సైతాను నెదిరించు సూత్రములు
Index
2. సాతానుపై జయము
-
31) ఓ సైతానా! అంతెక్రీస్తు, అబద్ధ ప్రవక్త, దయ్యములు అగ్ని గుండములో పడవేయబడుననియు, సాతాను పాతాళములో వెయ్యేండ్లు
బంధింపబడుననియు, వ్రాయబడిన వ్రాతలు నీవు చదువలేదా? అయినను, నీవు బహుబింకముతో ఏమియు నేరములేనట్టు మాట్లాడుచున్నావు.
-
32) ఓ సైతానా! నీకు అపజయము కలిగినట్లు, బైబిలులో అనేక స్థలములలోనున్నవి. అవి మాకు ధైర్యము కలుగజేయుచున్నవి.
యేసుప్రభువు
మాకు
ఆదరణ, ధైర్యము ఇచ్చు మాటలు బైబిలంతట వ్రాయించెను. అవి మాకు
ధైర్యము కలుగజేయుచున్నవి.
పాట: దివ్యగ్రంథము, దివ్యగ్రంథము
ఎచ్చటనైన వెదకిన సహాయము దొరుకును
కష్టములు వచ్చిన, నష్టములు వచ్చిన
విడువకుండ చదువుడి దివ్యగ్రంథము
-
33) ఓ సైతానా! తుదకు నీ రాజ్యము పూర్తిగా
కూలిపోవుననియు,
క్రీస్తు రాజ్యము పైకి వచ్చుననియు ప్రకటన గ్రంథములోనున్నది. అది ఎప్పటికైనా నెరవేరును గదా! ఇది నీకు తెలిసియు మా
మీదికి
దండెత్తుచున్నావు.
-
34) ఓ సైతానా! నీకు విరోధి అని పేరు వచ్చినది. ఇది బైబిలులో ఉన్నది. కాబట్టి నీవు విరోధివి కాని స్నేహితుడవు కావు.
(దైవ)
విరోధులు నరకమునకు వెళ్ళుదురు. తిన్నగా నరకానికి వెళ్ళే నీవు, ఏ ముఖము పెట్టుకొని మా దగ్గరకు రాగలవు?
-
35) ఓ సైతానా! యేసుక్రీస్తు ప్రభువు సాతానును అతని అనుచరులను, పాపములను, పాపఫలితములను జయించి నరకములో వేసినారని దైవ
గ్రంథములో నున్నది. అది ఎవరికి బదులుగా చేసిన జయమని అనుకొను చున్నావు? నీకు బదులుగా చేసిన జయమని మురుస్తున్నావా
ఏమిటి?
లేదు
ఆయన మా కొరకు చేసిన జయము, అది మా జయము. మేము జయించినట్లే. జయించిన వారి మీద ప్రగల్భాలు చూపించుటవల్ల నీకేమి
ప్రయోజనము?
నీవు మరింత పాపము పోగుచెసికొనుచున్నావు. లోకములోని భక్తులందరిని ఈలాగే చెరిపి వేయుచున్నావు.
-
36) ఓ సైతానా! మా దోషములు నీ చెవిని బడకుండ, మా యేసుప్రభువు చేయలేడా! ఆయనకు శక్తిలేదా! ఆయన సర్వశక్తుడు కాడా! మేము
ఆయనను
ప్రార్ధిస్తే ఏమితప్పు? మా ప్రార్ధనలో, మా నడకలో, మా సంఘములో తప్పులు పట్టుచున్నావు. నీలోని తప్పులు చెప్పుకొనవు,
ఎందుచేత?
ఎక్కువ తప్పులు ఎవరిలో నున్నవి? గ్రహించుకొనవు. నీలోని దూలమును తీసివేసికొనవు. మా కంటిలోని నలుసును చూడడమేల? క్రీస్తు
ప్రభువునుబట్టి మా సంఘమునకు జయము. నీ క్రియలకు నాశనము.
-
37) ఓ సైతానా! "తప్పులెంచువారు తండోప తండాలు...... తమ తప్పు లెరుగరు" అను పద్యము నీకే చెల్లును.
-
38) ఓ సైతానా! నీవల్ల పడగొట్టబడిన పాపాత్ములందరు, పరమభక్తులై పరలోకములో నున్నారను సంగతి నీకు తెలియదా?
-
39) ఓ సైతానా! దేవుడును, పరిశుద్ధ అవతార పురుషుడును అయిన యేసుప్రభువే, మమ్మును కనికరించి, ప్రేమించి,
శుద్దిచేస్తుండగా ఈ
కార్యములు చేయుటకు శక్తిలేని నీ లెక్కేమిటి మాకు?
-
40) ఓ సైతానా! ఏమాయెను! ఏమాయెను! అపవాది యత్నాలు ఏమాయెను? వరుస ప్రయత్నాలు ఏమాయెను? మానవుల యత్నాలు ఏమాయెను? వేదన
బాధలు
ఏమాయెను? సమాధి యావత్తును ఏమాయెను? ఘాటు జాగ్రత్తలు ఏమాయెను?
