లెంటులోని ముప్పది మూడవ దినము - శుక్రవారము

లూకా 23:34;

ప్రార్ధన:- యేసుప్రభువా! నీవు సిలువమీద పలికిన మాటలు సిలువ మీదనే ఉండిపోలేదు. అవి సంఘములోనికి వచ్చినవి. సంఘములో మేము ఉన్నాము. దూరము నుండి వచ్చిన పార్శిల్ విప్పి దానిలో ఏయే సామానులు ఉన్నవో మేము చూస్తాము. అట్లే నీ సిలువ మీదనుండి మాయొద్దకు వచ్చిన పలుకులు విడదీసి చూడగోరుచున్నాము. ఆ పలుకులు అంతర్భాగమందున్న మాటలు మా సంతోషము నిమిత్తమై వినిపించుము. అక్కడ ఉన్న అందరికి నీ మాటలు వినబడినట్లుగా, ఇక్కడున్న అందరికి ఆ నీ మాటలు వినబడేటట్లు చేయుమని నీ ఘన నామమునుబట్టి వేడుకొనుచున్నాము. ఓ యేసుప్రభువా! నీ శ్రమలవల్ల మా శ్రమలకు ఎన్ని గొప్ప ఆశీర్వాదములు కలిగినవో, అవి మాకు చూపించేవరకు ఈ శ్రమకాలములో నీ శ్రమ చరిత్ర బోధిస్తు ఉండుమని నీ ఘననామమును బట్టి వేడుకొనుచున్నాము. సిలువమీద నుండి సంఘము మీదికి వచ్చే మరణ శ్రమ మహిమ కిరణములు ఈ ఆరాధనలోకూడ అందరిలో ప్రవేశపెట్టుమని నీ మహిమ నామమును బట్టి వేడుకొను చున్నాము. ఆమేన్.


యేసుప్రభువు తండ్రిని అడుగకముందు, తానే వారిని క్షమించివేసినాడు. ఆలాగు క్షమించని యెడల 'తండ్రీ! క్షమించుమని' అడుగడు. తనను హింసించుచున్న వారియెడల పగ, కోపమున్న యెడల; వారికి శిక్ష కోరుకున్న యెడల ఆ ప్రార్ధన చేయడు.


