క్రమకర్త: ఫాదర్. ముంగమూరి దేవదాసు
2. దైవస్తుతి
పరిశోధనకు ఈ క్రింది దైవస్తుతి చెప్పితే, సాతాను సహించలేక పారిపోవును. "ప్రభుయేసు రక్తమునకు సంపూర్ణ జయము, అపవాది క్రియలకు సర్వనాశనము" అనిన వాడు అడుగునకు పోవును. ప్రభుయేసు రక్తము అంటే సాతాను సహించలేక పారిపోవును.
3. ఎదిరింపులు
- 1) ఓ సాతానా! మానవుడు పాపము చేస్తే, అతడు మారుమనస్సు పొందుటకు గడువున్నది. అయితే చివర మాత్రము తీర్పు ఉన్నది గాని నీకైతే ఇప్పుడే తీర్పు. (Man will be condemned on the last day; but you are condemned already!)
- 2) ఓ సాతానా! పాపము నీవల్లనే వచ్చినది. వెయ్యేండ్ల పరిపాలనలో పిశాచి, దయ్యములు, పాపములు ఉండవుగాని నైజపాపము మాత్రము ఉంటుంది. (ఆ నైజపాపము గొప్ప అంతస్తునకు రానీయదు గనుక దానిని ఇప్పుడే తొలగించుకొనవలెను, సంస్కార భోజనమువల్ల నైజపాపము నశియించును).
- 3) ఓ సాతానా! నీవు మమ్మును రోజు బాధిస్తున్నావు. గనుక ఈ సూత్రములు ఎత్తి నిన్ను మేము రోజూ సాధిస్తాము. ఈ సూత్రముల ద్వారా నిన్ను ఎదిరించి భయపెట్టుచున్నాము.
4. కీర్తనలు
-
1. సాతానుగాని, దానియొక్క సైన్యముగాని కనబడితే, భయపడినప్పుడు
- ఎ) ఉన్నపాటున వచ్చుచున్నాను.... నన్న దయగను" అనుచరణము పాడవలెను.
- బి) "నీ వాగ్ధత్తము నమ్మి - నీపై భారముపెట్టి జీవమార్గము గంటిని" అను చరణము పాడవలెను.
- 2. చీకటి కనిపిస్తే: "దరిలేని యానంద - కరమైన నీ ప్రేమ - తరమే వర్ణన చేయను!" అను చరణము పాడవలెను.
5. గమనికలు
- 1) జయించే పనిమీద సాతాను పేరు ఎత్తవచ్చును. జయించినప్పుడే ప్రభువు, "సాతానా! నా వెనుకకు పొమ్ము" అని అనెను.
-
2) రెండు సిలువలు:
- 1) మనము మన పాపములను, "ప్రభువుమీద వేయుట" ఎందుకనగా, అవి పరిహరింపబడి, మనమీద లేకుండా చేసికొనుటకే,
- 2) మన పాపములు "సాతానుమీద వేయుట" ఎందుకనగా, వానిమీద అవి ఉండుటకే
- 3) పాపపు తలంపులు వస్తే, "అవి నావి కావు, సాతాను తెచ్చి అంటించినవి అని అనుకొని, మనము "ఓ సాతానా! ఈ పాపపు తలంపులు నావి కావు. నీవే గనుక నీ ముఖముమీద వేసి కొట్టుచున్నాను" అని అనవలెను.
6. సైతానును లొంగదీయుట
- ఎ) స్తుతి కీర్తనలు,
- బి) వాక్యపఠన,
- సి) పై రెండింటికిని లొంగకపోతే ప్రార్ధనలు చేయవలెను.
- డి) ఇంకను సైతానును జయించలేకపోతే, మరియొకరిని పిలిచి వారితో ప్రార్ధన చేయించవలెను. మరియు ప్రకటనలోని స్తుతి వచనములు చదువవలెను.