-
41) ఓ సైతానా! మా ప్రభువు నిన్ను, నీ సైన్యమును, నీవు తెచ్చిపెట్టిన పాపమును, ఆ పాపము తెచ్చిపెట్టిన దుష్ట ఫలితమును,
వ్యాధులను, అవమానములను, ఇబ్బందులను గెల్చినాడు. గనుక మేము కూడ వాటన్నిటిని గెలువగలము. నీవేమి చేయగలవు? మరియు సిలువ
మ్రాను
మీద, మా ప్రభువుయొక్క శరీరమంతటిని నీవు బాధించినప్పటికిని ఆయన గెలిచినాడు. సహించుట వలన ఆయనకు జయము కలిగినది. ఆలాగే మా
శరీరమునకు నీవెన్ని కష్టములు తెచ్చిపెట్టినను, ఆయన సహింపునుబట్టి మేము కూడ జయించ గలము. నీవేమి చేయగలవు? మరియు ఆయనను
చంపించి,
సమాధి చేయించినావు. కాని ఆయన బ్రతికి లేచినాడు. నీకిది తెలుసునా? అలాగే విశ్వాసులు చనిపోయినప్పటికిని తిరిగిలేచి,
మోక్షమునకు
వెళ్ళుదురు. అప్పుడు నీవేమి చేయగలవు?
-
42) ఓ సైతానా! ద్వితీయోపదేశ కాండమనే పుస్తకము, నిన్ను హడలు గొట్టుచున్నది. ఎందుకంటే నిన్ను జయించుటకు మా ప్రభువు
వనవాసము
చేయుచున్న కాలములో, ఆ గ్రంథములోని వాక్యములను తీసి నిన్ను చితుక గొట్టినాడు (మత్తయి 4వ అధ్యాయము; ద్వితీ. 8:3, 6:13,
6:16).
సైతానా! నిన్ను ఎదిరించుటకు ఈ గ్రంథము నుండియే వాక్యము ఎత్తి, మా ప్రభువు నిన్ను జయించినాడు.
-
43) ఓ సైతానా! నీకు ప్రకటన గ్రంధమంటే హడలు. నీ కడవరి శిక్ష అందులో నున్నది. నీకు గొయ్యి, నరకము - ఈ రెండును ఉన్నవి.
మాకదే
ధైర్యము. ఎప్పటికైనా నీవు ఆ మట్టులేని గోతిలోనికి వెళ్ళేవాడవే, నిత్యాగ్ని నరకములోనికి వెళ్ళేవాడవే. నీకేమిటి భయపడేది?
నీవే
మాకు భయపడాలి. మా ప్రభువును బట్టి ప్రకటనలోని సంఘమునకు జయము, సైతానా! నీకు అగ్నిభయము.
-
44) ఓ సాతానా! "అపవాదియొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయెను" (1యోహాను 3:8) అను వాక్యములో,
సాతానును
వెళ్ళగొట్టుటకు అని లేదు, సాతాను క్రియలను లయపరచుటకు అని ఉన్నది.
స్తుతి: ప్రభుయేసు రక్తమునకు జయము. సైతాను (అపవాది) క్రియలకు లయము. ఇట్లనుటకు ఇదే మాకు సమయము.
"దేవా! తండ్రీ నీకు" అను కీర్తనలోని వచనము,
"సైతాను క్రియలకు సర్వనాశనము = నీ తలంపులకెల్ల - నెరవేర్పు నిజము
-
45) ఓ సైతానా! అవ్వకు నిషేధ ఫలము చూపించి మోసము చేసినావు. నీవు అలాగు మోసము చేసినందున, దేవుని కుమారుడు సిలువ
వేయబడినప్పుడు
ఆయన కాళ్ళక్రింద నిన్ను సిలువవేయునని నీకు తెలియదు.
-
46) ఓ సాతానా! ఒక దొంగ మొదటిసారి దొంగతనము చేస్తే, మొదటి శిక్ష రెండవసారి చేస్తే రెండు శిక్షలుండును. అలాగే ఆదాము
హవ్వలు
మొదలుకొని, ఎన్నికోట్లమందిని మోసముచేసినావో, ఎన్ని పర్యాయములు మోసము జరిగినదో, అన్ని పర్యాయములు నీకు శిక్షయే. ఆఖరు
శిక్ష
నరకాగ్ని ఇన్ని శిక్షలున్నప్పటికిని నీకు బుద్ధిలేదు, మొండివాడవు. బుద్ధిలేనివారికి, మొండివారికి దేవుడే బుద్ధి
చెప్పవలెను.
అనగా నిన్ను శిక్షించుటే. మనిషి తప్పు చేస్తే దేవుడు శిక్షించి, రక్షించును. దయ్యములకు అలాగు కాదు. ఆయన వాటిని
శిక్షించుటయే
గాని రక్షించడు.
ఉదా: నెపోలియన్ చక్రవర్తి యుద్ధ కాలములో, శత్రువులను పట్టుకొని, అనేకులను ఖైదులో వేయించెను.
