(యం. దేవదాసు అయ్యగారి ఉపదేశములు)
తెగింపు ప్రార్ధన
-
ఓ ప్రభువా! నేను విసర్జించవలసిన వన్నియు విసర్జించే తెగింపు నాకు దయచేయుము.
-
ఓ ప్రభువా! నీవు నాకు చేసే సహాయము పూర్తిగా పొందే విశ్వాస స్తోత్ర కృతజ్ఞత కలిగియుండవలెనని కోరుచున్నాను.
-
ఓ ప్రభువా! నా భక్తిలో ఏ మాత్రమైన తగ్గింపులేకుండా చేయుము.
-
ఓ ప్రభువా! నిన్ను, నీ భక్తులను, నీ ఆజ్ఞలను నీ వరాలను సమానముగా ప్రేమించునట్లు పక్షపాతములేని మనస్సు నాకు దయచేయుము.
-
ఓ ప్రభువా! నేను వారి ప్రార్ధన మీదను, వీరి ప్రార్ధనమీదను ఆనుకొనక నా
ప్రార్ధనమీదను, పరిశుద్దాత్మ ప్రార్ధన సహాయము మీదను ఆనుకొనే ధైర్యము దయచేయుమని తండ్రీ! అని నిన్ను కోరి
ప్రార్థించుచున్నాను
ఆమేన్.