లెంటులోని ఐదవ ఆదివారము
గలతీ 6:14
అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు సిలువయందు తప్ప మరి దేనియందు అతిశయించుట నాకు దురమౌనుగాక! దాని వలన నాకు లోకమును, లోకమునకు నేనును సిలువ వేయబడి యున్నాము.
ప్రార్ధన:- దయగల యేసుప్రభువా! నీ ముఖము యెదుట అది(శ్రమలు), మా యెదుట యిది(వాటి జ్ఞప్తి), ఈ ప్రకారముగా నీ సంఘములో జరుగుచున్నది. కాబట్టి నీకు స్తోత్రములు. ప్రభువా నీ ముఖము యెదుట శ్రమలన్నియు కనబడుచున్నవి. ముఖము యెదుట, నీ కన్నులు యెదుట నున్నవన్నియు మాకు నీ యెదుట కనిపించుచున్నవి. తరువాత రెండు వేల సంవత్సనములు జరిగినవి. ఇపుడవి మా యెదుటలేవు, మావెనుక నున్నవి. రెండువేల సంవత్సరములైన తర్వాత మేము వచ్చియున్నాము. మేము వెనుకకు తిరిగి, నీ శ్రమచరిత్ర మా యెదుట పెట్టుకొని ధ్యానించుచు, యీ దినములయందు మా ముఖముల యెదుటకు తెచ్చుకొని, ఒక్కొక్క యంశము ధ్యానించిన యెడల అవి మాకుపయోగకరము. నీ శ్రమ చరిత్రలో మాకు దాచి పెట్టిన వర్తమానము అందించుమని వేడుకొంటున్నాము. నీ శ్రమ చరిత్రలో మా శ్రమ చరిత్ర జ్ఞాపకము చేసికొనుచున్నాము. నిన్ను నమ్ముకొన్నందువలన, నీ వాక్యమును బట్టి నిన్ను ప్రార్ధించినందువలన, నీ మార్గములో నడచుటను బట్టి, రానైయున్న శ్రమలను నీవు లెక్క చేయనట్లు, మేమును, లెక్కచేయని కృప మాకు దయ చేయుము. నీ శ్రమ చరిత్రలో నీకు కలిగిన ఓపిక, నిరీక్షణ మాకు లేదు, కాబట్టి అవి మాకు దయచేయుము. నీవు పలికిన ఏడు మాటల వంటి మాటలు నాకును, మాకును దయచేయుము. ఏదోయొక శ్రమగలిగినవారమై మేమీయాలయములో నీ శ్రమల యెదుట కూర్చున్నాము. ప్రతివిధమైన శ్రమయు మాకుపయోగము కలిగేనిమిత్తమే యున్నది. గనుక అవి గ్రుచ్చుకొని మా మనస్సాక్షిని తట్టును. అర్ధము కాని మనుష్యులను తట్టును. ఈలాగున ప్రతి శ్రమద్వారా మాకు దాచిపెట్టిన బహుమానము కొరకు తయారుగునట్లు మమ్ము నాకర్షింపజేయుము.
తండ్రీ! ఈ వేళ మేము మాటలాడుకొనే మాటలు మా యాత్మ లోపలికి పోయే మాటలు, మా జీవితకాలమంతా మేము బ్రతుకుటకు వెళ్ళే మాటలు. కొన్ని నిమిషములు మీ శ్రమలను ధ్యానించునపుడు, మీ శ్రమల ధ్యానము వలన మా శ్రమలను మరిచిపోయేటట్లు మా దృష్టిని నీ వైపు త్రిప్పుము. నీ ఉపదేశముతట్టు, నీ శ్రమ తట్టు, నీ తట్టు, నీ వీక్షణ తట్టు, నీ జయంతట్టు త్రిప్పుము. శ్రమలు కలిగేటప్పుడు విసుగుకొను చున్నాము, గాని ఇపుడు యిది మా విశ్రాంతియని చెప్పియానందించెదము. అట్టి యానందము మాకు దయచేయుము. శ్రమల పాఠములను మాకు నేర్పించుమని యేసునామమున వేడుకొనుచున్నాము. ఆమేన్.