1. తండ్రి:- ఇక ముందుకు తండ్రి కుడిపార్శ్వమున కూర్చుని విజ్ఞాపన చేయువలెను గనుక దానికి ముందుగానే ఇప్పుడు ప్రభువు విజ్ఞాపన చేయుచున్నారు. ఇకముందుకు సింహాసనము (దగ్గర) ఉండి విజ్ఞాపన చేస్తారు. ఇప్పుడైతే సిలువ సింహాసనము మీదనుండి విజ్ఞాపన చేయుచున్నారు. విజ్ఞాపన ప్రార్ధన అనగా మనము ఇతరుల కొరకు చేయు ప్రార్ధన. మన కొరకు చేయునది విజ్ఞాపన ప్రార్ధన కాదు. ఇతరులను గూర్చి విజ్ఞాపన చేయునప్పుదు మనసులో పగ, ఆయాసము ఉంచుకొనరాదు. ప్రతి రోజు మనలను గూర్చిన ప్రార్ధన చేసినా, అది అర్ధ ప్రార్ధనే గాని, ఇతరులను గూర్చి మనము చేసినది సంపూర్ణ ప్రార్ధన. వీరేమి చేయుచున్నారో వీరెరుగరు. ఇందులో 3 పాటములున్నవి. మీరు శ్రమ రాగానే మూలుగుచుందురు. అప్పుడు పొరుగు ఊరునుండి ఎవరైనా వచ్చి, 'ప్రార్ధించండి' అంటే విసుగుదల ఉండును గనుక తరువాత చేస్తాము అంటారు గాని అప్పుడే చేయరు. అయితే, ప్రభువు సిలువపై గొప్ప బాధలో రక్తము కారుచు, 'తండ్రీ! క్షమించుమని ప్రార్ధించెను'. అది మన వల్ల కాదు. అది మన నోటికి రాదు. మన బాధను గూర్చి మనము ప్రార్ధన చేసికొనునప్పుడు, మన ప్రార్ధన చెడగొట్టుటకు ఆ బాధ వచ్చెనని అందుము. అది మనిషి నైజము. సిలువపైనున్న మనిషికి మనుష్యుల నైజము లేదు. అదే తేడా! విసుగుకుంటే ఏమి జరుగుననగా; గెత్సేమనే తోటలో ప్రభువును నిన్నటి రాత్రి పట్టుకొనుటకు వచ్చిన రౌడీలను చూచి, మీరెవరని వెదుకుచున్నారని ఆయన అడుగుటతోనే రౌడీలంతా నేలబడిరి. ఇప్పుడు ప్రభువు విసుగుకుంటే ఆలాగే జరుగును. అనగా ఆలాగు ప్రభువు విసుగుకొనగా వారంతా బోర్లపడితే, తక్కిన ఆరు మాటలు పలుకుటకు వీలులేకపోవును. ఈ తక్కిన ఆరు మాటలుకూడ నరజన్మము యొక్క రక్షణ మాటలే, ఏ మాటలు తీసివేయుటకు వీలులేదు. ఏడు రోజులలో ఏ రోజైనా తీసివేస్తారా? ఆదివారము మొదలు శనివారము వరకు, ఏ రోజు తీసివేయుటకు వీలులేదు. ఏ రోజైనా ప్రాముఖ్యమే, ఉపయోగమే. వారములో ఏ రోజు లేకపోయినా, అది వారము కాదు. పరిశుద్దవారములోని ఏడు రోజులలో ఏ రోజు తీసివేసినా, అది సంపూర్ణము కాదు. ఆలాగే ప్రభువు ప్రార్ధనలో ఏడు మనవులున్నవి. అందులోని ఏ మనవి తీసివేసినా, అది ప్రభువు ప్రార్ధనకాదు. ప్రకటనలో 7 సంఘములున్నవి. ఒక్క సంఘము తీసివేస్తే తక్కిన 6 సంఘములును పోవును గనుక తీసివేయుటకు వీలులేదు. ఇప్పుదు ప్రభువు ఒక్క మాటలో 4 పాఠములు చెప్పెను. మరొక సంగతి: 'వారేమి చేయుచున్నారో అది వారికి బాగ తెలుసును గాని ప్రభువు వీరికేమి తెలియదన్నారు'. అదేమి భాష! ఏమి మాట! ఏమంత సబబుగా ఉన్నది. మన దృష్టిలో సబబుగా లేదు. ఉదా:- ఒక అబ్బాయి పరాయి కుర్రవానిని మెత్తగా కొట్టి పారిపోయి, తన తల్లి దగ్గరకు వచ్చెను. వాడు వీడిని కొట్టుటకు వచ్చుచుండగా, "బాబూ! నా కుర్రవానికేమీ తెలియదని తల్లి అడ్డు వెళ్లెను". కుర్రవానికి తెలియదా? తల్లి ఎందుకు అడ్డు వెళ్లెననగా తన పిల్లవానిని ఆ కుర్రవాడు కొడతాడని అడ్డువెళ్లెను.


మనిషిలో ఒకటున్నది. అది తనకు తెలియడము. దానికి మంచిమాట స్పర్శ జ్ఞానము. ఈ కుర్రవాడు అవతల వానిని కొట్టినప్పుడు వానికి బాధ కలిగినది వీనికి లేదు. విచారములేదు. ఇతని విచార లక్షణానికి అది తెలియలేదు. సృష్టిలోనే దేవుడు మనిషికి విచార లక్షణము పెట్టలేదా? పెట్టినాడు కదా! తల్లి చనిపోతే ఏడవడా? ఆ ఏడ్చిన పెద్దమనిషికి, అవతల వానికి బాధ అని తెలియదా? గనుక కొట్టినప్పుడు బాధ అని జ్ఞానలక్షణానికి తెలిసినుగాని విచార లక్షణానికి తెలియదు. అలాగైతే ప్రభువును హింసించేవారందరు - అయ్యో! మేము కొట్టినందువల్ల నీకు రక్తము కారుతుందని, వారి విచార లక్షణానికి తెలిసిన ఏడ్చేయుందురు. తెలియదు గనుక ఏద్వలేదు. వారికి తెలియలేదు అనగా- ఇంగ్లీషులో వారు ఫీలింగ్నకు (మనోభావమునకు) తెలియలేదు గాని తెలివికి తెలిసినది. గనుక ప్రభువు- తండ్రీ! వీరేమి చేయునది ఎరుగరనెను.


