(యం. దేవదాసు అయ్యగారి ఉపదేశములు)
హింసకాల ప్రార్ధన
-
1. దయగల తండ్రీ! శ్రమలు రానైయున్నవని నీవు తరచుగా చెప్పుచున్నావు. గనుక మేము తప్పించుకొనుటకు ప్రార్థించుట న్యాయమే
గదా!
దేశాధికారులు మత సామరస్యమును కాపాడని యెడల క్రైస్తవులకు శ్రమ వచ్చునని మేము గ్రహించుచున్నాము. అయితే తప్పించుకొనే
ప్రార్ధన
చేయవచ్చును గదా! అది నీ చిత్తమైతే తప్పించుము.
-
2. మా కండ్ల ఎదుట, యోహాను 14:14లో "నా నామమును బట్టి మీరు నన్నేమి అడిగినను నేను చేతును" అను వాక్యములో “ఏమి” అనే
మాటను
జ్ఞాపకము చేసికొనుచున్నాము. ఏమి అడిగినను చేస్తానన్నావు గనుక శ్రమ కాలములో మమ్మును తప్పించుము.
-
3. ఓ ప్రభువా! యెరూషలేము నాశనమగునని తెలిసి నీ శిష్యులను ఉత్తరముననున్న దాను గోత్రములోని “పెల్లూ అనే గ్రామమునకు
పంపివేసినావు గదా! అలాగే మా బైబిలు మిషను విశ్వాసులను దాగొనేచోటికి పంపించుమని వేడుకొనుచున్నాము.
-
4. ఓ మా ప్రభువా! ఒక మాట ఉన్నది. అదేదనగా “తిరస్కరణి” విద్య. ఈ విద్య నేర్చిన వారు బజారులో నడుచుచుందురు గాని
ఎవ్వరికిని
కనబడరు. హింసకుల యొక్క కండ్ల యెదుట ఉన్నప్పటికిని వారికి కనబడరు. అట్టి విద్య, హింసకాలములో విశ్వాసులకు దయచేయుము.
-
5. సాధు సుందరసింగు ఒకప్పుడు రైలుబండిలో మొదటి తరగతి పెట్టెలో ప్రయాణము చేయుచుండెను. అదే పెట్టెలో కూర్చున్న దొరకు
కోపము
వచ్చి, దొరలు కూర్చున్న పెట్టెలో మీరు కూర్చుండ కూడదని గద్దించెను. ఆ దొర ఒక మూలకు వెళ్ళి కూర్చుండెను. సుందర సింగు
అక్కడనే
కూర్చుండెను
గాని నీవు ఆ దొరగారికి కనపడకుండ చేసినావు. బండి స్టేషనుకు రాగానే ఇద్దరును ఒకే పెట్టెలో నుండి దిగిరి. ఆ దొరగారు
నీవు
ఇంతసేపటి నుండి ఎక్కడనున్నావని సుందరసింగును అడిగెను. "నేనెక్కడికి వెళ్ళలేదు", ఇక్కడనే కూర్చున్నానని సుందరసింగు
జవాబిచ్చెను. అతడు ఏమైనాడో అని చింతించుచు కూర్చుండిన ఆ దొర ఈ విషయమునకు చాలా సంతోషించెను. అలాగే మమ్ములను కూడ
శత్రువులకు
కనబడకుండ చేయకూడదా?
-
6. మరియు ఓ తండ్రీ!, "నాకు దాగుచోటు నీవే" (కీర్తన 32:7) అని వ్రాయించినావు గదా! గనుక మమ్ములను శ్రమ సమయములో
దాచిపెట్టుమని ఈ
వాక్యమును బట్టి వేడుకొనుచున్నాము.
-
7. మరియు ఓ దేవా! నీవు యిర్మియాను దాచిపెట్టినావు గదా! (యిర్మియా 36:26) నీవు దాచిపెట్టిన ఎవరు కనుగొనగలరు? మా
ఇంటిలో
మేము, మా బిడ్డలు, పెట్టెలు, మంచములు అన్ని ఉండును గాని మేము ఎవ్వరికిని కనబడము. హింసకులు వచ్చి చూచి ఎవ్వరు లేరు
అనుకొని
వెళ్ళిపోవుదురు. గనుక విశ్వాసులను నీవే దాచిపెట్టమని మనవి చేయుచున్నాము.
