(యం. దేవదాసు అయ్యగారి ఉపదేశములు)
వేదపఠనము చేయకపూర్వము చేయవలసిన ప్రార్థన
-
వాక్యమును వ్రాయించిన తండ్రీ! నేనిప్పుడది చదువబోవుచున్నాను. దీనిలోనుండి నాతో మాటలాడుము. నీ మాట నాకు వినబడునట్లు
చేయుము.
ఆమేన్.
-
పరిశుద్ధుడవైన దేవా! నీ పరిశుద్ధ గ్రంథములో వ్రాయించిన వ్రాతలు నా హృదయములో కూడ వ్రాయించుము. ఆమేన్.
-
మంచి ఊహలు కలిగించే తండ్రీ! నీ పరిశుద్ధ గ్రంధము చదువుకొనునప్పుడు లేనిపోని ఊహలు రానియ్యక నీవు ఉద్దేశించిన ఊహలు
మాత్రమే
రానిమ్ము. ఆమేన్.
-
మాకు కనబడవలెనని కోరే తండ్రీ! నీ వాక్యములో మాకు కనబడుము. నీ హృదయమును మా హృదయమునకు కనబరచుము. ఆమేన్.
-
జ్ఞాన స్వరూపివైన తండ్రీ! నీ పత్రములోనున్న విషయములు నేను చదివిన తరువాత వాటిని మరువకుండా నా హృదయమందు భద్రము
చేసికొనే
శక్తిని వృద్ధి పొందించుము. ఆమేన్.
-
నిత్యుడవైన తండ్రీ! భూమ్యాకాశములు గతించినను నీ వాక్యము మాత్రము గతింపదు. అట్టి నీ వాక్యము అంతయు నాయొక్క (లేదా)
మాయొక్క
జీవితములో సరుదుకొనునట్లు (ఆవరించునట్లు) నీ పరిశుద్ధాత్మ యొక్క వెలిగింపు కలిగింపుము. నీ వాక్యగ్రంథము నీ
గ్రంథవాక్యము,
నీ భక్తులకు ఉత్తమ లేఖనముగా వినిపించి వ్రాయించిన నీ పరిశుద్ధాత్మ నాలో కూడా అట్టి పని చేయునట్లు, విద్యార్థులు
వ్రాత పుస్తకములో సిద్ధపరచురీతిగా, మా అంగీకార స్వభావమును కూడ సిద్ధపరచుము. ఆమేన్.
-
పోషకుడవైన తండ్రీ! నీ వాక్యమును మానవ బోధకులు కలహ కారణమగు భేదాభేదములైన బోధనలుగా ఉపదేశించుచున్నారు. కాబట్టి
సరియైన
అర్ధము
మాకు తెల్పుము. ఆమేన్.