లెంటులోని పదహారవ దినము - శనివారము

యెషయా 53:3; లూకా 23:33-43; 2కొరింధి 5:21

ప్రార్ధన:- తండ్రీ! నీవు చేసినవన్నీ మా కొరకే. నిన్ను నీవే మా కొరకు ఇచ్చివేసి కొన్నావు గనుక నీకు స్తోత్రము. పాప మెరుగని నీవు మా కొరకు అన్నీ చేసినావు. తుదకు నీవే పాపీమైనావు. ఎమి గ్రహించగలము! ఈ నీ చరిత్రను తలంచుకొని కృతజ్ఞతా హృదయముతో కన్నీటి వందనములు ఆచరించు కృప దయచేయుము. ఆమేన్.


'మనకొరకు శిశువు పుట్టెను . మనకు కుమారుడు అనుగ్రహింపబడెను' అని ప్రవక్తయైన యెషయా వ్రాసినాడు. ఇది క్రిస్మస్ పాఠము. క్రిస్మస్ చరిత్ర, క్రిస్మస్ ప్రవచనము. ఈ ప్రవచనములో ముఖ్యమైన మాట 'మనకొరకు'. ఈవేళ మన ప్రసంగము కూడా 'మన కొరకు' అనే మాట. 2 కొరింధి 5:12లో పాపము లేని ప్రభువును మనకొరకు పాపముగా చేసెను. ఇప్పుడు యెషయా వ్రాసింది చూద్దాము. యెషయా జన్మ చరిత్ర పౌలు మరణ చరిత్ర వ్రాసిరి. జన్మము మనుష్యుని జీవితములో మొదటిది, చివరిది మరణము. యేసుప్రభువు యొక్క జన్మము మొదలు మరణము వరకు ఈ మధ్య ఉన్నది, జరిగినది అంతయు, అనగా ఏమి చెప్పినారో, ఏమి జరిపినారో, ఏమి అనుభవించినారో అదంతయు మనకొరకు. మొదటినుండి చివరి వరకు మనకొరకే. చివరినుండి చిట్టచివరి వరకు మనకొరకే. అనగా మరణమొంది, సమాధిలోకి వెళ్ళిన తరువాత జరిగిన పునరుత్ధానము, ఆరోహణము, రెండవరాకడ, వెయ్యేండ్ల పరిపాలన, సజీవుల తీర్పు అంతా మనకొరకే. క్రీస్తు తన కొరకు కాదు అంతా మనకొరకే.


యషయా 53లో ఆయన ఈలోకమునకు వచ్చి, సిలువ మరణము పొందుదురని ప్రవక్తలందరు ఆయనను గురించి వ్రాసిన వ్రాతలన్ని మనకొరకే. పాత నిబంధనలో ప్రభువును గూర్చి చూచాయగా ఎక్కడెక్కడనున్నదో, ఎక్కడ స్పష్టంగా నున్నదో పరిశీలించవలెను.'మనకొరకు కమారడనుగ్రహింపబడెను, మనకొరకు శిశువు పుట్టెను' అని ఈ విషయము స్పష్టముగా నున్నది. కొన్ని స్పష్టముగాను, కొన్ని చూచాయగాను ఉన్నవి. ఈ రెండును మనకొరకే. బేత్లెహేములో పుట్టుట, యెరూషములో శ్రమపడి, కల్వరిలో సిలువ వేయబడుట అన్నీ మనకొరకే. గనుక ఆదికాండమునుండి ప్రకటన వరకు 66 పుస్తకములలోను ఎర్ర సిరాతో మన కొరకే వ్రాసెను. అదంతయు మనకొరకే. గనుక ఈ 66 పుస్తకములలోని కధేగాదు, అనాది స్థితి కూడా మనకొరకే గాని, అది మనకు తెలియదు. ఆది నుండి మనకు తెలుసు.


