లెంటులోని ఆరవ ఆదివారము
జెకర్యా 9:9; మత్తయి 21:1-10; ప్రవచనము - నేరవేర్పు
అయ్యగారి ఇతర మట్టలాదివార ప్రసంగములకు ఇక్కడ క్లిక్ చెయ్యండి
ప్రార్ధన:- శ్రమల లోయలో ఈ దినము వరకు మమ్ములను నీతో నడిపించుకొని వచ్చిన తండ్రీ! నీకు నమస్కారము. నేడు నీ కన్నుల యెదుట ఇంకను 7 దినములకు పొందనైయున్న జయము కనబడుచున్నది. అట్టి జయమును మేమునూ చూచుటకు నీ ప్రవచన చరిత్రను మాకు కనపర్చుము. నెరవేర్పులోనికి నడిపించుమని యేసు నామమున వందించుచున్నాము. ఆమేన్.
నేటి కధ తెలిసిన విశ్వాసులారా! ఈ కధలో రెండు ప్రవచనములు గలవు.
- 1. పల్లెటూరి దగ్గర యేసు ప్రభువు నిలువబడి చెప్పిన ప్రవచనము.
- 2. తరువాత ఆయన గార్థభాసీనుడై చేసిన ప్రయాణము. ఇది మరియొక ప్రవచనము.
- 3. ఆయనను గౌవర పరచిన విశ్వాసులను గూర్చిన ప్రవచనము.
|
ఈ మూడు స్ధలములలో మూడు ప్రవచనములు నెరవేరినవి. |
అయితే ప్రవచనము నెరవేరితే వెంటనే నెరవేరవచ్చు లేక కొన్ని ప్రవచనములు మనలో ఉన్న విశ్వాసమును, నిరీక్షణను వృద్ధి చేయును. ప్రవచనము ఎప్పుడు ఎంత కాలమునకని విస్వాసులు అడుగుచుందురు. అప్పుడు వారి నిరీక్షణ, ప్రవచనము మీదనున్నది. పల్లెటూరు యొద్ద యేసుప్రభువు చెప్పినది ప్రవచనము: అనగా 'ఫలాన గ్రామానికి వెళ్లండి'. అది ప్రవచనము. అది ఇంకా నెరవేరలేదు. అక్కడ కట్టబడియున్న గాడిద కనబడును, దానియుద్ద గాడిదపిల్లకూడా యుండును. అదికూడ ప్రవచనమే. ఎందుకు విప్పుతున్నారని అంటారు. అది కూడ ప్రవచనమే గాని జకర్యా ప్రవచనము దగ్గర ఇవి అన్నియు నెరవేర్పు అయినవి. ఈ ప్రవచనము అనగా ప్రభువు చెప్పిన ప్రవచనము తాత్కాలిక ప్రవచనము అనగా అప్పుడే నెరవేరుట. అటువంటి ప్రవచనాలంటే మనకి పరమానందము. జెకర్యా ప్రవచనము అయితే కొన్ని యేండ్లకు నెరవేరెను. మనకైతే తాత్కాలిక ప్రవచనములు ఇష్టము. వాక్యములో రాబోయే కాలములో నెరెవేరే ప్రవచనాలు కూడ ఉన్నవి. మనము వాటిని వాక్యములో చూస్తున్నాము. గనుక వాటిని ఎత్తి ప్రార్ధించవలెను. అప్పుడు వాటి నెరవేర్పు మన అనుభవములో ఉంటుంది. మనలో అనేకులు ప్రార్ధించగానే నెరవేర్పు చేస్తున్నారు. అది అనుభవము. మన కష్టాలు తీసివేయమనగానే ప్రభువు వెంటనే తీసివేస్తున్నాడు. అది తాత్కలికము. ఇది మనకు మిక్కిలి అవసరము. మనలో ఉన్న
