హృదయపశ్చాత్తాపము

లూకా 23:39-49.

ప్రార్ధన:- మా ప్రియమైన యేసూ! నీవు మా నిమిత్తము పొందు శ్రమలను ధ్యానించుటకై వచ్చినాము. మాకు ధ్యానము కుదురునట్లు చేయుము. సిలువనుండి వచ్చు భాగ్యములన్నీ మాకు దయచేయుము. ఆమేన్.


గెత్సేమనే తోటలో ప్రభువు సాష్టాంగపడి, నేలమీద ప్రార్ధించినారు. ఆయన మోకాళ్ళక్రింద దిండులేదు. వట్టి నేలమీద నుండి ఆయన ప్రార్ధంచినారు.


యూదా పశ్చాత్తాపడెను. అయ్యో! నేను ప్రభువి అప్పగించితినని విచారించెను గాని అతనిది నిజమైన భారమైతే అతడు ప్రభువు దహ్హరకు వెళ్ళి, పశ్చాత్తాప పడును గనుక అతని విచారము ఫలితములేని విచారము, ప్రభువు దగ్గరకు వెళ్ళని విచారమునై యున్నది. కుట్రదారులయొద్దకు వెళ్ళినాడు గాని ప్రభువు దగ్గరకు వెళ్ళలేదు. కనుక మీరు ఈలాగు ఉన్నారేమో పరీక్షించుకొనుడి. యూదావలె యుండకూడదు గానీ ప్రభువు దగ్గరకు వెళ్ళవలెను. యూదా ఇస్కరియోతు ప్రభువు ప్రేమను మూడున్న సం||లు నుండి గ్రహంచలేదు. గ్రహంచినట్లైతే తప్పు ఒప్పుకొనును. అత్తరుపోసిన స్త్రీ పాపములు ప్రభువు క్షమించుట చూచినాడు గాని గ్రహించగల్గిన మనస్సు లేనందున అతడు ప్రభువుయొద్దకు రావలెనని, ప్రభువు నా పాపము క్షమించునని అనుకొలేక పోయినాడు. ఆలాగు అనుకొలేకపోవు కూడా పాపమే. నా బ్రతుకువల్ల ఏమి ప్రయోజనము లేదని అనుకొనలేకపోవుట కూడా పాపము. గనుక మనము, ప్రభువు క్షమించునని నమ్మి, ప్రార్ధించి, క్షమాపణకోరి పొందినయెడల ధన్యులమగుదుము. గనుక మనము కూడా ఏడ్చి దుఃఖించి క్షమాపణ పొందవలెను. నేను విషము త్రాగి చనిపోతే మంచిది అని వసికిన యెడల అదికూడా యూదా లైనే(వరుసే). గనుక యూదా మార్గములోబడి వెళ్ళవద్దు. "నాకు ఈ కష్టము పోవును, ఏదో ఒక కృప, వచ్చునని స్తుతించుట" అనేది మనము కలిగియుండవలెను. అలాగుననే ఎన్ని కష్టములు వచ్చినను అవన్నీ మేలుకొరకై వచ్చుచున్నవి అని స్తుతించడమే కృప. నిరాశ అనేది మనిషికి రాకూశదు దానివల్ల నష్టమే కాని క్షేమము లేదు. యూదా పాపము ఏదనగా, నిరాశ పాపము. యూదా స్వభావము పిరికితనము. యూదా జ్ఞానము యేసుప్రభువు యొక్క ప్రేమలోతును తెలిసికొనకపోవుటయే.


మనిషి గర్వము అణగగొట్టబడవలెనంటే యేసు ప్రభువుయొక్క సిలువను ధ్యానించవలెను. ప్రభువుయొక్క ప్రేమను గ్రహించకపోవడము యూదా రెండవ తప్పు. "తాను చనిపోయి కీడు తప్పించుకొనవలెను" అని అనుకొని ఉరిపెట్టుకొని గొప్ప కీడు తెచ్చుకొనెను. అలాగే మనకు కష్టములు కీడులు వచ్చినపుడు ఇతరులను చావమనడము, చావవలెనని విసుగుకొనటము మొదలగునవి పిశాచి పుట్టించు తలంపులే. అవి యూదా మార్గములోనికి వెళ్ళుటే, విశ్వాసిలైతే ప్రతి కష్టము నా మేలు కొరకే వచ్చెనని, కష్టము అనుభవిస్తే గొప్ప మహిమను పొందగలను అని సంతోషించుదురు. యూదా పాపము నిరాశ అనే పాపము, పిరికి యూదా యేసు ప్రేమయొక్క లోతును గ్రహించకపోయెను.