ఆదికాండములో సృజింపబడిన భూమి, వెలుగు, నీరు, గాలి, నేల, పంటలు అన్నితు మనకొరకే. ఆలాగుననే క్రీస్తు ద్వారా కలిగిన సృష్టి అంతయు మనకొరకే. యోహాను 1:1లో ఆయన లేకుండా ఏమియు కలుగలేదు అని ఉన్నది. గనుక కలిగినదంతయు ఆయనవల్ల కలిగినది. అదంతా మనకొరకే. ఇదంతా మనకొరకే. గాన ఇక్కడ, అక్కడ, ఎక్కడైన మనము ధన్యులమే. అన్ని కాలములలో, అన్ని స్ధలములలో ధన్యులమే. చివరగా పరిశుద్ధులుగానున్న, పాపులుగానున్న ధన్యులమే. ఎందుకనగా మన పాపములన్నీ ఆయన మీద వేసికొన్నారు. గాన మనము పాపములో పడినను ప్రభువు లేవదీయుటకే వచ్చెను. గాన ధన్యులమే. ఆయన మోయడానికే వచ్చెను. గాన మన మీద నుండి పాప భారమును తీసివేసి ఆయన మీద వేసుకొని మోయవలసిందే. ఇక పాపము మన మీద లేవు. ఆయన మీదనే ఉన్నవి. మనము పాపము చేసినప్పుడు మనము పాపులము. ఆయన వచ్చి అవి తన మీద వేసికొన్నందున ఆయన పాపి. మనము పరిశుద్ధులము. ఆ కధ సిలువ మ్రానుపై జరిగింది.


ఎప్పుడైతే ఆయన తనపై వేసికొన్నాడో ఆయన మన శిక్ష అనుభవించి మరణముపొంది, సమాధియై మూడవ దినమున లేచి మరణము దులిపివేసెను. తరువాత చావు ఆయనమీద లేదు. చావు ఇకముందుకు మన మీద కూడ ఉండదు. ఆయన చావును దులిపివేసి, మహిమ శరీరముతో నున్నారు. రాకడప్పుడు మనలనుకూడ మహిమ శరీర ధారుగా చేస్తారు. (2 కొరింధీ 5:21)లో ఉన్నట్లు ఆయన తన కుమారుని ఈలోకమునకు పంపుట ద్వారా పరిశుద్ధుని పాపముగా చేసెను. ఈ వాక్యము చదివితే కొందరు అభ్యంతర పడుదురు. అదెంత చెడ్డమాట అందురు. మనము గ్రహించలేము గాని ఒక్కమాట ద్వారా గ్రహించగలము. ఏలాగనగా పాపమెరుగని ఆయనను మనము పాపిగా చేసినాము. మన పాపమే ఆయనను సిలువకు అంటగొట్టెను. గాని ఆయన పాపము లేని పరిశుద్ధుడు. కాబట్టి ఆయన జన్మ ఏలాగు మన కొరకో, ఆలాగే ఆయన మరణము కూడ మనకొరకే. శిశువు పుడితే సంతోషము, చనిపోతే దుఃఖము. ఆలాగే ప్రభువు బేత్లెహేము నందు జన్మించగా సంతోషించినాము. గాని తన చావు నందు ఆయన మన పాపములు తనపై వేసికొని మనకు విడుదలనిచ్చి మనకు తేలిక చేసినందున సంతోషించవలెను. మన జన్మ లక్షణము ఏదనగా జన్మ సంతోషము; చావు దుఃఖము గాని ప్రభువు విషయములో జన్మ, చావు రెండునూ సంతోషమే. ఎందుకనగా మనమాయన యందు దేవుని నీతిగా అగునట్లు తన చావు ద్వారా చేసెను గనుక సంతోషించాలి. మనలను నీతి గాను ప్రభువు పాపిగాను చేసెను. ఆయన పాపిగా కాకపోతే మనకు నీతి లేదు. గాన సంతోషించాలి. ప్రభువు మరణమువలన మనకు మేలే. ఇందులో ఒక రహస్యమున్నది. అదేమనగా ఇతర మతస్ధులు ఈ విషయమును గూర్చి మనము పాపము చేయుటేమిటి? దేవుని సుమారుడు చనిపోవుటేమిటి? ఇది కేవలము అన్యాయము అంటున్నారు. క్రైస్తవులు జవాబు చెప్పుట కష్టమేగాని పండితులు చెప్పివేసిరి. ఒక మనిషి అప్పుల పాలైనాడు. ఒక ధనికుడు ఆ పేదవానిపై జాలిపడి అతని అప్పులు తీర్చును. అతను అప్పుల వల్ల పేదవాడు. ధనికుడు తీర్చినందున సంతోషము. ఇతను తీర్చినట్లే ప్రభువు తీర్చుట అన్యాయము కాదు. అప్పు చేయుట ధనికుడు తీర్చుట అనరు గాని ప్రభువు తీర్చినాడు అంటారు. ప్రభువును అన్నారు గనుక ధనికుని అనాలి. ధనికుని అనకపోతే ప్రభువును అని కూడ అనకూడదు.