మన క్రైస్తవులను హేళనచేయు ఇతరులు అనగా అన్యులు చాలామంది ఉన్నారు. వారిని గురించి మనము ప్రార్ధించునప్పుడు, 'ప్రభువా! వారికేమి తెలియదు వారిని క్షమించుము' అని మనము కూడ చేయాలి. యేసుప్రభువే గనుక 'తండ్రి శిక్షించు' అని అంటే అందరు ఒక్కసారే భస్మమై పోవుదురు గాని ఆయన శిక్షించుటకు రాలేదు, రక్షించుటకే వచ్చెను. పూర్వకాలమున హేబెలు రక్తము దేవుని దగ్గరేమని మొర్రపెట్టినది? 'మా అన్న చంపివేసెను నీవు శిక్షించు' అని మొర్రపెపెట్టెను. ప్రభువు యొక్క రక్తమాలాగు కాదు. 'వారిని క్షమించుము వారికేమి తెలియదు' అని విజ్ఞాపన చేసెను. పౌలు - హేబెలు రక్త స్వరము మరియు ప్రభువు రక్త స్వరము అను రెండు రక్త స్వరముల గురించి వ్రాసెను.


1 కోరింధి 2:8 ప్రకారము మనము మంచి పనిచేస్తె, ఎవరికి మహిమ అనగా దేవునికి మహిమ గాని పౌలు ఏమి వ్రాసెననగా: మనము మంచి పని చేస్తే, దేవుడు మనకు ఉపకారము చేస్తే; ఆయన మహిమ నిమిత్తము, మన మహిమ నిమిత్తమును అని వ్రాసెను. ఇన్నాళ్లనుండి దేవునికి మహిమ అనుకొన్నాము. పౌలు క్రొత్త సంగతి చెప్పెను దేవుని ఉపకారము వల్ల మనకును మహిమ. దేవుని జ్ఞానము మర్మముగా యున్నది. మనిషికి తెలిసినా, తెలియదన్నారు. యేసుప్రభువు దేవుడే. దేవుడు కాకపోతే తండ్రీ! అనడు. వట్టి నరుడే అయితే ఓ దేవా! అంటాడే గాని తండ్రీ! అనడు. నా దేవా! నా దేవా! అని పలికినప్పుడు దైవత్వము వదలి మనుష్యత్వములోనికి వచ్చి పలికెను.


రెండు వరుసలు: యేసుప్రభువు మనుష్యుల లైనులోనికి వస్తే వారిని 'క్షమించుమని' అనడు. దైవత్వములోనికి వదిగెను గనుక 'తండ్రీ!' అన్నాడు, 'క్షమించుము' అన్నాడు. మనుష్యులతో తండ్రిని గూర్చి మాట్లడునప్పుడు, తండ్రీ! అని అనలేదు గాని 'మీ తండ్రి' అని అన్నాడు. 'పలోకమందున్న మీ తండ్రి సంపూర్ణుడై యున్నట్లు, మీరును సంపూర్ణులై యుండుడి' అని ప్రభువే చెప్పెను గనుక మనకు కావలసినవి తండ్రికి తెలుసును. మత్తయి 5:45. పరలోకమందున్న మీ తండ్రి సంపూర్ణుడు గనుక మీరును సంపూర్ణులై యుండుడి. మనిషికి కూడా కొన్ని వరుసలున్నవి. ఒక వ్యక్తి - ఒకరికి అన్న, ఒకరికి పినతండ్రి, ఒకరికి మేనమామ అగును. ఆలాగే ప్రభువు దైవ వరుసలోను, మనిషి వరుసలోను ఉన్నాడు. గనుక ఆయన అద్భుతములన్నీ అలాగే ఉన్నవి


ఆదికాల దినములు ఏడు, ఏడు గడువుదినములు, ఏడు నమస్కారములుగల సమయములు, ఏడు మాటలు, ఏడు సిలువలు అదే మన పాఠము. ఏడు సంఘములు, పరలోకములో ఏడు తరగతులు. ధ్యానపరులైన ఆనంద వ్యక్తులారా! మీకు శుభము. ప్రభువుయొక్క శ్రమలు ఆయనకు శ్రమలుగాని మనకైతే ఆదరణ కలిగించే అంశములు. కాబట్టి మనము దుఃఖించుటకన్నా, స్తుతించుటవలన ఆయనను సంతోషపరచ గలము.