|
సంపూర్ణము కావలెను. ఎప్పుడో నెరవేరవలసిన ప్రవచనము, నెరవేరుట అవసరమేగాని, అది మనలను విశ్వాసములోను, నిరీక్షణ లోను అభిమానములోను ప్రవేశ పెట్టుటకే కదా! |
యేసుప్రభువు ఏమి చెప్పారు? మీరు ఆ గ్రామములో ప్రవేశింపగానే గార్ధభము కనబడును అది వెంటనే జరిగినది. అలాగే కొందరికి ప్రార్ధనయొక్క నెరవేర్పులు వెంటనే కలుగుచున్నవి. అది తాత్కలిక ప్రవచనము, తాత్కలిక నెరవేర్పు; అవి మన కొరకు వ్రాయబడినవి. ఆ మొదటి ప్రవచనము ఎప్పుడు నెరవేరినది? సువార్తలలో ఉన్నట్టు అప్పుడే నెరవేరినది. అయినను, నేను ఒక ప్రశ్నవేస్తున్నాను. ఎప్పుడు నెరవేరినది? ప్రభువు చెప్పినట్టు శిష్యులు చేసినప్పుడే నెరవేరినది. గాని వారు చేయకపోతే, ఆ ప్రయత్నమే లేకపోతే ఏలాగు నెరవేరుతుంది. అలాగే మన ప్రార్ధనలు, ఆయన తప్పక నెరవేర్చగలడు గాని అవి నెరవేరుటకు, మన ప్రయత్నములుకూడా ఉండవలెను. పేతురు, యోహాను అలాగు వెళ్ళలేకపోతే, గార్ధభములు కనబడవు. విప్పడమనేది ఉండదు, వాటిని తోలిపెట్టడము కూడా ఉండదు. కాబట్టి ప్రవచనము నెరవేరవలెనంటే మన ప్రయత్నములుకూడా ఉండవలెను. తాత్కలిక ప్రవచనముగూర్చి నేను చెప్పుచున్నాను. అయినప్పటికిని చాలాకాలమునకు నెరవేరవలసిన 1000 ఏండ్ల పరిపాలన ప్రవచన నెరవేర్పుకు; రాకడ ప్రవచనమునకు అనగా అది జరిగేటందుకు, మనమేమి చేయుచువున్నాము? ఏమియు చేయుట లేదు గాని మనము వాటి గురించి తెలిసికోగలము, నమ్మగలము, ఎదురుచూడగలము. ఈ ప్రకారము అవి చాలాకాలమునకు నెరవేరవలసినవి. అనగా అవి దీర్ఘకాల ప్రవచనములు.
ఈ ఆదివారమున నెరవేరవలసిన రెండవ ప్రవచనము ఏదంటే! గార్ధభాసీనుడై ప్రభువుండుట; పల్లెటూరి బయటనుండి యోరూషలేము పట్టణము వెళ్లుట అనేది ప్రవచనము. అది ఏలాగు నెరవేరుట? అందుకే జకర్యా యేసుప్రభువు సాత్వికుడుగా వస్తాడు, రాజుగా వస్తాడు, నీతి పరుడుగా వస్తాడు, ధీరుడుగా వస్తాడు ఇన్ని లక్షణములు గలవాడై, నీ యొద్దకు వస్తాడని అన్నాడు. ఇప్పుడు ప్రభువు గాడిదమీద వస్తున్నప్పుడు సాత్వికుడై వస్తున్నాడు. ఆజ్ఞ ఇచ్చుటకు కాదుగాని, శాంతి రాజుగా ఆయన వస్తున్నాడు. ఆ పల్లెటూరి బయటనుండి యోరూషలేము ప్రవేశించే రోడ్డుమీద అది జరిగింది.
