లెంటులోని పంతొనిమిదవ దినము – భుధవారము

మత్తయి 26:63-64

ప్రార్ధన:- ప్రభువా! మా మీదికి రావలసిన ఐదు తీర్పులు తప్పించుకొనుటకుగాను నీవు తీర్పుపొందినావు గనుక అవి నాకు రాకుండా చేసినావు గనుక మాకు శిక్ష రాదు. నీ వందనములు. ఇంకా ఎన్ని ఉన్న ఆ తీర్పులుకూడ పొందినావు. మాకు అవి రావు. నీకు వందనములు. దయగల ప్రభువా! మా తీర్పులు పొందిన నీకు వందనములు. మాకు విమోచన దీవెన దయచెయుము. ఆమేన్.


ఈ శ్రమ చరిత్ర కాలములో రెండు కోర్టులు గలవు.

యేసుక్రీస్తు ప్రభువు ఈ రెండు కోర్టులకు వెళ్లవలెను. యేసు నజరేతులో పుట్టి యూదయ, గలిలయ, సమరియ సిరియా దేశలలో సువార్తచేసి తిరుగుట ముగించెను. ఇప్పుడు కోర్టులకు పోవలెను, తరువాత సిలువ దగ్గరకు పోవలెను. ఆయన తనను ప్రత్యక్ష పరచుకొనుటకు వచ్చెను గనుక అందరికి కనబడవలెను. గనుక పై ప్రదేశములోని ప్రజలకు కనబడెను. రేపు కోర్టులలో కూడ తన్ను ప్రత్యక్ష పర్చుకొనవలెను గనుక ఆయనే వెళ్ళెను. రేపు ఎవరు కూడ ఆయన మాకు కనబలేదు అనకూడదు. యూదులకు కనబడుటకు వారి మత కోర్టులకును, రోమా గవర్నమెంటుకు కనబడుటకు ఆ కోర్టుకును ఆయన వళ్ళెను.


ఇప్పుడు మత కోర్టులో ఆయన దగ్గర వాంగ్మూలము తీసికొని తీర్పు వ్రాయవలెను. తాను ముందు ఇక్కడ తీర్పు పొందవలెను, ఆ తరువాత గవర్నమెంటు కోర్టులో తీర్పు నిర్ధారించబడవలెను. రేపు వెయ్యండ్ల తరువాత సజీవుల తీర్పులో, ఆయనే వారి వాంగ్మూలము తీసికొని; 'వెయ్యేండ్ల బోధ విన్నారు గాన మీ తీర్మానమేమి?' అని అడిగి తెలుసుకొని తీర్పు చెప్పవలెను. ముందు కధ అయిన తరువాత తీర్పు. అలాగే ప్రభుని కధ అయిన తరువాత తీర్పు.


ఎందుకు ఆయనకా తీర్పు?: మనము పొందవల్సిన తీర్పులనుండి మనలను తప్పించుటకు ఆయనే ఆ తీర్పులు పొందెను. మనముందున్న తీర్పులు ఏమనగా:

మరణము ఒక తీర్పు:- ఈ తీర్పులన్నియు ఆయన చేయవలెను గనుక ముందు ఆయన తీర్పు పొందవలెను.

ముందు మతములో తీర్పు: అక్కడ వాంగ్మూలము కొరకు ప్రశ్న అడిగిరి.

ఇవి చెప్పితే సిలువ వేయరు. సరిగా చెప్పితే నమస్కారము చేయవలసినది. మత గురువులు ఈ ప్రశ్నవేసిరి. వీరికి ముందు మత్తయి 4వ అధ్యాయములో నీవు దేవుని కుమారుడవా! అని సైతాను అనెను. అప్పుడు సైతాను వేసిన మెదటి ప్రశ్న 'నీవు దేవుని కుమారుడవైతే రాళ్లు రొట్టెలు చేసికో' ను చివరిగా మత గురువులు వేసిరి . నేను దేవుడను, దేవుని కుమారుడను అంటే యూదులకు సంతోషము. ఇదే యూదులకు సరిపోవును. లోకస్తులకు దేవుని కుమారుడన్న ఒప్పుకొనరు. దేవుడనవలెను. వీరు పాతనిబంధన ప్రజలు, వాగ్ధానాలు విన్నారు గనుక దేవుని కుమారుడన్న ఒప్పుకొందురు.


ఉదా:- ఏమండో ఆయన దొర కొడుకు అంటే 'దొర' అన్న మాట. అలాగే దేవుడంటే యూదులకు తెలుసు. ఇదే ప్రశ్న బయట వేసిరి. జవాబు చెప్పెను. గాని నమ్మలేదు! ఆ ప్రశ్న ఇక్కడ వేసిరి. ప్రభువు నేను దేవుడను అనియు, దేవుని కుమారుడను అనిన యెడల బాగుండును. జవాబు: ఆ రెంటికి 'నీవన్నట్టే' అనెను.

ప్రభువు ఇంకా చెప్పెను

మత్తయి 2:64లో కోర్టు మొదలు ఆరోహణము తరువాత రేప్చరు వరకు తండ్రి కుడిపార్శ్వమున కూర్చుండును. తరువాత రేప్చరు వచ్చును. నీవు గురువువా? నా రాకడ గూర్చి చదివినారా! చూచుకొనండి. రేపు ఆరోహణము అగుదును అని శపదం చేసెను. మీ కోర్టు సిలువ, మరణము తప్పించుకొని మిమ్ములను తప్పించుకొని ఆరోహణమౌతాను రేప్చరులో వస్తాను అని సవాలు చేసెను.


మనము ఈ లోకస్తుల మధ్య జీవించినంత కాలము మతస్తుల ఎదుట మన వారి ఎదుట సాక్ష్యమియ్యవలెను. పై నాలుగును ఇవ్వవలెను.

ఈ నాలుగు సాక్ష్యమియ్యవలెను. చెప్పవలెను. ఆయన ఇచ్చినట్లే, మనమును 4 సాక్ష్యాలిచ్చిన రేప్చరులో పోదుము.

ఆలాగు సాక్ష్యమిచ్చు శక్తి, ధైర్యము ప్రభువు మీకు దయచేయును గాక. ఆమేన్.


కీర్తన:
1) "నిరపరాధి యైన తండ్రిని - నిలువబెట్టిరి = దొర తనము

వారి యెదుట - పరిహసించిరి' ||పాప మెరుగనట్టి||

2) తిట్టినను మరల వారిని - తిట్టడాయెను = కొట్టినను

మరల వారిని - కొట్ట డయెను" ||పాప మెరుగనట్టి||