ఏడు దినములు:


యేసుప్రభువు సిలువపై పలికిన 7 మాటలు ఆయనకు ఏడు సిలువలే. అవి ఏలాగు సిలువలో పరీక్షించుటకు ఈ సాయంకాలము మొదటి మాట పరీక్షించుదము. మొదటి మాట ఏదంటే 'తండ్రీ వీరు ఏమి చేయుచున్నారో వీరికి తెలియదు గనుక వీరిని క్షమించుము'. గెత్సేమనేతోట దగ్గరనుంది పాతిపెట్టిన సిలువమీద నుండి పైకెత్తబడేటంత వరకు; యూదులు ఆయనను పెట్టిన శ్రమలు, అవమానములు, నేరములు; ఇవన్నియు ఆయన శరీరమునకు కలిగిన గాయములు. ఆయనకు మేకుల పోట్లకంటే, బళ్లెపు పొటుకంటే, ముండ్ల కిరీటములోని ఇనుప మేకుల పోట్లకంటే, వారుచేసిన దౌర్జన్యమే ఎక్కువ బాధ. సిలువమీదనున్నా, అది బాధయేగాని ఇది మరి ఎక్కువైన బాధ. వారిని క్షమించుమని పలుకుట నరజన్మమునకు తగునా? అయినప్పటికిని క్షమించుమని క్రీస్తు ప్రభువు పలికెను. ఆయనకు కలిగిన శ్రమలు ఎన్ని అనగా; ఆయన జీవిత కాలమంతయు నిరాకరించబడుట, ద్వేషభావము అనుభవించారు. ఈ రెండును శ్రమలే కాని 'క్షమించు మనుట' అంతకంటే శ్రమ. మనిషి నోటిగుండా ఆ మాట రాదు, ఇష్టముండదు. 'కాని క్షమించుము' అని ప్రభువు అనెను. ఆయన ఎంత దేవుడైనను మనిషి అయినాడు గనుక క్షమించుమని అనకూడదు. శరీరము నొస్తుంది, మనస్సు అవమానమువల్ల నొస్తుంది. ఆయినను ఆ నొప్పి సహించుకొని క్షమించుమని అన్నాడు. ఉదా:- ఒకసారి అయ్యగారు బడిలో ఉండగా ఇద్దరు పిల్లలు పోట్లాడుకొని వచ్చారు. ఒకడు రెండవ వానిని మెత్తగా కొట్టాడు. ఇతడు అయ్యగారికి రిపోర్టు చేసాడు. ఆ రిపోర్టులో క్షమించుమనియా? లేక శిక్షించుమనియా? ఇద్దరు రాగానే రెండవవానిదే ఎక్కువ నేరమని తెలిసికొన్నారు. అప్పుడు అయ్యగారు మొదటి అబ్బాయితో - అతనిది నేరమే ఆయినను, ఆ అబ్బాయిని క్షమించగానే; అది అతనికి ఎంత కష్టమైనదో, అతని ముఖములోనే కనబడినది. దెబ్బలు తిన్నవానికి బెత్తమిచ్చి రెండు దెబ్బలు కొట్టమంటే సంతోషముగాని క్షమించుమంటే సంతోషమా! తిన్నదెబ్బలకంటే,క్షమించుమనేదే ఆ అబ్బాయికి ఎక్కువ బాధగానుండెను. ఆలాగు క్షమించుమంటే ఇక్కడున్న వారిలో కూడ సణుగులు, గొణుగులు బైలుదేరును. సిలువమీద ప్రభువు ఆలాగే క్షమించుమనునప్పుడు, ఆయన ఎంతగా క్షమించినారో వర్ణించలేము. అయితే ఆయనకది బాధకాదా? ఇక్కడున్న వారిలో ఎవరికి ఎవరెవరు శత్రువులున్నారో, వారందరి దగ్గరకు వెళ్లి తలుపులు తట్టి వారిని లేపి, వారు నిద్ర కళ్లతో వస్తుండగా అయ్యా! నేను మిమ్ములను క్షమించినాను! అని అనగలరా? బాధ! అనలేరు. ఆ బాధే సిలువ. ఆ సిలువ ప్రభువు గనుక మోసినారు. మనము మోయలేము. ఆయన వారిని ఆ వేళ క్షమించకపోతే ఈ వేళ మనలనుకూడ


