(యం. దేవదాసు అయ్యగారి ఉపదేశములు)
అంధకారముపై అధికారమిచ్చే ప్రార్ధన
-
ఎ) ఓ దేవా! లోకములోనికి పాపమును ప్రవేశపెట్టిన సాతానుకు మాపై ఏ అధికారము లేకుండా చేయుము. శత్రువుయొక్క
బలమంతటిమీదను
అధికారము
ఇచ్చియున్నానని వ్రాయించిన దేవా! నీకు స్తోత్రం. పిశాచిని ఎదిరించుడి, అప్పుడువాడు మీయొద్దనుండి పారిపోవునని
వ్రాయించిన
ప్రభువా! వాడిని, వాని అధికారమును పారదోలే విశ్వానమును అనుగ్రహించుము. అపవాది తనయొక్క బలమును, జ్ఞానోపాయమును,
సర్వాధికారమును
ఉపయోగించుచున్నప్పుడు నీవు వ్రాయించిన మాటలు మాకు జ్ఞాపకముచేసి మాకు ధైర్యము, బలము దయచేయుము. నీ వాక్యము ఎట్లు
ఉపయోగించితే
అతడు పారిపోవునో మాకు నేర్పుము. అతని అధికారమునకు మా హృదయములో ఏమాత్రమును ఇష్టాంగీకారము చూపకుండునట్లు నీ కృప
దయచేయుము.
ఏ
చిన్న విషయములోనైనా అతని అధికారమునకు ఒప్పుకొనకుండునట్లు మాకు పవిత్రమైన నిష్ట దయచేయుము.
ఓ ప్రభువా! నీవు అపవాదిని
జయించియున్నావు. గనుక అతని అధికారమునకు కూడ జయింపబడినదని గ్రహించుచున్నాము. నీకు వందనములు. అతడు ఎంతో
అధికారమున్నట్లు
చూపించేటప్పుడు సహితము, అతనికి అధికారము లేదనే తలంపు మాకు జ్ఞాపకము చేయుము. అపవాది జయింపబడిన శత్రువని మేము
మరువకుండునట్లు
నీ కృప దయచేయుము. అపవాది బంధింపబడిన వాడనియు అపవాది యొక్క క్రియలను లయము చేయటకు, దేవుని కమారుడు ప్రత్యక్షమాయెను
అనే
వాక్యము
నీ గ్రంథములో నున్నదనియు, ఈ వాక్యమే మాకు అపవాది మీదను, అతని క్రియలమీదను, మాకు జయమిచ్చినదనియు మాకు జ్ఞాపకము
చేయుము.
“అనేకమందిని అనగా గొప్ప గొప్ప వారిని సహితము మోసపర్చిన అతడు మమ్మును మాత్రము మోసపర్చడా?” అనే తలంపు అతని రాజ్యము
నుండి
వచ్చిన తలంపే అని మాకు జ్ఞాపకము చేయుము. ఆమేన్.
-
బి) ఓ దేవా! సైతాను కారణముచేత మానవులమైన మాలో ప్రవేశించిన నైజమునకు మామీద అధికారము లేకుండా చేయుము. అపవాది
క్రియలకు
లయము.
క్రీస్తు యేసు రక్తము, శరీరములకు జయము. “ఈ శరీర నైజము, ఈ శరీర భూస్థాపనైనప్పుడే పోవును. గాని మరియెప్పుడు పోదు”
అని
లోకులు
అనేమాట లెక్కచేయము. ఎందుకనగా మాకు నూతన సృష్టి దయచేయుదువని నీ వాక్యములోయున్నది. గనుక అది మాకు దయచేయుము.
ఓ దేవా! నీవు ఒకప్పుడు భూమిమీద ఉన్నప్పుడు మనుష్యనైజము కల్గియున్నప్పటికిని నరునిలోని నరస్వభావమును కల్గియుండలేదు.
నీకు
స్తోత్రము. అయితే పవిత్రమైన నరస్వభావమే ధరించుకొన్నావు. స్తోత్రములు. అందుచేతనే నరస్వభావమును నీవు పరిహరింపగలవు.
ఆది
తల్లిదండ్రులకు నీవిచ్చిన పరిశుద్ధత, నరస్వభావము మాకును ఇవ్వగలవు నీకు స్తోత్రము.
ఓ దేవా! మాలోని మానవ స్వభావమును నీవు తీసివేయుము. దీనిని నీకు అర్పించుచున్నాము. మరల ఈ స్వభావమును గూర్చి
ఆలోచించుట
వల్ల
దీనిని మరల తీసివేసికొనము. ఈ నైజస్తానమునందు నీ నైజమును స్థాపన చేయుము. అప్పుడు మా నైజములోనుండి మాకు మంచి
తలంపులు,
మంచి
వినికిడి, మంచి చూపు, మంచి పాటలు, మంచి చర్యలు, మంచి క్రియలు, మంచి బ్రతుకు కల్గును. నీకు స్తోత్రము. ఓ ప్రభువా! నీ
మానవ
స్వభావమునకే మాలో అధికారముండును గాక! ఆమేన్.
-
సి) ఓ దేవా! ఆ విధముగానే మానవ నైజముయొక్క సంబంధమైన వన్నియు హరించునట్లు చేయుము. మానవ నైజమును మా స్వంత ఇష్టముతో
నీకు
సమర్పించే మనస్సు దయచేయుము.
దేవా! దేవా! మా పాతనైజము పోవుట మాత్రమేగాక అది మరలా రాకుండా చేయుము. మాకు నూతన
నైజము
వచ్చుట
మాత్రమేగాక అది వెళ్లిపోకుండ చేయుము. "విత్తే వారిలోను, నీరు పోసేవానిలోను ఏమిలేదు. మొలిపించే దేవునిలో యున్నది"
అనే
నీ
వాక్యప్రకారము మేము యోచించిన యెడల; నీ కృపవల్లనే మేము రక్షింపబడుదుము. గాని వేరుకాదు. నా స్వనీతివల్ల నాకేమియు
దొరుకదు.
