(యం. దేవదాసు అయ్యగారి ఉపదేశములు)
సాతానును బంధించు ప్రార్థన
(ఈ ప్రార్థన ప్రతి దినము చేసిన మేలు కలుగును)
- 1. ఓ మా తండ్రీ! నీ సంఘము ఎదుట పాతాళ లోక ద్వారములు నిలువబడనేరవని మత్తయి 16:18లో వాగ్ధానము చేసియున్నావు. కాబట్టి నీకు స్తోత్రములు.
- 2. ప్రధానదూత పాపము చేసినప్పుడు వానిని విడిచిపెట్టక పాతాళమందలి బిలములో, కటిక చీకటిలోకి త్రోసి, తీర్పు వరకు బంధించినావు. గనుక పిశాచములు, దయ్యములు, మృత్యుదేవత, కర్మ దేవతలన్నిటికిని అధికారియగు సాతానును పాతాళమందు బంధించినావు. కాబట్టి నీకు వందనములు.
- 3. లూసిఫర్ అను ప్రధాన దూతను నరకములో ఒక మూలకు తోసివేసినావు, కావున వందనములు.
- 4. పాములను, తేళ్ళను త్రొక్కటకు, శత్రువు బలమంతటిమీద మాకధికారమిచ్చిన తండ్రీ! నీకు వందనములు.
- 5. సాతానుకు సమాధిలేదు, వాడు పారవేయబడిన కొమ్మ, ఖడ్గము చేత పొడవబడినవాడు. అనగా విశ్వాసుల వాక్య ఖడ్గము, స్తుతుల ఖడ్గము, ఆత్మ ఖడ్గము, ప్రార్థనా ఖడ్గము, నరహస్త ఖడ్గముచేత పొడవబడినవాడు. ఈ రీతిగా సాతానును జయించు శక్తి ఇచ్చిన తండ్రీ! వందనములు.
- 6. చచ్చినవారి శవములచేత కప్పబడినవాడు, త్రొక్కబడిన పీనుగువంటివాడు, మట్టులేని గోతిలోనికి దిగిపోయెడివాడు, మా కాళ్ళచేత చితక ద్రొక్కబడేవాడు సాతాను. సాతానును జయించు సిలువపై నుండి యేసుప్రభువా! నీవు త్రొక్కిన రీతిగా సాతానును జయించే శక్తి, బంధించే శక్తి ఇచ్చిన తండ్రీ! నీకే మా హృదయపూర్వక వందనములు. ఆమేన్.