సిలువధ్యాన కూటస్తులారా! ప్రభువు మీకు తోడైయుండునుగాక! ఈ వాక్యములో పౌలుగారు ఏమనారంటే నీ సిలువయందే నాకానందమన్నారు. అయితే కష్టములు వచ్చినపుడు విచారించుదమా! లేక సంతోషించుదరా? వివారించెదరు. కాని మన పాపములు, లోక పాపములు పోగొట్టుటకును, మనలను పవిత్రులను చేయుటకును, ప్రభువు ఏ నేరము చేయక సిలువ మరణము పొందియున్నారు. ఆ సిలువ వలన ఏడువిధములుగా విచారమున్నది, సంతోషమున్నది. ఏమనగా ప్రభువు సిలువపై నుండుట అను విషయము విచారమే గాని ఆ సిలువద్వారా మనకు ఆదరణ, శాంతి కలుగుచున్నది. కాబట్టి మనకు సంతోషము. సంతోషమెందుకంటే మన పాపములు ఆ సిలువ ద్వారా పోయినవి కాబట్టి సంతోషింపవలయును. క్రైస్తవ విశ్వాసులకు అనేకములైన సిలువలున్నవి. ఆ సిలువలు ఏమనగా శ్రమలు, కష్టములు, శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు, పీడకలలు, దుష్టశకునములు, దురాలోచనలు, చెడ్డపనులు, దురాశ, దుష్టత్వము, అనుమానము ఈ మొదలగునవన్నియు మానవులకు సిలువలే. ఒక సిలువ కాదు, అనేక సిలువలున్నవి. అయితే ఈ మొదటిగా ఉన్న సిలువలన్నియు, మనము చేసిన పాపములద్వారా స్వయముగా మనంతట మనము తెచ్చుకొన్న సిలువలు. అయితే ఆ సిలువ ఎక్కడికి తీసికొని వెళ్తాయంటే నిత్యము శ్రమలనుభవించే నరకమునకు తీసికొని వెళ్ళును. అయితే ప్రభువు పొందిన సిలువ ఆయన చేసిన పాపములను బట్టికాదు, మనలను బట్టి ఆయనకు సిలువ ప్రాప్తమైనది. ఆ సిలువ ద్వారా పాపములను జయించినారు. తుదకు మరణమును జయించినారు. కాబట్టి ఆ సిలువ మనలను మోక్షమునకు తీసికొనివెళ్తుంది. అందుచేతనే ఆ సిలువ ద్వారా ఆనందించవలయును. ఆ సిలువ ఎట్టి కష్టమునైనా తొలగించి మోక్షము ఇయ్యగలదు.
- 1. ఉదా: ఒక స్త్రీ ఉన్నది. ఆమెకు శరీరమందు రెండురకములైన జబ్బులున్నవి. అంటే ఆ రెండు జబ్బులు కూడ ఆమెకు రెండు సిలువలు. అప్పుడు ఆ స్త్రీ జబ్బులనే రెండు సిలువలమీద ప్రభువు సిలువ వేసింది. కాదు, ప్రభువు సిలువను తన కట్టువస్త్రము మీద వేసికొంది. వెంటనే తనలోనున్న ఆ బబ్బులనే రెండు సిలువలు ఎగిరి పోయినవి.
- 2. ఉదా:- గూడెం వాస్తవ్యుడు ఒకాయన పుస్తకము వ్రాసి అయ్యగారిని దిద్దమన్నారు. అయితే అయ్యగారు ఈ మాట అన్నారు: "ఇప్పుడు దిద్దిన పుస్తకము పై సిలువగుర్తువేసి ఉంచండి. లేకపోతే దయ్యము ఎత్తుకొని పోతుంది". ఆయన నిజముగా దయ్యమెత్తుకొని పోతుందేమోనని తలంచి, ఆ పుస్తకము పై సిలువ గుర్తు ఉంచినారు. మరునాడు ఉదయము లేచి చూస్తే ఉంది. అప్పుడు అచ్చు ఆఫీసుకు వెళ్లి అచ్చు వేయించినారు. దయ్యమెత్తుకొనిపోలేదు కాబట్టి అయ్యగారు మాట అబద్దమైనదా? కాదు. సిలువగుర్తు వేసినారు గనుక దయ్యమెత్తుకొని వెళ్లిపోలేదు.
