(యం. దేవదాసు అయ్యగారి ఉపదేశములు)
భోజనము చేయునప్పుడు చేయవలసిన ప్రార్థన
-
మా పోషకుడవైన తండ్రీ! మేము జీవించునట్లు ఆహారమును ఒక పదార్ధముగా ఇచ్చినందున నీకు వందనములు. మేము భోజనము భుజించుట
వల్ల
నీకు
కీర్తి రావలయునని కోరుచున్నాము. ఆమేన్.
-
పోషకుడవైన తండ్రీ! మేము ఆహారమును సంపాదించే శరీరము నీవు మాకు దయచేస్తే,
నీవు
ఏర్పరచిన ఆహార పదార్ధములు సంపాదించగలము. అవి మాకు సమృద్ధిగా దొరికేటట్లు నీ దీవెన దయచేయుము. ఆమేన్.
-
పోషకుడవైన తండ్రీ! ఈ ఆహారము వల్ల రెండు మేళ్ళు దయచేయుము. మొదటిది అనారోగ్య నివారణ, రెందవది ఆరోగ్యార్ధమైన బలము,
పుష్టి
జ్ఞానము, ఆయుష్షు : ఇవి దయచేయుమని వేడుకొనుచున్నాము ఆమేన్.
-
పోషకుడవైన తండ్రీ! ఈ శరీరాహారము భుజించునప్పుడు మా
ఆత్మకు
నీవు
ఇచ్చుచున్న ఆత్మాహారము మాకు జ్ఞాపకము చేయుము. అప్పుడు మాకు రెండు సంతోషములు. ఆమేన్.
-
పోషకుడవైన తండ్రీ! విచారము, భయము, దిగులు, అనుమానము, అసహ్యము కలిగించు విషయములను భోజన సమయమందు మా మనస్సులోనికి
రానీయకుము
గాని సంతోషము కలిగించే సంగతులు మాత్రమే రానిమ్ము. ఆమేన్.
-
పోషకుడవైన తండ్రీ! లోకములో అనేకమంది బీదలున్నారు. వారికి ఆకలి తీర అన్నము దొరకదు. వారిని కనిపెట్టుము. అన్నదాన
సమాజములను
వర్ధిల్లచేయుము. ఆమేన్.
-
“నాకేమి కొదువ నాధుడుండ” అనే కీర్తన భోజన సమయమందు పాడుకొనవలయును. “పగవారల్ సిగ్గూ” అనే చరణముకూడ పాడుకొను కృప మాకు
దయచేయుము.
ఆమేన్.