యగారు మొదలైన వారిని పంపించి, బోధ చేయించుచున్నారని నీకు తెలియదా?
-
93) ఓ సైతానా! జలప్రళయ కాలములోను, యుద్ధకాలములోను, మారు మనస్సు పొందకుండ చనిపోయిన వారిని, ప్రభువు హేడెస్సులో ఉంచి
పాఠములు
చెప్పుచున్నారు గదా!
-
94) ఓ సాతానా! మా ప్రభువు రాకముందే మా ప్రభువును ఎరుగని మృతులు, నమ్మి పడిపోయిన మృతులు, ఎరిగి మారుమనస్సు పొందని
మృతులు;
వీరందరు నీ స్వాధీనములో లేరు. హేడెస్సులో మా ప్రభువు స్వాధీనములో నున్నారు. ఈ సంగతి నమ్మకుండా కొంతమందిని తయారు
చేస్తున్నావు. నమ్మే వారిని మా ప్రభువు తయారుచేస్తే, వారిని ఆటంక పరుపగలిగినావా?
-
95) ఓ సైతానా! బరంపురములో ఐదుగురు స్త్రీలు గొప్ప కూటములు జరుపగా, డాక్టరు ఆట్మనమ్మనుబట్టి ఎన్నో మహిమగల సంగతులు మా
ప్రభువు
వ్రాయించినారు. అందొకటి హేడెస్సును గురించి. ఆమెను, ఆమె కూటమును, వారి పనిని ఆపుచేసినావా? వారు తమ పనిని ముగించుకొని,
మా
ప్రభువునొద్దకు వెళ్ళియున్నారు. వారు మా కూటమునకు వచ్చినారు కదా! మేము వారికి ఇష్టము లేకపోతే మా కూటమునకు ఎందుకు
వస్తారు?
-
96) ఓ సాతానా! వారిని మాత్రమేకాక యం. దేవదాసు అయ్యగారిని కూడ మా కూటములకు ప్రభువు తీసికొని వస్తున్నారు. ఆయనను
శుద్ధిచేయకపోతే,
యేసుప్రభువునకు ఇష్టములేకపోతే ఎందుకు తీసికొని వస్తారు! నవీనకాలశుద్ధి,
భావికాలశుద్ధియని రెండు రకముల శుద్దులున్నవి. భావికాల శుద్ధినిబట్టియే, మా
ప్రభువు తీసికొని వస్తున్నారు. భూలోక భక్తులను కూడ తీసికొని వచ్చుచున్నారు.