లెంటులోని ఇరువదియవ దినము - గురువారము
లూకా 22:39-46
ప్రార్ధన:- దయగల యేసుప్రభువా! (మా నిమిత్తమై నీవు) శ్రమలు పడుచున్నావు. ఎంత కష్టమొ, భయంకరమొ తెలిసే వచ్చినావు. మాకు భయమున్నదన్న చోటికి మేము వెళ్లము. నీవు తెలిసే వచ్చి సిలువకేగినావు గనుక వందనములు. నా నిమిత్తమైన శ్రమలుకాదు మా నిమిత్తమైన శ్రమలు అనుభవించినావు. నీ శ్రమల గొప్పతనము, మహిమ, ఉపకారము; ఈ మూడును గ్రహించే మనోనిదాన ధ్యానము దయచేయుము. ఒక బోధకుడు అంతా బోధించి సిలువ బోధించక పోయినటైనా అంతా సున్నే. అలాగే మా జీవితములో ఏన్నో దర్శనములు, ఎన్నో ఉపకారములు ఉన్నా, మా శ్రమలు ఎన్ని తీసివేసినా, అనగా సిలువ తెలియక పోతే ఏమిలాభము. మేము కొద్దిమందిమి అయినా, కొంతసేపైనా ధ్యానము యొక్క ఊట కలిగించమని వేడుకొనున్నాము. తలంపులకు కావలసిన ధైర్యము, ఆదరణ కలిగించుము. లోకమంతట సిలువ ధ్యానము చేయుచుండగా, వారందరి మధ్య నీవుండుము. ఆమేన్.
ప్రభువు యొక్క శ్రమలు అనేకులు విచారముతో చేయుదురు గాని మన శ్రమలు, శిక్షలు భరించుటకు ఆయన చేసెను గనుక మనకు సంతోషము, ఆయనకు విచారము. ఒకరు ఒక బోధకుని చూచి ఏమి బోధించ వెళ్ళుచున్నావు అని అడిగెను. అందుకాబోధకుడు ఫలాని వాక్యము బోధించుచున్నాను అన్నప్పుడు, ఆ ప్రశ్నకుడు నీవు వాక్యము అంతా బోధించి సిలువ చెప్పకపోతే అంతా వృధా అని చెప్పెను. మన శిక్షలు, పాపములు, భారము ఆయన తన మీద వేసికొన్నాడు. పునరుత్ధానము ఉపయోగమే గాని సిలువ ఎక్కువ ఉపయోగము. ధ్యానము: 'ప్రభువు మనకొరకు పడిన శ్రమ'.
ఒక బల్లమీద "అరటిపండ్లు, సపోటాలు, రొట్టెలు, ఆహారము, బట్టలు" అచ్చుపడిన పుస్తకాలు ఒక బీదవానిని కూర్చుండబెట్టి తినమంటే తినునా? వద్దని అంటాడా? అతని కాళ్ళు బురద, శరీరము చమట బట్టలు మాసిపొయేను, తలమాసెను, చేతులు అశుభ్రముగా నుండెను, అలసిపోయి చేతులమీద ఆనుకొనెను, దహముగా నుండెను. తింటాడా? బట్టలు కట్టుకొంటాడా? బాటసారి పైవన్నీ శుభ్రము చేసుకొని అప్పుడు భోజనమునకు కూర్చుండవలెను. ముందు స్నానము చేసి, అన్నీ పనులు చేసి, తిండి తినిన తిన్నట్టు ఉండును. అలాగే సిలువమీద ప్రభువుండి కష్టములు తీసివేకుండా బైబులు చదువు, విశ్వాసముగా నుండుము అని చెప్పి, పరలోకములో ఇన్ని భాగ్యాలు, ఇహలోకములో ఇన్ని భాగ్యాలున్నవని చూపించిన అతనికి శాంతి ఉండునా? పాపము, శిక్ష, భారము తీసివేసిన యెడల పై వాటికొరకు ప్రయత్నము చేయును. ఉదా: పిల్లవానిని కోతి కరవగా బాధ కలిగి ఏడ్చెను. ఊరకొనమన్నా, బిస్కెట్టు ఇచ్చినా ఏమిలాభము? బాధ పోవలెను. అలాగే సిలువ వలన కూడ. ఒకరు మోక్ష లోకము గురించి అంతావిని, "అవన్ని కూడా బాధలు కష్టాలు ఉంటే చచ్చిన తరవాత ఏమగుదుమో!" అనెను. ఆయన సిలువమీద అన్నీ తీసివేసిన, పరలోకములోని మహిమ, భూలోకములోని మహిమ వినగలరు, దాని కొరకు ప్రయత్నించగలరు.
- 1) పాపములు,
- 2) వ్యాధులు,
- 3) మిగిలినవన్నీ – నరకము, మరణముకూడా గలదు.