ఈ 5 ఏ క్రైస్తవుడు చేయగలడు? క్రైస్తవులందరు ఈ 5 చేయకపోయినా, ఒకటి చేస్తున్నారు. మా ఋణస్ధులను మేము క్షమించిన ప్రకారము, మా ఋణములు క్షమించుమని అంటున్నారు గాని యేసుక్రీస్తు చెప్పిన పై ఐదు అంశములు చేయకపోతే ప్రయోజనమేమి? పై నాలుగు చేయరుగాని ఐదవది మాటతో చేస్తున్నారు. గాన అది బూదిదలో పోసిన పన్నీరే. ఈ 7 వాక్యములలో క్రీస్తుయొక్క మనుష్యత్వము, దైవత్వము రెండు వెలుగు స్ధంభములుగా సిలువమీద నుంది సింహాసనము వరకు వెళ్లినవి.


అనగా ఈ రోదనశ్రమలన్నీ ఒక ఎత్తు; క్షమించుమనే మాటలోని శ్రమ ఒక ఎత్తు. మీకు హానిచేసిన వారిని ఎప్పుడు క్షమిస్తారో, అప్పుడు మీకు జయము. శత్రువులకు అపజయము.

ధ్యానము:- కుడిప్రక్కనున్న మంచి సంగతులు మరచి పోవలెను. ఎడమ ప్రక్కనున్న చెడ్డ సంగతులుకూడ మరచి పోవలెను. మధ్యను కల్వరికొండపైనున్న రక్షకుని మాత్రమే జ్ఞాపకము తెచ్చుకొనవలెను. మనో నేత్రములతో చూడండి. ప్రభువు సిలువమీద పలికిన 7 మాటలు ఆలోచిద్దాము. ఒక్కొక్క రోజు ఒక్కొక్క మాట ధ్యానిద్దాము. ఈ వేళ క్షమాపణనుగూర్చి ఆలోచించెదము. ఇతర తలంపులు రాకమానవు, అయినను వాటిని పారద్రోలండి. యేసుప్రభువును మాత్రము తలంచండి. ఆయన బాధలు తలంచవద్దు. సిలువను తలంచుకొనవలెను. ఆయన పలికిన మాట మాత్రమే తలంచుచు, తండ్రీ! 'వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము.' ఈ మాటను జ్ఞాపకము చేసుకొందాము. సూర్యునిలో 7 రంగులున్నవి. అలాగే నీతి సూర్యుడైన క్రీస్తులోనుండి 7 రంగులుగల 7 మాటలు బయలుదేరినవి. ఒక్కొక్క మాటకు ఒక్కొక్క రంగు. సూర్యుని యొక్క కిరణములు భూమిమీద పడుచున్నవి. అట్లే ప్రభువుయొక్క మాటనుంచి 7 రంగులుగల మాటలు అనెడి కిరణములు విశ్వాసులమీద పడుచున్నవి.


ప్రార్ధన:- యేసుప్రభువా! నీవు మాకు బదులుగా వచ్చినందున దేవా! అని పిలువలేదు, తండ్రీ! అని పిలిచినావు. ఈ మాటలో నీకు గల గొప్ప పరిచయము కనబడుచున్నది. అట్టి పరిచయము, తండ్రీ! అని పిలిచే పరిచయము లేనియెడల, శత్రువులను క్షమించుమనునట్టి ప్రార్ధన రాదు. తండ్రీ! అంటేనే, క్షమాపణ ప్రార్ధన చేయవీలున్నది. ఎందుకనగా తండ్రి క్షమించువాడు. మనుష్యులు క్షమించగలరు గాని, పూర్తిగా తండ్రే క్షమించగలడు. యేసుప్రభువా! మేముకూడా మా శత్రువులను క్షమించుమని ప్రార్ధించే చనువు మాకు దయచేయుము.'తండ్రీ! నీ కుమారుడు ప్రార్ధించిన ప్రార్ధన, మాకును వచ్చునట్లు చేయండి' అని ప్రార్ధన చేయండి. దైవశక్తి ఉంటేనేగాని క్షమించలేము. రక్తము కారేటప్పుడు ఎవరు అట్లు ప్రార్ధింపగలరు? దైవశక్తియుంటేనేగాని ఆలాగు చేయలేరు. ఓ తండ్రీ! మా శత్రువులను క్షమించుటకు మాకు దైవశక్తి దయచేయుము. క్షమించే శక్తియు, క్షమించుమని ప్రార్ధించే శక్తియు దయచేయుము. ఈ రెండు శక్తుల కొరకు ఇప్పుడు యేసు పలికిన ఈ మాటలలో మొదటిది ధ్యానించెదము:


