(యం. దేవదాసు అయ్యగారి ఉపదేశములు)
సృష్టికొరకైన ప్రార్ధన
- 1. తండ్రీ! నీవు కలుగజేసిన సృష్టిలో ప్రతిజీవిని, ప్రతి వస్తువును, ప్రతి నిమిషము దీవించుచుండుము (యెషయా 27:3).
- 2. తండ్రీ! నీవు కలుగజేసిన సృష్టి అంతటికి నరవాక్కునిచ్చి క్రీస్తు ప్రభుని గురించిన నమాచారము, భూలోకములోనున్న ఒక్కొక్కరికి స్వప్నములోనో, దర్శనములోనో అందించుము.
- ౩. తండ్రీ! నీవు మా అన్ని ప్రార్ధనలు విన్నందుకు నీకు స్తోత్రములు. నీ లక్షణ స్తోత్రములతో పాటు సృష్టి యావత్తుచేత స్తుతి మోత మ్రోగించుము. ఆమేన్.