ప్రశ్న:- ఈ ప్రశ్న ఇప్పుడు హిందూ దేశములో బలముగా ఉన్నది. మొదట కలకత్తాలో బలంగా పుట్టెను. ఇప్పుడు అక్కడ తగ్గి మన ప్రాంతములలో బలంగా ఉంది. ఆయనను అన్యాయముగా హింసించుట ఏమి న్యాయమనే వాదము! క్రైస్తవులేమని చెప్పాలంటే, సరే! మనిషి పాపము చేసినందువలన శిక్ష అనుభవించునట్లు ఇక్కడున్నవారు అనుభవించగలరా? లేరా అని చెప్పాలి. నిజముగా ఆ సిలువే మనకు వస్తే బ్రతుకలేము. ఆయన దేవుడు గాన బ్రతికి వచ్చెను. మనము సిలువ మోయవలసి వస్తే మనకు చావే గాని బ్రతుక లేము. ప్రభువు చావనూ చనిపోయెను, లేవనూ లేచెను. గాన ప్రభువు మరణము వలన మనకు సంతోషము. ప్రభువు బాధాకరము మరణమైన చరిత్ర.


క్రైస్తవులందరు ఈ దినము చాలా ఏడ్చెదరు. కేధోలిక్కులు ఎక్కువ అంగలార్చెదరు. ఈ దినము వారు ప్రభువు విగ్రహము కొయ్యపైపెట్టి ఆనాడు జరిగినట్లు ఈ దినము జరిగించుచు ఏడ్చెదరు. అది తప్పని చెప్పను గాని, ఆ అప్పుల వానికి దిక్కు లేక పోగా ధనికుడు తీర్చినందున ఆ బీదవాడు కృతజ్ఞతతో కన్నీరు కార్చి, నా ఋణము తీర్చి, నను విడిపించినావనే కృతజ్ఞతో ఏడ్చెను. అదే కధోలిక్కుల ఏడ్పయినది, దుఃఖ కన్నీరు కాదు. ఋణము తీర్చినండున వచ్చే కన్నీరు. కృతజ్ఞత కన్నీరు. మన ధ్యానములో అట్టి కృతజ్ఞత కన్నీరు కార్చాలి. దుఃఖ కన్నీరు ఆయనకింపే. మన విశ్రాంతి సమయములోను, ప్రభువు ఉపకారములు తలంచితే కన్నీరు వచ్చును. ఇది అయ్యగారి యొక్క మన యొక్క అనుభవము. దుఃఖ కన్నీరు అయ్యగారికి రాలేదు, కృతజ్ఞత కన్నీరు వచ్చినది.


