సైతాను నెదిరించు సూత్రములు
Index
12. బైబిలు
-
97) ఓ సాతానా! బైబిలు 2000 భాషలలో అచ్చువేయబడి యున్నది. నీవు ఏ భాషలోని వారి దగ్గరకు వెళ్ళినను, అక్కడ ఆ భాషలో నీ
కంటికి
దేవుని వాక్యము కనబడును. అది నీకు బాణము. అయినప్పటికిని నీకు సిగ్గు, భయము లేదు. ఎందుకంటె నీవు మొండివాడవు.
-
98) ఓ సైతానా! రక్షణ వాగ్ధానములు బైబిలు నిండ ఉన్నవి. అవి మా తండ్రి పలుకకుండ నీవు ఆపుచేయగలిగినావా? ప్రవచనముగల పాత
నిబంధన
వ్రాయబడకుండ, ఓ సాతానా! పరిశుద్ధుల కలాలు ఆపివేయగల్గినావా?
-
99) ఓ సైతానా! యేసుప్రభువు పుట్టకుండా చేసినావా? నీవు అనేక పర్యాయములు ఆపుచేయుటకు ప్రయత్నించినావు. ఈ మాటలు బైబిలులో
స్పష్టముగా వ్రాయబడలేదు గాని చరిత్రవల్ల మాకర్ధమైనది.
-
100) ఓ సైతానా! నెరవేర్పుగల క్రొత్త నిబంధన వ్రాయబడకుండ, నీవు సువార్తికుల కలాలు ఆపివేయ గలిగినావా?
-
101) ఓ సాతానా! పూర్వకాలమందు రాజులు, తమకు తెలియకుండ బైబిలు చరిత్ర రాళ్ళమీద చెక్కించినారు. అవి ఇప్పుడు బైబిలంతటికి
సాక్ష్యార్ధముగా నున్నవి. అవి చెక్కబడకుండ నీవు ఆపుచేయ గలిగినావా?
-
102) ఓ సాతానా! బైబిలుకంటె అనేక రెట్లు పెద్దవైన, సంఘచరిత్ర పుస్తకములు వ్రాయబడకుండ ఆపుచేయగల్గినావా?
-
103) ఓ సైతానా! బైబిలుయొక్క అర్ధములున్న వ్యాఖ్యాన గ్రంథములు లెక్కకు మించి ఉన్నవి. అవి వ్రాయబడకుండ పండితుల యొక్క
జ్ఞాపకశక్తిని ఆపుచేయ గలిగినావా?