సైతాను నెదిరించు సూత్రములు
Index
అనుబంధము
1. సైతాను నెదిరించు సూత్రములు
-
1) ప్రార్ధనలు,
- 2) దైవస్తుతులు,
- 3) ఎదిరింపులు,
- 4) కీర్తనలు,
-
5) గమనికలు.
1. ప్రార్ధనలు
-
ఎ) దేవా! సాతానును, అతని అనుచరులను, అతని దూతలను నిలువబెట్టి, "మీకు నేను ఏ మేలు చేయలేదా!" అని అడుగుము.
-
బి) దేవా! యుధ్ధ భటులవలె మేము ప్రతిదినము, సాతానును ఎదిరించేటట్లు మాకు తెగింపు అనుగ్రహించుము.
-
సి) దేవా! సాతాను ఎన్నిమాయలైన చేయునుగాని, అతని తంత్రోపాయములను మేము ఎరుగనివారము కాము అనియు, శరీర నేత్రములకు కనబడని
యుద్దోపకరణములు, మా ప్రభువు ఇచ్చినవి మా యొద్దనే ఉన్నవనియు తలంచుకొని, ఆత్మీయ యుద్ధము సాగించుకొనేటట్లు ముందడుగు వేయు
కృప
దయచేయుము.
-
డి) ఓ దేవా! "సాతానును, అతని సైన్యములును క్రీస్తుప్రభువు వలన ఓడింపబడినవారు" గనుక వారు మమ్ములను ఏమి చేయగలరు! అని
మేము
అనుకొని, ప్రభువుయొక్క విజయ బలముమీద ఆనుకొని, వాటిని మా పాదముల క్రిందవేసి త్రొక్కేటట్టు మాకు శౌర్యము దయచేయుము.
-
ఇ) ఓ దేవా! మేము సాతానును "ఎదిరించే కొలది" అతడు చెలరేగునని మాకు తెలియును. అయినను అతని బెదిరింపులు, మేము చేసే
ఎదిరింపుల
ఎదుట ఏ మూల? అని నమ్మి, అతడు చెలరేగిన దానికంటె మేము ఎక్కువ చెలరేగుటకు మాకు పౌరుషము దయచేయుము.
-
ఎఫ్ ) ప్రభువా! ఈ సమయములో నీవు మా దగ్గర ఉంటే, బైబిలులో వానికి విరోధముగా ఎన్ని వాక్యములు ఉన్నవో, ఎన్ని కథలు ఉన్నవో,
అవన్నియు వానిమీద పడేటట్లు విసరివేయుము. ఈ విధముగా మాకు యుద్ధములో సహాయము చేయుము.
-
జి) మా ప్రభువా! ఎఫెసీ. 6వ అధ్యాయములో వ్రాయబడిన ఆయుధములు అన్నియు మాకు ధరింపజేసి, ఈ యుద్ధములో ఆకాశమువరకు వెళ్ళి
ఎగిరే
జెండాను మాకు దయచేయుము.
-
హెచ్ ) యేసుప్రభువా! నీవు సిలువ మ్రానుమీద ఉండి, సాతాను అనే ఘట సర్పముయొక్క తలను చితక గొట్టినావు. అయినను వాడు తోకను
ఆడించినను, మేము భయపడకుండునట్లు మాకు నిర్భయ హృదయము దయచేయుము.
-
ఐ) క్రీస్తు ప్రభువా! ఏప్పట్టికైనను "సాతానుకు, వాని దూతలకు, అనుచరులకు, నరకాగ్ని తప్పుదు" అని వ్రాయబడిన వాక్యము,
వారికి
నోటిసు బల్ల దగ్గర కనబడేటట్లు చేయుము. ఈ ప్రకారముగా వాడిని యుద్ధములో నిరుత్సాహపరచుము.
-
జె) యేసుప్రభువా! "మమ్మును శోధించుటకు వానికి సెలవున్నదని", సైతాను అనుచున్నాడు. లోకములో ఉండే మనుష్యులందరు నీకు అర్జీ
పెట్టుకుంటే, ఒక్క నిమిషములో నీవు వానిని బంధిస్తావు, గాని అందరూ సమకూడరు గనుక వారి ప్రతినిధులుగా మేము
వేడుకొనుచున్నాము.
"దేవా! సాతానుయొక్క స్వాతంత్ర్యమును తీసివేయుము. మా పక్షముగా
సాతానును బంధించివేయుము".
-
కె) దేవా! ఆరు వేల సంవత్సరములనుండి సాతాను ఎంతమందిని పడవేసినాడో, ఎంతమందితో పాపము చేయించి చంపించినాడో, ఎంతమంది
భక్తులను
హతము చేసెనో, ఈ మూడు గుంపులను నీ పాదముల దగ్గర పెట్టుచు అడుగుచున్నాము.
-
యల్) ప్రభువా! చీకటి అనేది పిశాచి పని. దానివలన మాకు ఏ కీడును కలుగ నీయకుము. ప్రభువా! సాతానునుబట్టి సమయమునుగాని,
వస్తువులను గాని, వ్యర్థము చేసికొనకుండ మమ్మును కాపాడుము.