(యం. దేవదాసు అయ్యగారి ఉపదేశములు)
ఉదయమున లేచినప్పుడు చేయవలసిన ప్రార్థన
-
ప్రేమగల తండ్రీ! మా మీదనుండి గడిచిపోయిన రాత్రికాల విపత్తులనుండి కాపాడి, ఈ ఉదయమున మమ్ములను లేపి, మరియొక దినము
అనుగ్రహించినందుకు నీకు వందనములు. ఆమేన్.
-
సృష్టికర్తవైన తండ్రీ! నేటి దినమున నేను చేయవలసిన పనులలో నాకు తోడై యుండుటకు నీవు కూడ నాతో కలిసి పనిచేయు తండ్రివై
యుండుము.
ఆమేన్.
-
ప్రభువా! మా ప్రవర్తన వలన నేటి దినమును పరిశుద్ధ దినముగా బైలుపరచుకొను ప్రవర్తనా శక్తి కలిగించుము. ఆమేన్.
-
దేవా! ఈ దినమున నీవు నాకు ఏమి చెప్పనైయున్నావో అది నాతో చెప్పుము. ఆమేన్.
-
రక్షకుడవైన దేవా! ఈ దినమందు మమ్ములను వేటినుండి రక్షింపవలెనో వాటినుండి రక్షింపుము. ఆమేన్.
-
మా కాపరివైన ప్రభువా! మమ్మును యే దారిని నడిపింప దలచుకున్నావో ఆ దారిని నడిపింపుము. ఆమేన్.
-
దానకర్తవైన ప్రభువా! మేము అనుభవించుటకు ఈ వేళ మాకు ఏమి అందించెదవో, అవి అందుకొనే సమర్ధత దయచేయుము. ఆమేన్.