(యం. దేవదాసు అయ్యగారి ఉపదేశములు)

దేవోక్తి ప్రార్ధన



ఆదామునకు భాష నేర్పిన తండ్రీ. నీకు స్తోత్రము. మానవజాతికి భాష నేర్పిన తండ్రీ! నీకు స్తోత్రములు. లోకములో ఎన్నో లోకోక్తులున్నవి. సర్వోక్తులు, చలోక్తులు, సరసోక్తులు అలంకారోక్తులు పలుకుట లోకమునకు అవసరము. జ్ఞానోక్తులు, జీవోక్తులు, ధీయోక్తులు పలుకుట నీవశము. అయితే తండ్రీ! నీ రాక కొరకు ఎదురు చూచుచు, లోకములో రాకడ వర్తమానము ప్రకటించుచు సిద్ధపడుచున్న నీ బిడ్డలమైన మాకు నీ చిత్తమైతే దేవోక్తి దయచేయుము. తదికాలములో ప్రవక్తలద్వారా దేవోక్తులు మాట్లాడినావు. అంత్యకాలము సమీపించగా ప్రవక్తలను పంపుదునని వాగ్ధానము చేసినావు.


యెషయా నోటిని ముట్టి, అగ్నిలో దహించినావు. ఈ రీతిగా నీ చిత్త ప్రకారముగా నా నోరును ముట్టి, పరిశుద్ధాత్ముని అగ్నిలో దహించి, నీవే మాలోనుండి దేవోక్తులు మాట్లాడించుము అవసరమైన దేవోక్తులు వాడుకొనునట్లు నీ కృప దయచేయుమని వేడుకొనుచున్నాము. ఆమేన్.