(యం. దేవదాసు అయ్యగారి ఉపదేశములు)
కష్టకాల ప్రార్ధన
దేవుని ప్రార్ధించిన యెడల ఇప్పుడు ప్రవేశించిన జ్వరాలు అంతరించును.
ప్రార్ధన:-
- దేవా! ఆకాశమును, భూమిని కలుగజేసిన సృష్టికర్తా! మమ్మును కలుగజేసిన తండ్రీ! నీకు అనేక నమస్కారములు.
- మా పాపములు క్షమించుము.
- ఇకమీదట మాకు తెలిసిన ఏ పాపము చేయకుండ మాకు శక్తి దయచేయుము.
- మా జబ్బు తీసివేయుము.
- మాకు పూర్ణారోగ్యము అనుగ్రహించుము.
- మమ్మును లోకములోని వారందరిని దీవించుము.
- నీ విషయములు, నీ పద్ధతులు, నీ బోధలు, నీ ప్రేమ తెలిసికొనగల జ్ఞానశక్తిని మాలో పుట్టించుము.
- దేవా! నిన్ను తప్ప ఎవరిని ఆరాధింపము. నిన్నే తలంచుకొని, నిన్నే మొక్కి నిన్నే ప్రార్థించుచు, నిన్నే నమ్ముకొందుము. ఆమేన్.