మేము
మా కోరికమీదయైనను, మా పాటమీదనైనను ఆనుకొనము. నీ కృపమీద ఆనుకొంటాము. అయినప్పటికిని ప్రయత్నమును, పాటును,
కల్గియుందుము
నీ
కృప
దయచేయుము.
ఓ దేవా! మా నైజము ఎట్టి నైజముగా ఉండుట నీకు ఇష్టమో, అట్టి నైజముగా మారుటకు నీ కృప దయచేయుము,
స్థిరపర్చుము.
ఓ
దేవా!
సైతానుగాని, పాపముగాని, వ్యాధిగాని, చావుగాని, నరకముగాని, తుదకు నైజముగాని మామీద అధికారము చేయనీయకుము. వాటికి
మామీద
అధికారములేదు. “అవి మమ్మును కలుగజేయలేదు, మాలో పరిశుద్ధ దీపము వెలిగించలేదు” ఇట్లు అనే ధైర్యము మాకు దయచేయుము.
మా
విషయమై
రక్తము ధారపోయలేదు ఇట్లు అనే ధైర్యము మాకు దయచేయుము.
కోపము, అసూయ, గర్వము, మందము, సాదించే మనస్సు, విసుగుదల,
సహించలేని
గుణం,
భయపడుట, అవిశ్వాస పడుట, మూలుగుట, సణగుట, పరాకు, పరధ్యానము, పట్టించుకొనుట, అత్యాశ, ఆతురత, అమితవ్యయం, బాధ్యత
లేకుండుట,
సోమరితనము, అజాగ్రత్త, నిర్లక్ష్యము గడిపివేయుట, కౄరత్వం, దుర్ వాంఛ, వృధాచేయుట, నిరాశ ఈ మొదలైన వాటిని ఓ దేవా!
మాలోనుండి
తీసివేయుము. మాలోపలి నుండి ఏమి వచ్చునో ఆ చెడుగును, శోధనను, ఆ కష్టమును నీమీద వేసి అనగా మా యావత్తు చింత నీమీద
వేసి
నిర్భయముగా యుండే నైజము మాకు దయచేయుము. మాకు ఏ కీడు వచ్చునో ఆ కీడును నీవు సద్వినియోగము పర్చుము. దానివలన ఏదో ఒక
మేలును
కూడ
రప్పించగలవు. నీ కృప మా విషయములో ఎంతపనియైనను చేయగలదని నమ్ముచున్నాము. నీ చిత్తమైతే కీడును తొలగించగలవు. కీడు
రాకుండ
చేయగలవు.
కీడు వచ్చిన పిమ్మట కీడుకు మించిన మేలుకూడ అనుగ్రహించగలవు. నీవు సర్వశక్తిగల వాడవును, జ్ఞానోపాయము గలవాడవును
అగుటవల్ల
సంగతులను ఎటుబడితే అటు
(త్రిప్పగలవని నమ్ముచున్నాము).
ఓ దేవా! మేలు కలిగినపుడు మేమెంత సంతోష భరితులమౌదుమో, కీడు వచ్చినప్పుడును, ఆ
రీతిగానే
సంతోషించే ఆత్మను దయచేయుము. కీడు మాకు వినబడినప్పుడు, "మా తండ్రి మాకు ఇదివరకు ఉన్న దీవెనకంటే గొప్ప దీవెన
అనుగ్రహించే
సమయము
వచ్చినదని" ఆనందించే ఉద్రేకము అనుగ్రహించుము. పిల్లవాడుగా ఉన్నప్పుడు తల్లిదండ్రుల ప్రేమను బాగుగా తెలిసికొనును.
ఆలాగుననే
ఓ
దేవా! కీడు వచ్చినప్పుడు నీ ప్రేమను మేము ఎక్కువగా తెలుసుకొనే జ్ఞానము దయచేయుము. ఏలియాకు నీళ్లు వచ్చే మార్గము,
రొట్టెలు
వచ్చే మార్గము మూయబడినప్పుడు అప్పములు వచ్చినవి. అరణ్యములోకంటె శ్రేష్టమైనవి మరియొక విశాల మార్గము సిద్ధమై యుండెను.
అట్లే
ఓ
తండ్రీ నీ బిడ్డలకు సహాయము ఒక విధముగా ఆగిన యెడల మరియొక విధముగా రప్పించెదవు. ఎందుకనగా అన్నీ నీ స్వాధీనములో
ఉన్నవి.
అన్ని
నీకు లోబడును.
ఓ దేవా! ఏదైన కీడు వచ్చేటప్పుడు దానికి మేముకారకులమైయున్న యెడల మాకు దిద్దుబాటు అనుగ్రహించుము. మంచి
విషయములు
కనబడనప్పుడు, మా నైజము స్థిరముగా కదలకుండునట్లు కాపాడుము. ఓ ప్రభువా! వర్షింపకుండునట్లు మేఘములు
బంధింపబడినప్పుడును,
సూర్యరశ్మి కనబడకుండునట్లు సూర్యుడు మరుగైనప్పుడును, గాలికి వృక్షములు స్థానము తప్పినప్పుడును, సమస్తము అంధకారముగా
తోచినప్పుడును, నలుదిశలా కీడే తలెత్తి చూచినప్పుడు సహితము మేము నిరాశ చెందక, స్థిరనైజమును, విశ్వాస నైజమును
కలిగియుండే
కృప
దయచేయుము. ఆమేన్.