క్రమకర్త: ఫాదర్. ముంగమూరి దేవదాసు

4. సమాధానకర్త



ఇప్పుడు సమాధానకర్తయెన క్రీస్తుప్రభువు వచ్చి, సమాధానము చెప్పును. మీరిద్దరు వాదించుకొనుటవలన ఏమి ప్రయోజనము? స్త్రీల పక్షముగాను, పురుషుల పక్షముగాను ఉండువారు ఎవరును లేరు గనుక నేను వచ్చినాను. స్త్రీలలోనుండి జన్మించుటవలన స్త్రీల పక్షముగాను, పురుష రూపముగా జన్మించుట వలన పురుషుల పక్షముగాను, నేను ఈ లోకమునకు వచ్చినాను.


సమాధానముగా ఉండండి, వాదించకండి, పోట్లాడకండి. వివాహకాలమందు నేను ఇద్దరిని సమముగానే దీవించినాను. "దేవుడు జతపరచిన వానిని నరుడు విడదీయ కూడదని" మీరు గ్రంథములో చదువుకొని యున్నారు. మీ ఘర్షణను బట్టి చూడగా, మీరు ఒకరిలోనుండి ఒకరు విడిపోయినట్లు కనబడుచున్నది గదా! అని ప్రభువు చెప్పినట్లున్నది.