- 3. ఉదా:- రాజమండ్రిలో ఒకాయన పుస్తకము వ్రాసినారు. అయ్యగారిని దిద్దమన్నారు, అయ్యగారు దిద్దినారు. అయ్యగారు పై వ్యక్తికి చెప్పినమాటలే ఈయనకు కూడ చెప్పినారు. అయితే ఆయన ఈలాగన్నారు. దయ్యమునకు కాళ్ళున్నవా? చేతులున్నవా? పెట్టెలో పెడతాను. పెట్టెకు తాళము వేస్తాను. ఇంటిలో ఆ పెట్టె పెట్టి, ఇంటికి కూడ తాళము వేస్తాను. అప్పుడు ఏలాగు ఎత్తుకెళ్లగలదో చూస్తానన్నారు. సిలువ గుర్తు వేయలేదు. అయితే ఇప్పటికి 30 సం||లు అయినది గాని ఇంతవరకు ఆ పుస్తకము అచ్చుపడలేదు. మొదటి వ్యక్తి నమ్మినారు. విశ్వసించినారు. సిలువ గుర్తు వేసినారు గనుక అచ్చువేయబడి వెల్లడులోనికి వచ్చినది. అయితే, ఈ రెండవ వ్యక్తి నమ్మలేదు. కాబట్టి సిలువ గుర్తు వేయలేదు. అందుచేత ఈ 30 సం||లు కూడ పని జరగలేదు. ఆలాగే మీరు కూడ మీకు ఎట్టి కష్టము వచ్చినా మీ సిలువకాదు గాని ప్రభువు సిలువ వెయ్యండి. అప్పుడు కష్టములు తొలగిపోవును. అలాగే ఎటువంటివి వచ్చినప్పటికిని ప్రభువు సిలువవేసి చేయండి. అప్పుడు అవన్నియు పోయి నెమ్మది, శాంతి, ఆనందము, సుఖము, లభిస్తుంది. అందుచేతనే అపోస్తలుడైన పౌలు ఈ వాక్యములో " నాకు సిలువలో ఆనందము' అని వ్రాసినారు. కాబట్టి మనము కూడ కష్టములు వచ్చినప్పుడు విచారపడక సంతోషపడవలయును. విచారించినట్లైన కష్టములు మరింత ఎక్కువగును. కాబట్టి ఈ కొన్ని వాక్యములు మీ అనుభవములో వాడుకొనుటకు దేవుడు సహాయము చేయును గాక! ఆమేన్.
సిలువ చరిత్ర
ప్రియులారా! యేమి చెప్పవలెను! యేమి విప్పవలెను! యేమి చెప్పకుండా కప్పవలెను! ఆయన శ్రమలయెదుట యేమి చెప్పాలి? ఆయన తనపై నున్న శ్రమలు సిలువపై వేసి మహోన్నత సింహాసనముపై కూర్చున్నట్లు ఉండెనని మనకు తెలియును. మనకును ఆవిధముగానే కలుగును. నల్ల సిలువ గాదు, చెక్క సిలువ గాదు, మహిమ సిలువ, తెల్లని సిలువ, మీ మనస్సనే తాళపు చెవి విప్పి చూడండి, ఆనందించండి. (దా||కీ|| 22 అధ్యా ||)
- 1. విశ్వాసులైనవారలారా! యేసుప్రభువు యొక్క శ్రమ చరిత్ర చూచినయెడల, గెత్సేమనే తోటలో ఆయన ప్రార్ధించుచుండగా గేటువద్ద ఆయనను పట్టుకొనిన కధ.
- 2. యూదుల పంచాయితీ సభలో చేతులు కట్టిన కధ.
- 3. కయిపయను న్యాధిపతి శాలలో తీర్పు తీర్చిన కధ.
- 4. గవర్నమెంటువారితో తీర్పు (గవర్నరు పిలాతు)
- 5. హేరోదు తీర్పు తీర్చిన కధ.
- 6. గవర్నమెంటు కోర్టులో ఆఖరు తీర్పు కధ
- 7. సిలువ మోసిన కధ.
- 8. సిలువ మోసిన, సిలువ వేసిన కధ, సమాధిలోనికి వెళ్ళిన కధ. ఈ కధలకు ముందు జరిగిన కధలు: కయిప, మల్కు, అన్న, పిలాతు, హేరోదు, సిలువచేత, సిలువవేత, సమాధి చరిత్ర.
కయిప: పెద్దపూజారి, కొత్త పూజారి. యూదులు, ప్రధాన యాజలులును కలిసి ప్రభువుపై కుట్రలు చేయుచున్నారు. ఏమని?
- 1. జబ్బులు అద్భుతముగా బాగుచేయుచున్నందున ప్రజలంత వెళ్ళుచున్నారు. 2. ఆయన బోధించుచుండగా వినుటకు అందరు వెళ్ళుచున్నారు.
అట్టి ఆదరణ ఈ మండల కాలములో పెండ్లి కుమారుడైన క్రీస్తు ప్రభువు మీకు దయచేయును గాక. ఆమేన్.
కీర్తన: " నా హృదయంబులోనికి - నా ప్రభువ రమ్మయా! = నీ మ్రాను మోసెదన్ ప్రభూ! - రక్తంబు తుడిచెదన్ - నీ రక్తమే నా యాత్మకెంతో హాయిని జీవము నిచ్చును - నా యాత్మన్ నీ కర్పింతును - నా ప్రభువా! రమ్మయా" ||వనము||