దగ్గరనున్న
కమిటి వారిని పిలిచి ఈ ప్రశ్న వేసెను. "ఖైదులోనున్న శత్రు పటాలమును లెక్కించుమనెను". నెపోలియన్ సైన్యముకన్న,
పట్టుబడిన
శత్రు సైనికులే ఎక్కువ గలరు. వీరందరిని విడిచిన యెడల శత్రు సైన్యము ఎక్కువై. మనపైబడుదురు గనుక విడువమంటారా? అని
ప్రశ్నించెను. కొందరు విడిచిపెట్టమనిరి. ఇంకా మీరు చెప్పవలసినది ఏమైనా గలదా? అని అడుగగా, కమిటి వారు - "మీరే
సెలవియ్యండని"
జవాబిచ్చిరి. అందుకు నెపోలియన్ - "అందరిని విడిచినా, వారు వీరు కలిసి మనలను ఓడింతురు. గనుక తుపాకితో అందరిని కాల్చి
చంపండనెను". ఈ వార్త శత్రువులు విని భయపడి, పటాలమును వెనుకకు తీసుకొనిపోవుదురని చెప్పెను. అట్లే ఒక దయ్యమును
విడిచిపెడితే,
పదివేలమంది విశ్వాసులను నాశనము చేయును. అందుకు ఏమి చేయవలెను? కాల్చివేయ వలెనా? కాల్చివేయుట అంటే భూతముల కొరకు
అగ్నిగుండము
కాచుకొని యున్నది. ఓ భూతమా! నీకు అంత గడువిచ్చి, దయతో నిన్ను శిక్షంపకుండ ఉన్నందులకు, నీవు సృష్టికర్త వారికి ఎంత
కృతజ్ఞుడవై యుండవలెను! కాని రక్షింపబడిన భక్తులను చెడగొట్టుటకు, వారిమీదికి వెళ్ళుచున్నావు గనుక నీకిది
వినిపించుచున్నాము.
-
47) ఓ సైతానా! ఎలీషా తన సేవకునితో- శత్రువుల దండు కంటే మన దండే ఎక్కువని చెప్పలేదా? సైతానా! నీవు దండెత్తినా, నీ
దండుకంటే
మా
సైన్యమే ఎక్కువని నీకు తెలియదా? నీవు బాగుగా చదువవు, ఎంత బుద్ధిహీనుడవు!
-
48) ఓ సైతానా! బుషులు లోకమునకు వేరుగానుండి, లోకమంతటి కొరకు ప్రార్ధించుచున్నారు. మేము లోకములో ఉండి, లోకమంతటి కొరకు
ప్రార్ధించుచున్నాము. మా ప్రార్ధనలు కొట్టివేయబడవు. ఈలాగు నిన్ను నీ సైన్యమును జయించుదుము. నీకు నాశనమే తెలిసికో, వారి
ప్రార్ధనలకుండే శక్తి వారికున్నది. మా ప్రార్ధనలకుండే శక్తి మాకున్నది. ఈ రెండు శక్తులు గల ప్రార్ధనల వలన నీకు నాశనమే.
-
49) ఓ సైతానా! మా పక్షముగా పరలోకపు దేవదూతలు, భూలోకపు బుషులు పటాలముగా నున్నారు. ఈ రెండు పటాలముల సహాయమున నిన్ను తప్పక
గెలుస్తాము.
-
50) ఓ సైతానా! నీవు గెలువగల కీడు ఉద్దేశించితివి. కాని అది మాకు మేలుగా పరిణమించెను. మాకు జయము కలుగుటలో ఆ మేలు
కనిపించినది.
గనుక ఓ సైతానా! నీకే కీడు.
-
51) ఓ సైతానా! నీ రాజ్యమును, నిన్ను పడగొట్టవలసినదని భక్తులు చేసిన ప్రార్ధనలు అన్నియు, నేడు పూర్తిగా నెరవేరనై
యున్నవి.
మాకు సంతోషము, నీకు నిత్యదుఃఖము. మాకు జయము. నీవు ఎంత మందిని ఏడ్పించినావో ఆ శాపము నీకు తగులును.
-
52) ఓ సైతానా! త్రాచుపామును నెమలి తినుచుండును. ఒకదరి నుండి పాము దానిని కరచుచుండును. ఈ రెండు పనులు జరుగుచున్నప్పుడు,
పాము
పని అయిపోవును. ముంగిస పామును చూడగానే, పరుగెత్తుకొని వెళ్ళి కొరికి వేయును. విశ్వాసులు ఎప్పటికైన ఓ సాతానా! నిన్ను
జయించక
మానరు.
-
53) ఓ సాతానా! నీవెందరిని శోధించినావో, నీకన్ని శిక్షలు. ఎన్ని పర్యాయములు శోధించినావో, నీకన్ని శిక్షలు. ఎన్ని శోధనలు
ఏర్పరచినావో, అన్ని శిక్షలు.