శ్రమలుపడు కష్టముకంటెను, నాకు కృతజ్ఞత లేకపోవుటే ఆయనకు మరీ కష్టము. ఆయన కష్టములలో యుండగా స్తుతిస్తే, ఆయనకు ఆదరణ కలిగి చిరనవ్వు నవ్వును. యేసుప్రభువా! నీ శ్రమ, నీ దయ, నీ ప్రేమ, నీ జయము నిజముగా మేము గ్రహించవలెను. నిన్ను స్తుతించుటకు, సిలువమీద నీవు చేసిన బోధనుబట్టి నిన్ను చూచిన యూదులు స్తుతిస్తే ఎంత బాగుండును! నిన్ను గ్రహించుటకు మాకు నేర్పించినందుకు వందనములు, నమస్కారములు, ముద్దులు. బల్లెముతో పోడుచుట ఆయనకు శ్రమకాదు గాని మన పాపములు గ్రహించక పోవడమే ఆయనకు గొప్ప శ్రమ. సిలువ దగ్గర స్తుతిస్తే సైతాను సిగ్గుపడును. నీవు చాలా సంతోషిస్తావు. ఈ స్తుతులు అంగీకరించుము. ఆయన సిలువమ్రానుమీద మన కొరకు చేసిన పని, మనము గ్రహించడమే ఆయనకు కావలసిన ఆరాధన. అందనిపండ్లు అందుకొనుటకు నిచ్చెన ఎక్కుట సహజమైయున్నది. దూరముగా నున్నవారిని చూచుటకు గుట్టెక్కుట సహజమైన సంగతి. నిచ్చెన ఎక్కుట మరియు గుట్ట ఎక్కుటలో భేధమున్నది.


ప్రభువు సిలువ ఎక్కుట ఎందుకు? ఫలము అనే జయము కొరకు. తన శ్రమలద్వారా ప్రభువునకు జయము వచ్చినది. ఇది తలంచుచు స్తుతించుకొనవలెను. రెండవది : ప్రభువు జన్మించి 2000 సం||లైనందున నీవు సంతోషమొందవలెను. ఈ కాలములో లోకాంతమువరకు ఎందరు జన్మించిరో వారందరి పాపముల కొరకు ఆయన సిలువ ఎక్కెను. ఆయన కాలములో పుట్టినవారు మాత్రమేగాక ఆదాము మొదలు లోకాంతము వరకు పుట్టిన వారి పాపములు తెలుసుకొనుటకు ఆయన తెలివితో సిలువ ఎక్కెను. అనేకమందిలోనుండి సిలువ స్తోత్రములు వచ్చునట్లు చేసినందుకు స్తోత్రములు. లోకములో ఎందరు స్తుతులు చెల్లించుచున్నారో, ఆ స్తుతులతో మా స్తుతులు కలపవలెనని కోరుచున్నాము. వధ్యస్తంభము అనగా యేసుక్రీస్తువారు వధించబడిన స్తంభము, సిలువ స్తంభము, ఆ స్తంభమును చూచుటకు ఎవరు విశ్వాసమును గట్టి పరచుకొందురో వారే ధన్యులు. నేను గొప్ప, నన్నే అందరు మెచ్చుకొనవలెను అను అహంభావమును, బడాయి, గర్వము, ఇతరులను లెక్కచేయని తనము ఇవన్నీ కలిగినవారు సిలువవైపుకు చూస్తే ఇవన్నీ పోవును. విశ్వాసము గట్టిపడును. అట్టి గర్వము అప్పుడప్పుడు వస్తూయుంటుంది గనుక కనిపెట్టి చూచుకొనవలెను.


ఓ ప్రభువా! మా గర్వము, అతిశయించుట అనే పాపము, అవిశ్వాసము ఇవన్నియు నిన్ను సిలువకు అంటగొట్టెను. ఇవన్నీ మా పాపములే వాటన్నిటినీ నీవు సహించుకొన్నందుకు నీకు వందనములు.


జాన్ బన్యన్ అనే పరమ భక్తుడు ఉండెవాడు. ఆయన వ్రాసిన పుస్తకము 'యాత్రికుని ప్రయాణము ' బైబిలు తరువాత గొప్పగా నెంచబడిన పుస్తకములలో అది ఒకటి. యాత్రికుడు ప్రయాణమై పోవుచు, తన వీపుమీద బరువుమూటతో, నాశనపురము నుండి సీయోను పురములోని సిలువ దగ్గరకు రాగా, వీపుమీది పాపపుమూట పడిపోయెను. మనము సిలువ దగ్గరకు రావడము మన పాపములు పోగొట్టుకొనుటకే.


అట్టి ధన్యత సిలువనాధుడైన క్రీస్తు ప్రభువు నేడు మీకు దయచేయును గాక! ఆమేన్.


కీర్తన: "నా నేరములు యేసు - పైన వేసికొన్న - నీ నెనరునకు స్తోత్రము = నీకు - నేను చూపు ప్రేమ - నీ ప్రాణార్పణ ప్రేమ - నిధి ఎదుట ఏ మాత్రము!" ||మూడు||