సిలువ ధ్యానకూటము:- ధ్యానకూట ఉద్దేశము ఏమనగా, ప్రభువు మనకు ఏమి తలంపు కలిగించునో, అనేది. ప్రార్ధన కాదు, మనము మాట్లాడుట కాదు గాని ఒక ధ్యానంశము కలిగియుండుట మంచిది. మండల కాలములో ప్రభుని సిలువ ధ్యానములో నుండుట మంచిది. సిలువ ధ్యానములో అనేక అంశములు గలవు. ఈ చివరి శ్రమ మట్లాదివారముతో ప్రారంభము. ముఖ్యముగా మరల ఆదివారమునకు పునరుత్ధానము. ఆయన మనస్సులో రాబోయే శ్రమల తలంపులు ఉన్నవి. అవి బహిరంగ శ్రమలు కాదు. సిలువ మీద కొట్టబడుదునను తలంపు కాదు. చనిపోవుదుననే తలంపు కాదు గాని ఎప్పుడైతేనేమి? సర్కీటులోనైతేనేమి? గెత్సేమనేలోనైతేనేమి? సిలువముందు అయితేనేమి? ఆయన శ్రమలో ఎవరిని ధ్యానించెను? ఆ శ్రమలో యేసు ప్రభువు నన్నే ధ్యానించెను? నన్నే తలంచెను. తన శ్రమలో యేసు ప్రభువు నన్నే తలంచెను. నన్ను గురించి ఆయన ధ్యానిస్తు శ్రమపడుతూ చనిపోయెను. నన్ను గురించి ఆయన ఏమని తలంచెనో! ఇప్పుడు పుట్టిన నన్ను గురుంచి ప్రభువు అప్పుడు తలంచినాడా! నన్ను గురించి ఆయనకు అప్పుడే, జ్ఞపకము వచ్చెనా? నా శ్రమలో నేనున్నానా? నిజమైతే నీవు, నేను కృతజ్ఞులమై యుండవలెను. ఇప్పుడున్న నన్ను ఆయన తలంచుకొనెనా? ఓ ప్రభువా! నీవు మమ్మును తలంచుకొన్నావు గనుక వందనములు. మరియు నీవు దేవుడవు గనుక అందరినీ తలంచుకొనగలిగినావు. సాధారణముగా ఏపని మొదలు పెట్టిన, మొట్టమొదట చాలా ఉద్రేకముగా నుండి తరువాత తరువాత ఉద్రేకము తగ్గును. విజ్ఞాపన ప్రార్ధన విషయములో కూడా నుండి తరువాత సాధారణమై పోవును. బైబులులో మొదటి నుండి చివరి వరకు అనేక విజ్ఞపన ప్రార్ధనలున్నవి. ఇది శ్రమ కాలము గనుక ప్రభువు సిలువ మీద చేసిన విజ్ఞాపన ప్రార్ధన జ్ఞాపకము చేసికొందుము. అయితే ప్రభువు మిక్కిలి కఠినమైన విజ్ఞాపన చేసెను. ముఖ్యముగా హింసించే వారికొరకు చేసెను. రెండు రకములైన శత్రువులు ఈ లోకములో గలరు.
- 1) నిజముగా కీడు చేయవలెనని ఆలోచించేవారు పూర్తిగా శత్రువులు
- 2) మన పక్షముగా లేనివారు, వ్యతిరేక పక్షముగా నున్నవారు;
- 1)న్యాయముగా మనతో విరోధపడేవారు వాధించేవారు మీరు అగుదురు.
- 2) సిద్ధాంతములను బట్టి విరోధులగుదురు.
- 3)నచ్చలేదు గనుక విరోధముగా నుందురు. కీడుచేయనుద్దేశము కలిగియుందురు.
- 4)మనతో ఏకీభవించరు.
- 5)భిన్నాభిప్రాయము కలిగియుందురు.
ప్రార్ధన:- యేసుప్రభువా! నీవు శత్రువుల కొరుకు చేసినావు. అంత గొప్ప పని ఎవ్వరు చేయలేదు. అనేక భక్తులు చేసినారు గానీ వారు మనుష్యత్వముతో చేసిరి గానీ నీవు దైవత్వముతో చేసినావు. గనుక నీ పని ఎవ్వరు చేయలేదు.
- 1) శ్రద్ద, జాలితో చేసే మనసు.
- 2)చేసే వారిని తలంచుకొనుట.
కీర్తన:-"తన్ను జంపు శత్రువులకు - దయను జూపెనా తన - నెనరు జూపెనా - ప్రభు కనికరించెనా = ఓ - జనక ఈ జనుల క్షమించు - మనుచు వేడెనా" ||మనస యేసు||