సైతాను నెదిరించు సూత్రములు
Index
5. వాయు మండలములోని ప్రార్ధన పుస్తకములు
-
మొదటి ప్రార్ధన: యేసుప్రభువా! ఒక మనవి: ఈ ఎదిరింపులన్ని ఒక మహా పుస్తకములో వ్రాయించి, వాయుమండలములో
(ఆత్మీయ)
బల్లమీద
పెట్టుము. ఆ పుస్తకమును ప్రతి నిమిషము భూతములన్నియు చూచుచుండును. అందువల్ల వాటియొక్క హృదయములో క్రొత్త భీతి ఏర్పడును.
అందుచేత మా స్వాతంత్ర్యముతో, వాటి స్వాతంత్ర్యమును జయించుచున్నామని వాటికి తెలియును.
-
రెండవ ప్రార్ధన: ఓ తండ్రీ! మేము మాకు తోచిన ఎదిరింపులు వ్రాసినాము. గాని సహకారులైన దేవదూతలు, మోక్షలోక
వాస్తవ్యులు,
భూలోక
విశ్వాసులు, ఇతర సన్నిధి కూటస్థులచేత కూడ ఇట్టివి అనగా మా పుస్తకములో లేనివి, కొత్తవి వ్రాయించి, ఈ రెండవ పుస్తకము
కూడ
వాయుమండలములో మరియొక (ఆత్మీయ) బల్లమీద పెట్టించుము. సాతానుకు భయము రెట్టింపగును, భూమి మీద మా జయము రెట్టింపగును.
-
మూడవ ప్రార్ధన: తండ్రీ! మరియొక మనవి. లోకములో మిగిలిపోయిన పాపాత్ములు, అవిశ్వాసులు ఉన్నారు. వారియొద్దకు నీవు
ఎవరినైన
పంపించిన యెడల, ఆయన వారినిట్లు అడుగును. "సాతాను మిమ్మును ఎన్ని పర్యాయములు బాధించినాడు"? ఇట్లు అడిగి ఆ సేవకుడు, తన
రిపోర్టును ఒక పుస్తకముగా వ్రాయును. అవిశ్వాసులు చెప్పరుగాని, ఆ సేవకుడు ఒక జవాను (సేవకునివలె వెళ్ళి కూపీ (రహస్యము)
తీసి,
ఆ
పుస్తకమును తయారుచేసి నీకప్పగించును. ఈ పుస్తకము కూడ వాయుమండలములో ఒక ఆత్మీయ బల్లమీద పెట్టించుము.
-
నాల్గవ ప్రార్ధన: ప్రభువా! మరియొక మనవి: పరిత్యాగ పత్రిక ఒక పుస్తకముగా వ్రాసి మరియొక బల్లమీద పెట్టించుము.
పరిత్యాగ
పత్రిక
అంటే దయ్యములకు బాధ గోల.
-
ఐదవ ప్రార్ధన: ప్రభువా! ఈ సైతాను నెదిరించు విషయములను గురించి దైవసన్నిధి కూటములలో ఇట్లనుచున్నారు. "ఆయన (యం.
దేవదాసు
అయ్యగారు) వలె ఎవ్వరును లేరు గనుక ఈ ఎదిరింపులు మరియెవరును చెప్పలేరు. గనుక ఆయనను, సైతాను పడవేసినది (అనగా శ్రమలు).
అయినను
ఆయన జబ్బుతో మంచముమీద ఉన్నను, అనారోగ్యముతో వాలు కుర్చీపై ఉన్నను ఈ నోట్సు చెప్పలేదా? "నా పంతము నెరవేరినదా, వాడి
(సైతాను)
పంతము నెరవేరినదా!" అని ఆయన అన్నారు. యేసుప్రభువా! ఇదియును వాయు మండలములోనికి వెళ్ళవలయునని ప్రార్ధించుచున్నాము.
-
ఆరవ ప్రార్ధన: ఓ దేవా! మీరు కలుగజేసిన యావత్తు సృష్టియొద్దకు (మూల్గుచున్న సృష్టి రోమా 8వ అధ్యాయము) ఎవరినైనా
పంపించుము.
అప్పుడు సృష్టిని చూచి, సృష్టిలోనున్న ప్రతిజీవిని చూచి ఆ పరలోక జవాను, "సైతాను వలన నీకు ఏమి కష్టము కలిగినదో
చెప్పుమని"
అడుగవలెను. ఈ రిపోర్టునుకూడ వాయు మండలములో, వేరొకబల్ల మీద పెట్టించవలయునని ప్రార్ధించుచున్నాము.
-
ఏడవ ప్రార్ధన: ప్రభువా! మరియొక మనవి: ఓ ప్రభువా! "యం. దేవదాసు అయ్యగారి మనసులో అనేక క్రొత్త సంగతులున్నవని"
చెప్పియున్నారు.
అవి కొన్ని మాత్రమే ఈ 62 ఏండ్లలో బయటికి వచ్చినవి. ఇంకా ఉన్నవి, అవి వ్రాయబడలేదు. ఏ దూతచేతనైనా వాటిని వ్రాయించి, వాయు
మండలములో ఆ పుస్తకమును, ఏడవ బల్లమీద పెట్టించుమని ప్రార్ధించుచున్నాము.