2వ కధ:- రెండవ రాకడ, రేపో, మాపో వచ్చును. దాని తర్వాత ఏడేండ్ల శ్రమ, అంతెక్రీస్తు పరిపాలన; ఆ తర్వాత హర్మెగిద్దోను యుద్ధము, ఆ తర్వాత శాంతి రాజుగా యేసుప్రభువు వెయ్యేండ్లు ఏలును. యువరాజుగా ఆయన వచ్చును. ఆయన అప్పుడు సమస్త జనులకు దీనుడై కనబడును. జకర్యా ప్రవచనము ఇక్కడ నెరవేరినట్లు, వెయ్యేండ్ల పరిపాలనలో చక్కగా నెరవేరును. ఇక్కడ గార్ధభాసీనుడై యున్న రాజు, వెయ్యేండ్ల పరిపాలనలో మహిమ సింహాసనాసీనుడై యుండును. కాబట్టి మొదటిది, రెండవ దానికి ముంగుర్తు. ఇది చివరకు వెయ్యేండ్ల పరిపాలన యొక్క ప్రవచనమై పోయినది. ప్రభువు ఎక్కడికి వెళ్ళినాడు? ఆయన వెయ్యేండ్ల పరిపాలనలో, పరిశుద్ధ పరచబడిన యెరూషలేములోనికి ప్రవేశించుటకు ఈ ప్రవచనము సూచనగా ఉన్నది. ఇది వరకు నేను చెప్పినట్లు పరలోకములో నున్న నూతన యెరూషలేము కాదు గాని, భూమిమీద నున్న నూతనపరచబడిన యెరూషలేమునకు ఆయన వెళ్ళినాడు. ఇది ప్రయాణము కావలసిన చోటు. ఆ వెయ్యేండ్ల పరిపాలనలో యేసుప్రభువును, ఆయన శిష్యులు ఈ యెరూషలేముకు వచ్చి, సింహాసనము వేసికొందురు. అప్పుడు ధర్మపాలన జరుగును. జకర్యా సాత్వికుడన్నట్లు, ఆ వెయ్యేండ్ల పరిపాలనలో ఆ మాటయొక్క అర్ధము తెలుస్తుంది. సిలువ మీద కూడా తెలుస్తుంది. కాబట్టి ఇక్కడ నెరవేరినవి, రాబోయే వాటికి ముంగుర్తులై ఉన్నవి. యేసు ప్రభువుతో అక్కడ శిష్యులున్నట్లు, వెయ్యేండ్ల పరిపాలనలోకూడా వారు ఉందురు. ఇక్కడ శిష్యులు నడిచి వెళ్లారు గాని, వెయ్యేండ్ల పరిపాలనలో ఆయనతోపాటు సింహాసనములమీద ప్రభువుతోకూడ కూర్చుంటారు. ఆ ప్రవచనమునకు ఇది తాత్కాలిక నెరవేర్పు గనుక ఈ ప్రవచనము సూచక క్రియా ప్రవచనము. ఇది రాబోయే దానికి సూచనగా ఉన్న క్రియ గనుక ఈ కధ సూచక క్రియా ప్రవచనము. కాబట్టి రాబోయే కాలమందు మన అందరికి కలుగవలసిన మహిమ సింహాసనము యెరూషలేములో ఉండునని ఈ ప్రవచనముబట్టి తెలుస్తుంది. కాబట్టి దాని నిమిత్తమై మనము నిరీక్షించవలెను.
ఇక్కడ కూర్చున్న వారిలో ఎవరు అట్టి నిరీక్షణ గలవారు? ఇప్పుడు ధ్యానించుచున్న మనము, పాత నిబంధనలో జెకర్యా ప్రవచనము విని, పాత నిబంధనలోని భక్తులు ఎదురు చూచునట్లు, మనముకూడా దాని నెరవేర్పు(వెయ్యేండ్ల పాలన)కై ఎదురు చూడవలెను. అందుకొరకే ఈ ప్రవచనము వ్రాయబడినది.
- 1) ప్రవచనము
- 2) నెరవేర్పు.
ఒక చిన్న పొరపాటుంది. ఈవేళ గందరగోళం గాని రేపు, ఎల్లుండి సంతోషము. మన బ్రతుకు కాలమంత విచారము, సంతోషమేగాని, చివరకు సంతోషమే వస్తుంది. ఆదరణ, సంతోషము, మహిమ, జయము, చివరివరకు మనకు కూడ ఉండును. కష్టాలిక్కడ ఉండాలి. కాబట్టి ప్రభువు నేర్పిన ఈ పాఠములు పరలోకములో రాబోయే పాఠము, వెయ్యేండ్ల పాఠము గనుక ఇవి అన్ని కలుపుకొని స్తుతి చేయవలెను.
- 1) వచ్చిన దావీదు కుమారునికి జయము;
- 2) వచ్చిన దావీదు కుమారునికి స్తుతులు;
- 3) వచ్చిన దావీదు కుమారునికి సమాధానము;
అట్టి అంతరంగ ఆనందము ప్రాణ ప్రియుడు మీకు దయచేయును గాక. ఆమేన్.
కీర్తన: "వాసిగా హెబ్రీ - హెల్లేనీలో - రోమాయిలోను = హోసన్నా హొసన్నా - ప్రభువుని పేరట వచ్చు - మెస్సీయా దావీదు - కొడుకా శ్రీ శుభములు ||సీయోను కన్యా - సంభ్రమ పడుచు వేయుము కేకలు||