-
8. మరియొక సంగతి. ఓ ప్రభువా! ఐగుప్తులో 10 తెగుళ్ళు కలిగినవి గాని అక్కడనున్న నీ బిడ్డలగు ఇశ్రాయేలీయులకు వీటిలో
ఏదియును
కలుగలేదు. ఎంత ఆశ్చర్యము! ఎంత అద్భుతము! ఎంత సహాయము! సంఘము యొక్క శ్రమకాల సమయములో అట్టి అద్భుతము మా యెడలను
జరిగించుమని
ప్రార్థించుచున్నాము.
-
9. ఓ ప్రభువా! ఒక దేశములో బొబ్బాయి అను ప్లేగు వచ్చినది. ఆ వ్యాధి ఆ దేశపు వారికే గాని, మా దేశము వారు అక్కడనున్నను
వారికి
రాలేదు. ఇతరులకు కూడ ఆ తెగులు తగులలేదు. నీవే వారిని కాపాడినావు. మమ్మును కూడ అట్లు కాపాడుమని నిన్ను అడుగుచున్నాము.
-
10. నీ విశ్వాస బిడ్డలైన మమ్ములను ఇతరులు హింసించిన, వారికి మేము లోకువ అయినట్టు కాదా! నీవు మమ్మును అట్టి సమయములో
కాపాడిన
యెడల నీవు గొప్ప దేవుడవని బుజువగును గనుక మమ్మును అట్టి సమయములో కాపాడుము.
-
11. పూర్వము రోమా చక్రవర్తుల కాలములో నీ విశ్వాసులకు హింసలు కలిగెను. ఒక గ్రామములో రోమా భటులు క్రైస్తవులను నరికి
వేయుచుండగా, 7గురు బుషులు వారికి భయపడి దగ్గరనున్న కొండ గుహలలోనికి పారిపోయి దాగుకొనిరి. వారు లోపల ప్రవేశింపగానే ఒక
సాలీడు ఆ
గుహ ద్వారమునకు గూడు అల్లివేసెను. లోపల ఆ బుషులు నిద్రపోయిరి. భటులు ఆ గుహ దగ్గరకు వచ్చి సాలీడు అల్లిన గూడును చూచి,
ఇది
చాలా కాలము నుండి ఉన్నది. గుహ లోపల ఎవరును ప్రవేశింపలేదని వెళ్ళిపోయిరి. తర్వాత ఆ బుషులు నిద్ర నుండి లేచి ఆకలి వలన,
ఏదైన
కొనుట ఏలాగు? అని అనుకొని, చంపివేస్తారను భయముతో వారిలో ఒకరిని చాటుగా వెళ్ళి, వస్తువులు తెమ్మని వారు పంపిరి.
అతడు గుహ
వెలుపలికి రాగానే అనేక క్రైస్తవ దేవాలయములను చూచి ఆశ్చర్యపడెను. పట్టణములోనికి వెళ్ళగా అందరు క్రైస్తవులే
తిరుగులాడుచుండిరి.
ఇదేమిటి? అని ఆశ్చర్యపడెను. దుకాణమునకు వెళ్ళి డబ్బు ఇచ్చి సరుకు ఇమ్మని అడుగగా, ఆ సరుకు అమ్మువాడు అదెప్పటి నాణము.
ఇప్పుడు
అది చెల్లుబడికాదు. ఆ రాజు చనిపోయినాడు అనిచెప్పెను. ఆ బుషి "క్రైస్తవులను చంపు ఆ రాజు లేడా"? అని అడుగగా అది 10
సంవత్సరములకు
పూర్వపు సంగతి అని చెప్పెను. ఇప్పుడు క్రైస్తవ రాజు కాన్ స్టంటైన్ రాజుగానున్నాడని చెప్పెను. ఆ బుషి మేము నిద్రించి
10
సంవత్సరములు అయినదా అని ఆశ్చర్యపడి, గుహలోని వారికి సంగతి తెలియజేయగా, వారందరు బయటికి వచ్చి సంతోషించిరి. మేము 10
సంవత్సరములు నిద్రించినామా అని వారును ఆశ్చర్యపడిరి. ఇట్టి అద్భుతము మా యెడలను జరిగించుమని ప్రభువా!
వేడుకొనుచున్నాము.
ఆమేన్.