తండ్రి, వారిని క్షమించునని ఆయన నిరీక్షించినాడు. అందుచేతనే 70సం||ల వరకు యెరూషలేము నాశనముకాకుండ ఉన్నది. క్షమాపణ స్ధితిలో, కృప పొందిన స్ధితిలో ఉన్నది. ఈ ఒక్క ప్రార్ధనలో 7 రంగులున్నవి. 7 సంగతులున్నవి. యేసుప్రభువా! నీవు క్షమాపణ ప్రార్ధన చేసినావు. అందులో 7 సంగతులు కనిపెట్టినాము గనుక నీకు వందనములు.


  • 1) ఊహకైనా
  • 2) దర్శనముకైనా
  • 3) మనో నేత్రముకైనా



ఆయన క్షమాపణ రూపము కనబడి తీరవలెను అప్పుడే నేటి సాయంకాల ధ్యానము ఆయనకు ఇష్టమైన ధ్యానము కాగలదు.

పాత నిబంధన కాలములో శత్రువులను క్షమించుమని భక్తులు ప్రార్ధన చేయలేదు. ఇక్కడ ఆలాగులేదు, క్షమించుమని ప్రభువు ప్రార్ధించినారు. ఇది క్రొత్త నిబంధన. స్తెఫెను ఇట్టి ప్రార్ధనయే చేసెనని అపోస్తలుల కార్యములో ఉన్నది. అయితే, ఇందులో ఒక్క బేధము ఉన్నది. స్తెఫెను, ప్రభువు చేసిన ప్రార్ధన జ్ఞాపకము వచ్చి చేసెను గాని ప్రభువైతే స్వయముగా చేసెను. గనుక ప్రభువు చేసినదే గొప్పది. మరియొక ప్రార్ధన చెప్పుదును. అది వందన సమర్పణ.


అట్టి క్షమాపణతో కూడిన కృతజ్ఞతా స్ధితిలో వరుడు మిమ్మును స్ధిరపర్చును గాక. ఆమేన్.


ప్రార్ధన:- యేసుప్రభువా! శత్రువులను క్షమించుమని నీవు కోరుట మాత్రముకాక, తరువాత వచ్చిన విశ్వాసులకును, ఆ మాదిరి నేర్పినావు. వారిలో ఒకడైన స్తెఫెను అట్టి ప్రార్ధన చేసినందుకు నీకు వందనములు. ఇదే చివరి ప్రార్ధన. యేసుప్రభువా! మేము ఇప్పుడు చేసిన ప్రార్ధనలకు నీవే 'ఆమేన్' అని చెప్పుమని వేడుకొనుచున్నాము. యేసుప్రభువా! నీలో క్షమాపణ నైజము ఉన్నందువలన లోకము నీ యొద్దకు నిర్భయముగా రాగలదు. మేము ఎంత పాపాత్ములమైనను, మమ్మునుకూడ నీవు రక్షిస్తావు, క్షమిస్తావు, ప్రేమిస్తావు, మేలు చేస్తావు, దీవిస్తావు, మా నిమిత్తమై విజ్ఞాపన ప్రార్ధన చేస్తావు. కాబట్టి మేము మీ ఋణము తీర్చుకోలేము. గాని కేవలము వందనములు మాత్రమే చెప్పగలము. ఈవేళ మాట్లాడుకొన్న మాటలు అన్నిటి నిమిత్తమై మీకు వందనములు. ఆమేన్.


కీర్తన: "దేవుండవు కాని యెడల - నిన్ను - తిప్పి చంపువారిన్ - క్షమియింపగలవా = జీవమైయుండని యెడల - నిన్ను - చావు దెబ్బలు గొట్ట - సహియింపగలవా!" ||ఏడు||