(యం. దేవదాసు అయ్యగారి ఉపదేశములు)
నీటికొరకైన ప్రార్ధన
ప్రార్ధన:- దయగల ప్రభువా! మాకిప్పుడు (మీ గ్రామము (ఊరు) పట్టణము పేరు) గుంటూరులో నీటి ఇబ్బంది ఉన్నది. హాగరుకు నీటి ఇబ్బంది ఉన్నది. హాగరుకు నీటి ఇబ్బంది కలుగగా ఎలుగెత్తి ఏడ్చినది. అదే పరిస్థితి మా గుంటూరుకు వచ్చినది. నీరు దొరుకు చున్నది గాని సరియైన నీరు దొరుకుటలేదు. హాగరుకు దొరికిన నీరు దొరుకుట లేదు. చిన్న పిల్లల మొర ఆకాశమునకు వినబడునన్నావు. ఎవరైనా నీ సృష్టే.
హాగరు నీ బిడ్డ గనుక నీవు నీళ్ల ఊట చూపావు. మేమును నీ బిడ్డలమే. గనుక మాకును అటువంటి నీటి ఊటలను చూపుము. అయితే హాగరు ఎలుగెత్తి ఏడ్చినది. మేము ఏడ్చుటలేదు. నీటి ఇబ్బందినిగూర్చిన ప్రార్ధన అని ఒక పత్రికను వ్రాసినాము. దీవించుము. ఒక పిల్ల మొరను వినియున్నావని ఉన్నది. అలాగే మా మొరనుకూడ వింటావు, మమ్మును రక్షించు నిమిత్తమై మా మొర ఆలకించుము. అన్యులు నీ బిడ్డలు అనగా ఏర్పాటు బిడ్డలు కాదుగాని సృష్టినిబట్టి నీ బిడ్డలే. గనుక దీవించుము. ఆమేన్.