(యం. దేవదాసు అయ్యగారి ఉపదేశములు)
మరణమును కొట్టివేయు ప్రార్థన
(మృతికి మృతి)
-
1. దయగల ప్రభువా! నీవు హిజ్కియాకు మరణ శాసనమును ప్రవచించినావు (2రాజులు 20:1-6). అయినను ఆయన ప్రార్ధించగా
కొట్టివేసినావు.
ప్రవచించినవాడవు నీవే. ప్రార్థించగా కొట్టివేసినవాడవు నీవే.
-
2. గవర్నమెంటువారు ఒక ఆజ్ఞ ప్రజలకు ఇచ్చినట్లయితే ప్రజలు అల్లరిచేయగా ఆ జి.ఓ (G.O) కొట్టివేస్తారుగదా! వారు జి.ఓ.
కొట్టివేయగా ప్రజలు జి.ఓ. కొట్టివేయబడినదని చెప్పుకొందురు గదా! మొదటిది గ్రంథములోనిది, రెండవది గవర్నమెంటులోనిది
ఎత్తి
ప్రార్థించుచున్నాము. నేనుకాదు, నా స్నేహితులున్నూ విజ్ఞాపన చేయుచున్నారు. నీవు విజ్ఞాపన వింటావు గదా! ఎలాగంటే
పేతురునకు
రేవు మరణము అనగానే సంఘమంతయు ప్రార్థించగా విని విడిపించినావు గదా! విజ్ఞాపనలు వింటావని నిన్ను స్తుతించుచున్నాము.
-
3. మత్తయి 19:26లో నీవు “ఇది మనుష్యులకు అసాధ్యమే గాని దేవునికి సమస్తమును సాధ్యమే” అని అన్నావు. యేసుప్రభువా!
గోజులాడిన
స్త్రీ ఉపమానము నీవే చెప్పినావు. దానిని ఆధారము చేసుకొని రోజూ అడుగుదును. నాకు మరణము కొట్టివేయుము. లూకా 11:5-13లో
రొట్టెలను
దయచేసిన స్నేహితుని కథ నీవు చెప్పినావు. సిగ్గుమాలి మాటిమాటికి అడిగినందున రొట్టెలు దొరికినట్లు నీవే వ్రాయించినావు.
గాన
సిగ్గుమాలి అడుగుచున్నాను. నేరవేర్చుము.
-
4. హిజ్కియాకు 15 సంవత్సరాలు ఆయుష్షు ఇచ్చినట్లు నేను 15 సంవత్సరాలు అడుగుటలేదు గాని ఎఫెసీ. 3:21లో ఉన్నట్లు (అడుగు
వాటన్నిటికంటెను, ఊహించు వాటన్నిటికంటెను అత్యధికముగా చేయ శక్తి గల దేవునికి.....మహిమ కలుగును గాక!) అది ఇది కలిపి
ఇమ్మని
అడుగుచున్నాను. కాబట్టి ఆయుష్కాలమిమ్ము.
-
5. లూకా 18:1-8లో విసుగకుండా ప్రార్థించమని నీవే అన్నావు, నీవే చెప్పినావు. నాకు విసుగుదలవున్నా
ప్రార్ధించుచున్నాను.
శరీర
బలహీనతవల్ల విసుగుదల ఉన్నా విసుగుదల ఉన్నదని నీకు తెలుసును గనుక 1) విసుగుదలను 2) మరణమును కొట్టివేయుము అనికూడా
ప్రార్ధించుచున్నాను.
-
6. ముసలితనములో చిగిరిస్తారని దావీదు కీర్తనలు 92:14-15లో ఉన్నది గదా! ఒకవేళ ముసలితనము వచ్చినా చిగిరిస్తారని నీ
వాక్యములో
నీవే చెప్పిన దానిని ఎత్తుకొని ప్రార్ధించుచున్నాను గాని కల్పించుటలేదు గదా!
-
7. 103వ దావీదు కీర్తనలో పక్షిరాజు యౌవ్వనమిస్తావని ఉన్నది గదా! అది ఎప్పుడు నాకిస్తావు? నేను వృద్ధాప్యములో నుంటే
యౌవన
బలమిస్తావని ఉన్నదిగదా! అది ఎప్పుడు నాకిస్తావు? నేను వృద్ధాప్యంలో ఉంటే యౌవన బలమిస్తావని వాక్యములో ఉన్నది. అది
పరలోకములోనే
కాదు, ఈలోకములోనూ ఇస్తావనే గదా!
-
8. నా నామమందు ఏది అడిగినా ఇస్తాను అని అన్నావు (యోహాను 14:14). వాక్యములో ఉన్నదే అడుగుచున్నాను గాని ప్రభువా!
క్రొత్తది
ఏది
అడుగుటలేదు గదా!
-
9. మార్కు 11:24లో చెప్పినట్లు జరుగక ముందే జరిగినదని నమ్మమన్నావు. జరుగకముందే జరిగిందని నమ్ముటకు ప్రయత్నము
చేయుచున్నాను.
గనుక నేను నమ్మినట్టేగదా! నీవు నెరవేర్చవలెను గదా!
-
10. ప్రభువా! సన్నిధి కూటములలో నాకేకాదు, అనేకులకు జవాబులిస్తున్నావు గదా! ఈ మరణమును కొట్టివేయుమని అడిగినవానికి
కొట్టివేసి,
ఎందుకు జవాబులివ్వకూడదు?
-
11. ప్రభువా! దుష్టస్వప్నాలు, దుష్టదర్శనాలు, పిశాచి దర్శనాలు కలుగునప్పుడు శరీరములో అనారోగ్యములు, మనస్సులో వేదనలు
ఉండును,
గనుక అవి కొట్టివేసి ఆదరణ కలుగజేయుమని వేడుకొనుచున్నాను. ఆమేన్.