మూడు కన్నీళ్లున్నవి:

ఈ కన్నీరు అయ్యగారికి వచ్చాయట. రెండవ దానిలో శ్రమ చూచి దుఃఖించనక్కరలేదు. మనలను నీతిమంతులుగా తీర్చుటకు ప్రభువుకు శ్రమల వల్ల కన్నీళ్ళు రాలేదు. గనుక మనకును రాకూడదు. 40 దినములలో అయ్యగారికి వచ్చిన ప్రశ్న, బాధలో ఎవరైనా అమ్మో! బాబో! నాయనో! అని ముల్గుదురు కదా! ఈ మూడు ప్రభువుకు వచ్చెనా? ఈ మూడింటిలో ఏదైనా వచ్చెనా? "వచ్చెనట" అని సువార్తికులు ఆ సంగతి వ్రాతలతో ఎక్కడ వ్రాయలేదు.

ప్రశ్న:- ఆయన ఎప్పుడైన ముల్గెనా? తన యొక్క బాధ మనుష్యులందరు అనుభవించే బాధ కంటే ఎక్కువైన బాధ గనుక ఆ బాధకు గుర్తుగా ఏలీ, ఏలీ, లామా, సభక్తానీ అనగా నా దేవా! నా దేవా! నన్నెందుకు చెయ్యి విడిచితివి. ఆ మాటలో ఎక్కువ బాధను చూపించిరి. గాని నిరాశ రాలేదు. ఈ పోకిరి గుంపును అంగా ప్రభువును శ్రమపర్చే గుంపును గూర్చి మొదటి మాటలో తండ్రి! వీరిని క్షమించు అని అన్నారు. ఏడు మాటలలో మనిషివలె నా దేవా! అనే వరుసలో పిలిచెను. తండ్రీ! అనేది ఇతరులను గూర్చిన్నీ; నాదేవా! అనేది తన్ను గురించినీ పలికెను. గనుక సిలువ ధ్యానములో ఎన్నో మాటలున్నవి.


ప్రభువు జన్మ చరిత్ర మొదలు మరణ చరిత్ర వరకు మధ్యలో నున్న సంగతులన్నీ, మనిషిని శ్రమపర్చేవన్నీ గుంపుగా కనిపించు చున్నవి. సిలువ మ్రాను మీద అన్నీ ఉన్నవి.

సిలువ మీదికి వెళ్లకముందు మృతులను లేపినట్లు, సిలువ మరణములోను మృతులను లేపిరి. ప్రభువు జీవిత చరిత్రలోని విషయలన్ని సిలువ చరిత్రలో కనిపించుచున్నవి. మీరందరు ఇప్పుడు ధ్యానములో ఉండి చూడండి. ఆనంద భాష్పము కొరకును అప్పుడే కన్నీరు ఉపవాసము దేవునికి అంగీకారమగును.


చిన్నప్పుడు అయ్యగారు ఏడ్చి, ఏడ్చే వారిని నవ్వించే వారట.అయ్యగారి టీచరు దొర చనిపోగా ఆయన భార్య మిస్సమ్మ తన దేశము వెళ్ళుచుండగా, అందరూ ప్రోగుచేసి కొంత చందా ఇచ్చిరట! వారిని గూర్చి వ్రాసిన మాటలు ఫేర్వెల్ మీటుంగులో చదువు చున్నారట! చదువు చున్నప్పుడు కన్నీరు కారుతున్నదట. ఆ ఏడ్పుకు ఎక్కుళ్లు వచ్చెను. ఆ దొరసానిగారు ఏడ్చుచున్నారు. అయితే, ఈయన ఏడ్చుచుండగా అమ్మగారికి చిరునవ్వు వచ్చిందట. ఆలాగే మీ ఏడ్పు ప్రభువుకు చిరునవ్వు తేవాలి. ఈ దినము చెప్పినదంతా నా కొరకే. అనుకొనువారు ధన్యులు.


దేవుడు ఈ కొద్ది మాటలను దీవించునుగాక! ఆమేన్.

కీర్తన: "తల వంచి సిగ్గున - నే జేయు నేర - ముల నెంతు నాలోన = బలుమారు నీ గాయముల - గెలికి నిన్ శ్రమ పరచు నా - ఖల దోషములకై ఇపుడు - విలపించి వేడుకొందు" ||నా యన్న||