క్రమకర్త: ఫాదర్. ముంగమూరి దేవదాసు

6. పరిత్యాగ పత్రిక



ఓ సాతానా! నీవంటే మాకు ఇష్టములేదు. గనుక నీకు పరిత్యాగపత్రిక ఇస్తున్నాము. ఇది రాకడ వరకు చెల్లును. ఆ తరువాత మేము నీకు కనబడనే కనబడము. మా పరిత్యాగ పత్రిక శాశ్వతము వరకు పనిచేస్తుంది.

పరిత్యాగ పత్రిక కీర్తన వచనము

పోపొమ్ము ఓ లోకమా! చాలిక చాలు - నీ పొందు మేమొల్లము =
పోపొమ్ము ఓ సాతానా! చాలిక చాలు - నీ పొందు మేమొల్లము.

"ఓ సాతానా! అనుమాటకు బదులుగా, ఈ క్రింది పదములు ఉపయోగించి పాడవలెను.
ఓ పాపమా, ఓ పాప ఫలితమా, ఓ దయ్యమా, ఓ భూతమా, ఓ రోగమా, ఓ దుఃఖమా, ఓ శాపమా, ఓ లోపమా, ఓ శోధనా, ఓ మందమా, ఓ కంపమా, ఓ దుర్దశా, ఓ పాప నైజమా, ఓ మరణమా, ఓ నరకమా, ఓ హేడెస్సా.

7. సంగ్రహ వాక్యావళి



ఓ సాతానా! నీవు నాలో పుట్టించిన చెడుగు నీకే రవాణా. నీ ఆలోచనలు, నీ ప్రయత్నములు ఇదివరకే మేము దుంప నాశనము చేసియున్నాము. నీ ఆర్భాటములు, నీవు మా మీద మోపే నిందలు అర్ధము లేనివి. ఎందుకనగా మా తండ్రియొక్క అమూల్యమైన రక్తము, మమ్మును మా క్షమాపణ ప్రార్ధనలనుబట్టి శుద్దీకరించెను. గత కాలములో నీవు పాపములో పడవేసిన మనుష్యులు ఏరి? నీ దగ్గర ఉండవలసినదే గదా! కన్నెత్తి చూడు, మోక్షములో నున్నారు!